"గ‌త‌కొద్ది రోజుల‌లో ఏళ్ల త‌ర‌బ‌డి బ్యాంకు చిక్కుకుపోయిన‌ త‌మ డ‌బ్బును ల‌క్ష‌మందికి పైగా డిపాజిట్ దారులు వెన‌క్కు తీసుకోగ‌లిగారు ఈ మొత్తం విలువ 1300 కోట్ల రూపాయ‌ల‌కు పైగా ఉంది."
"ఇవాల్టి భార‌త‌దేశం స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తోంది. ఇవాల్టి ఇండియా స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌నపెట్ట‌దు."
"పేద‌లు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఆవేద‌న‌ను అర్థం చేసుకుంటూ గ్యారంటీ మొత్తాన్ని 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పెంచాం."
"గ‌తంలో రిఫండ్ కు నిర్దిష్ట గ‌డువు లేదు. ప్ర‌స్తుతం 90 రోజుల‌లోగా తిరిగి చెల్లింపు చేయ‌డాన్ని త‌ప్ప‌నిస‌రి చేశాం."
"దేశ సుసంప‌న్న‌త‌లో బ్యాంకులు కీల‌క పాత్ర వ‌హిస్తాయి. అలాగే బ్యాంకుల సుసంప‌న్న‌త‌కు డిపాజిట‌ర్ల డ‌బ్బు సుర‌క్ష‌తంగా ఉండ‌డ‌మ‌మూ అవ‌స‌ర‌మే. బ్యాంక్ ను ర‌క్షించాలంటే డిపాజిట‌ర్లకూ ర‌క్ష‌ణ క‌ల్పించాలి."
"అభివృద్ధి చెంద‌న దేశాలు సైతం త‌మ దేశ ప్ర‌ల‌కు స‌హాయం చేసేందుకు ఇబ్బందులు ప‌డుతుంటే, ఇండియా మాత్రం దాదాపుగా స‌మాజంలోని ప్ర‌తి వ‌ర్గానికి నేరుగా స‌త్వ‌రం స‌హాయం అందించింది."
"జ‌న్ ధ‌న్ యోజ‌న కింద ప్ర

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ  న‌రేంద్ర మోదీ డిపాజిట‌ర్ల‌కు అగ్ర‌ప్రాధాన్యం- నిర్దిష్ట గ‌డువుతో 5 ల‌క్ష‌ల రూపాయాల వ‌ర‌కు న‌మ్మ‌క‌మైన డిపాజిట్ ఇన్సూరెన్సు చెల్లింపు న‌కు సంబంధించి ఢిల్లీలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు. కేంద్ర ఆర్థిక శాఖ‌మంత్రి , కేంద్ర ఆర్థిక శాఖ స‌హాయ మంత్రి, రిజ‌ర్వు బ్యాంకు గ‌వ‌ర్న‌ర్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. కొంత‌మంది డిపాజిట‌ర్ల‌కు ప్ర‌ధానంత్రి చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాన‌మ‌మంత్రి, బ్యాంకింగ్ రంగానికి ఈరోజు ఎంతో ముఖ్య‌మైన రోజు అని అన్నారు. దేశంలోని కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులు, ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న స‌మ‌స్య ప‌రిష్కారం కావ‌డం చూస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. డిపాజిట‌ర్స్ ఫ‌స్ట్ అన్న నినాదం స్ఫూర్తి అర్థ‌వంత‌మైన‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి నొక్కి చెప్పారు. గ‌త కొద్దిరోజుల‌లో ల‌క్ష మందికి పైగా డిపాజిట‌ర్లు ఏళ్ల‌త‌ర‌బ‌డి బ్యాంకుల‌లో చిక్కుకుపోయిన త‌మ మొత్తాన్ని పొంద‌గ‌లిగార‌ని చెప్పారు. దీని విలువ 1300 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఉన్న‌ట్టు ప్ర‌ధానమంత్రి చెప్పారు.

స‌కాలంలో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం ద్వారానే ఏ దేశ‌మైనా  త‌మ‌నుతాము ర‌క్షించుకోగ‌ల‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. అయితే సంవ‌త్స‌రాలుగా , స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌న‌బెట్టే ధోర‌ణి కొన‌సాగింద‌ని అన్నారు. ఇవాల్టి న‌వ‌భార‌త‌దేశం స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి చేస్తున్న‌ద‌ని అన్నారు. ఇవాల్టి ఇండియా స‌మ్య‌ల‌ను  ప‌రిష్క‌రించ‌కుండా ప‌క్క‌న పెట్టద‌న్నారు.

ఇండియాలో బ్యాంక్ డిపాజిట‌ర్ల‌కు ఇన్సూరెన్సు వ్య‌వ‌స్థ 1960ల‌లో వ‌చ్చింద‌న్నారు. మొద‌ట్లో బ్యాంకులో డిపాజిట్ చేసిన మొత్తంలో  కేవ‌లం 50 వేల రూపాయ‌ల‌వ‌ర‌కు మాత్ర‌మే గ్యారంటీ చేయ‌బ‌డేద‌న్నారు. దీనిని ఆ త‌ర్వాత ఒక ల‌క్ష‌కు పెంచార‌ని అన్నారు. బ్యాంకు మునిగిపోతే అలాంటి సంద‌ర్భాల‌లో ఖాతాదారులు కేవ‌లం ల‌క్ష‌రూపాయ‌ల వ‌ర‌కు మాత్రమే పొందే వీలుండేద‌ని  చెప్పారు. ఈ డబ్బుకూడా ఎప్పుడు చెల్లించాల‌నే దానికి నిర్దిష్ట గ‌డువు ఉండేది కాద‌న్నారు. “ఈ విష‌యంలో పేద‌ల ఆందోళ‌న‌ను అర్థం చేసుకుని , మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల ఇబ్బందుల‌ను అర్థం చేసుకుని మేం ఈ మొత్తాన్ని 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు పెంచాం. ” అని ప్ర‌ధానమంత్రి అన్నారు. ఇందుకు  సంబంధించిన ఇంకో స‌మ‌స్య‌ను చ‌ట్ట స‌వ‌ర‌ణ ద్వారా ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింది. ఇంత‌కుముందు రిఫండ్ కు సంబంధించి ఎలాంటి గ‌డువు ఉండేది కాదు. కానీ మ‌న ప్ర‌భుత్వం ఇప్ప‌డు 90 రోజుల‌లోగా అంటే మూడు నెల‌ల లోగా రిఫండ్ చేయడాన్ని త‌ప్ప‌నిస‌రి చేసింది. బ్యాంకు మునిగిపోయిన సంద‌ర్బంలో కూడా ఇది వ‌ర్తిస్తుంది.  అలాంటి సంద‌ర్భంలో డిపాజిట్ దారులు త‌మ డ‌బ్బును 90 రోజుల‌లోగా తిరిగి పొందుతారు అని ఆయ‌న చెప్పారు.

 దేశ సుసంప‌న్న‌త‌లో బ్యాంకులు కీల‌క పాత్ర‌వ‌హిస్తాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. బ్యాంకులు సుసంప‌న్నంగా ఉండాలంటే డిపాజిట‌ర్ల డ‌బ్బు సుర‌క్షితంగా ఉండ‌డం కూడా త‌ప్ప‌నిస‌రి అని ఆయ‌న అన్నారు. మ‌నం బ్యాంకును ర‌క్షించాల‌నుకుంటే డిపాజిట‌ర్ల‌ను కూడా ర‌క్షించాలి అని ఆయ‌న అన్నారు.

గ‌త కొద్ది కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్ర‌భుత్వ‌రంగానికి చెందిన ప‌లు చిన్న బ్యాంకుల‌ను పెద్ద బ్యాంకుల‌లో విలీనం చేయ‌డం జ‌రుగుతోంది. వాటి సామ‌ర్ధ్యం , స‌మ‌ర్ధ‌త‌, పార‌ద‌ర్శ‌క‌త‌ను అన్నిర‌కాలుగా దీనితో బ‌లోపేతం చేయ‌డం జ‌రిగింది.కో ఆప‌రేటివ్ బ్యాంకుల‌ను రిజ‌ర్వు బ్యాంకు ప‌ర్య‌వేక్షించ‌డంవ‌ల్ల‌, అది సాధార‌ణ డిపాజిటర్ల‌లో విశ్వాసాన్ని నింపుతుంద‌ని ఆయ‌న అన్నారు.
స‌మ‌స్య బ్యాంకు ఖాతాల‌తో మాత్ర‌మే కాద‌న‌, మారుమూల ప్రాంతాల‌కు బ్యాంకింగ్ సేవ‌లు అందుబాటులోకి తేవ‌డంలో కూడా స‌మ‌స్య‌లు ఉన్నాయ‌న్నారు. ఇవాళ  దాదాపు దేశంలోని ప్ర‌తి గ్రామంలో బ్యాంకు బ్రాంచి స‌దుపాయ కాని లేదా బ్యాంకింగ్ క‌ర‌స్పాండెంట్ కానీ వార‌కి 5 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉన్నార‌ని అన్నారు. ఇవాళ దేశంలోని సామాన్య పౌరుడు చిన్న లావాదేవీని సైతం ఎప్పుడైనా, ఎక్క‌డైనా 24 గంట‌లూ డిజిట‌ల్ గ చేయ‌గ‌లుగుతున్నాడ‌ని చెప్పారు.  ఇలాంటి ఎన్నో ర‌కాల సంస్క‌ర‌ణ‌లు భార‌త బ్యాంకింగ్ రంగం స‌జావుగా సాగ‌డానికి దోహ‌ద‌ప‌డుతున్నాయ‌ని అన్నారు. వందేళ్ల‌లో ఎన్న‌డూ ఎర‌గ‌ని విప‌త్తు వ‌చ్చిప‌డినా బ్యాంకింగ్ రంగం స‌జావుగా సాగింద‌ని చెప్పారు. బాగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం త‌మ ప్ర‌జ‌ల‌కు స‌హాయం చేయ‌డంలో ఇబ్బందులు ప‌డుతుంటే, మ‌నదేశంలో దాదాపు స‌మాజంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు స‌త్వరం స‌హాయం అందించే ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

 గ‌త కొన్ని సంవ‌త్స‌రాల‌లో తీసుకున్న చ‌ర్య‌ల వ‌ల్ల ఇన్సూరెన్సు, బ్యాంకు రుణాలు, ఆర్ధిక సాధికార‌త వంటివి స‌మాజంలో పెద్ద సంఖ్య‌లోగ‌ల పేద‌లు, మ‌హిళ‌లు, వీధివ్యాపారులు, స‌న్న‌కారు రైతుల‌కు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని ఆయ‌న అన్నారు. ఇంత‌కు ముందు దేశ బ్యాంకింగ్ రంగం మహిళ‌ల‌కు చెప్పుకోద‌గిన స్థాయిలో చేరువ కాలేద‌ని అన్నారు. దీనిని త‌మ ప్ర‌భుత్వం ప్రాధాన్య‌తా అంశంగా స్వీక‌రించింద‌ని చెప్పారు.  జ‌న్ ధ‌న్ యోజ‌న కింద ప్రారంభించిన బ్యాంకు ఖాతాలలో స‌గానికి పైగా మ‌హిళ‌ల‌కు చెందిన వే న‌ని అన్నారు. ఈ బ్యాంకు ఖాతాల ప్ర‌భావం మ‌హిళ‌ల ఆర్ధిక సాధికార‌త‌పై ఉంద‌ని అన్నారు. ఇటీవ‌లి జాతీయ ఆరోగ్య స‌ర్వేలో దీనిని మ‌నం గ‌మ‌నించాం అని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు..

డిపాజిట్ ఇన్సూరెన్సు సేవింగ్స్‌, ఫిక్స్‌డ్‌, క‌రంట్‌, రిక‌రింగ్ త‌దిత‌ర డిపాజిట్లు అన్నింటికీ  వ‌ర్తిస్తుంది. ఇది దేశంలో ప‌నిచేసే అన్ని వాణిజ్య బ్యాంకుల‌కు వ‌ర్తిస్తుంది.  కేంద్ర‌, రాష్ట్ర‌, ప్రైమ‌రీ కోఆప‌రేటివ్ బ్యాంకులు రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో ప‌నిచేసే అన్నింటికీ ఇది వ‌ర్తిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో తీసుకువ‌చ్చిన గొప్ప మార్పు కింద బ్యాంకు డిపాజిట్ ఇన్సూరెన్సును ల‌క్ష రూపాయ‌ల నుంచి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పెంచారు.

డిపాజిట్ ఇన్సూరెన్సు క‌వ‌రేజ్ ప్ర‌తి డిపాజిట‌ర్‌కు ప్ర‌తి బ్యాంకుకు 5 ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు ఉంటుంది. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రం చివ‌రి నాటికి పూర్తి స్థాయిలో ర‌క్ష‌ణ పొందిన ఖాతాలు మొత్తం ఖాతాల‌లో 98.1 శాతం వ‌ర‌కు ఉన్నాయి. ఈ విష‌యంలో అంత‌ర్జాతీయ బెంచ్ మార్క్ 80 శాతంగా ఉంది.

 తొలివిడ‌త మ‌ధ్యంత‌ర చెల్లింపుల‌ను డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేష‌న్ ఇటీవ‌ల విడుద‌ల చేసింది. ఇందుకు సంబంధించి 16 అర్బ‌న్ కో ఆప‌రేటివ్ బ్యాంకుల‌నుంచి క్లెయిమ్‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం ఇవి ఆర్‌.బి.ఐ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ల‌క్ష‌మందికిపైగా క్లెయిమ్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న డిపాజిట్‌దారుల‌కు చెందిన ప్ర‌త్యామ్నాయ బ్యాంకు ఖాతాల‌కు  చెల్లింపులు చేయ‌డం జ‌రిగింది. వీటి మొత్తం విలువ 1300 కోట్ల రూపాయ‌ల‌కుపైనే ఉంటుంది.

Click here to read PM's speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers

Media Coverage

Cabinet extends One-Time Special Package for DAP fertilisers to farmers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 జనవరి 2025
January 02, 2025

Citizens Appreciate India's Strategic Transformation under PM Modi: Economic, Technological, and Social Milestones