కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా అధ్యక్షత వహించారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, కరోనా మహమ్మారి ఈ శతాబ్ది లో అతి పెద్ద సవాలు గా నిలచిందని వ్యాఖ్యానించారు. అయితే గత కాలం లో మానవాళి కి ఒక భారీ సంకటం ఎదురైనపుడల్లా విజ్ఞాన శాస్త్రం ఓ మెరుగైన దారి ని సిద్ధపరచిందని ఆయన అన్నారు. పరిష్కారాల ను కనుగొనడం, సంకట కాలాల్లో వీలుపడే కార్యాల కు నడుం బిగించడం ద్వారా కొత్త బలాన్ని జోడించడమనేది విజ్ఞాన శాస్త్రం మౌలిక స్వభావం అని కూడా ఆయన అన్నారు.
ప్రపంచ వ్యాప్త వ్యాధి బారి నుంచి మానవ జాతి ని రక్షించడం కోసం టీకా మందుల ను ఒక సంవత్సరం లోపే శరవేగం గా, పెద్ద ఎత్తు న తయారు చేసినందుకు శాస్త్రవేత్తల ను ప్రధాన మంత్రి పొగడారు. చరిత్ర లో అటువంటి ఒక పెద్ద ఘటన జరగడం ఇది ఒకటో సారి అని ఆయన అన్నారు. కిందటి శతాబ్దం లో నూతన ఆవిష్కరణ లు ఇతర దేశాల లో చోటు చేసుకొన్నాయి, భారతదేశం చాలా సంవత్సరాల పాటు వేచివుండవలసి వచ్చింది అని కూడా ఆయన అన్నారు. అయితే ప్రస్తుతం మన దేశం లోని శాస్త్రజ్ఞులు ఒకే రకమైనటువంటి వేగం తోను, ఇతర దేశాల తో సమానం గాను శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు. కరోనా కు వ్యతిరేకం గా సాగుతున్నటువంటి పోరు లో కోవిడ్-19 టీకా మందుల విషయం లో, టెస్టింగ్ కిట్స్ విషయం లో, అవసరమైనటువంటి సామగ్రి విషయం లో, సరికొత్త ప్రభావకారి ఔషధాల విషయం లో భారతదేశాన్ని సొంత కాళ్ల మీద నిలబడేటట్టు చేసిన శాస్త్రవేత్తల ను ఆయన ప్రశంసించారు. విజ్ఞాన శాస్త్రాన్ని, సాంకేతిక విజ్ఞానాన్ని అభివృద్ధి చెందిన దేశాల తో సమాన స్థాయి కి తీసుకు రావడం ఇటు పరిశ్రమ కు, అటు బజారు కు శ్రేష్ఠతరం గా ఉంటుంది అని ఆయన అన్నారు.
మన దేశం లో, విజ్ఞాన శాస్త్రాన్ని, సమాజాన్ని, పరిశ్రమ ను ఒకే స్థాయి లో ఉంచే ఒక సంస్థాగత సర్దుబాటు వ్యవస్థ గా సిఎస్ఐఆర్ పాటుపడుతోందని ప్రధాన మంత్రి అన్నారు. శాంతి స్వరూప భట్ నాగర్ వంటి ఎంతో మంది ప్రతిభావంతులను, శాస్త్రవేత్తల ను మన ఈ సంస్థ అందించింది, శాంతి స్వరూప్ భట్ నాగర్ ఈ సంస్థ కు నాయకత్వం వహించారు అని ప్రధాన మంత్రి చెప్పారు. పరిశోధన, పేటెంట్ ల ఇకోసిస్టమ్ తాలూకు ఒక శక్తిమంతమైనటువంటి జత సిఎస్ఐఆర్ కు ఉంది అని ఆయన తెలిపారు. దేశం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల ను పరిష్కరించడం కోసం సిఎస్ఐఆర్ కృషి చేస్తోందని ఆయన అన్నారు.
దేశం తాలూకు ప్రస్తుత లక్ష్యాలు, 21వ శతాబ్దం తాలూకు దేశవాసుల కల లు ఒక పునాది మీద ఆధారపడి ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. కాబట్టి సిఎస్ఐఆర్ వంటి సంస్థ ల లక్ష్యాలు కూడా అసాధారణమైనవే అని ఆయన అన్నారు. బయో టెక్నాలజీ మొదలుకొని బ్యాటరీ సాంకేతికత ల వరకు, వ్యవసాయం మొదలుకొని ఖగోళశాస్త్రం వరకు, విపత్తుల నిర్వహణ మొదలుకొని రక్షణ సంబంధి సాంకేతిక విజ్ఞానం వరకు, వ్యాక్సీన్ ల మొదలుకొని వర్చువల్ రియాలిటి వరకు.. ప్రతి ఒక్క రంగం లో.. స్వయంసమృద్ధియుతమైంది గా రూపుదిద్దుకోవాలని నేటి భారతదేశం కోరుకొంటోంది అని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతదేశం సుస్థిర అభివృద్ధి, శుద్ధ శక్తి రంగం లో ప్రపంచానికి దారి ని చూపుతోంది అని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ మొదలుకొని ఉపగ్రహాల వరకు ఇతర దేశాల అభివృద్ధి వేగాన్ని భారతదేశం పెంచుతోంది, ప్రపంచ అభివృద్ధి లో ఒక ప్రధాన యంత్రం పాత్ర ను పోషిస్తోంది అని ఆయన చెప్పారు. ఈ కారణం గా, భారతదేశం లక్ష్యాలు ఈ దశాబ్దం అవసరాల తో పాటు తరువాతి దశాబ్ది అవసరాలకు కూడా అనుగుణం గా ఉండాలి అని ఆయన అన్నారు.
జలవాయు పరివర్తన ను గురించి ప్రపంచవ్యాప్త నిపుణులు అదే పని గా భయాన్ని వ్యక్తం చేస్తున్నారని ప్రధాన మంత్రి అన్నారు. శాస్త్రీయ దృష్టికోణం తో సన్నాహాల ను చేయవలసింది గా శాస్త్రవేత్తల కు, సంస్థల కు ఆయన పిలుపునిచ్చారు. కార్బన్ కేప్చర్ మొదలుకొని శక్తి ని నిలవ చేయడం నుంచి హరిత ఉదజని సాంకేతికత ల దాాకా ప్రతి ఒక్క రంగం లోనూ అందరి కన్నా ముందు నడవండి అని వారిని ఆయన కోరారు. సమాజాన్ని, పరిశ్రమ ను వెంట బెట్టుకొని సాగవలసిందిగా సిఎస్ఐఆర్ కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన ఇచ్చిన సలహా ను అనుసరించి ప్రజల వద్ద నుంచి సూచనలను, ఆలోచనల ను తీసుకోవడం మొదలుపెట్టినందుకు గాను సిఎస్ఐఆర్ ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. 2016వ సంవత్సరం లో ప్రారంభించిన అరోమ మిశన్ లో సిఎస్ఐఆర్ పోషించిన పాత్ర ను ఆయన కొనియాడారు. ప్రస్తుతం దేశం లో వేల కొద్దీ రైతులు పూల మొక్కల పెంపకం ద్వారా వారి భాగ్యరేఖల ను మార్చివేసుకొంటున్నారు అని ఆయన చెప్పారు. భారతదేశం ఇంగువ కోసం దిగుమతుల పై ఆధారపడేదని, దేశం లో ఇంగువ సేద్యం లో సాయపడినందుకు సిఎస్ఐఆర్ ను ఆయన ప్రశంసించారు.
ఒక మార్గ సూచీ దన్ను తో సరైన మార్గం లో ముందుకు సాగిపోవలసింది గా సిఎస్ఐఆర్ ను ప్రధాన మంత్రి కోరారు. కరోనా తాలూకు ప్రస్తుత కోవిడ్-19 సంకటం అభివృద్ధి గమనం పైన ప్రభావాన్ని చూపివుండవచ్చు గాని ఆత్మనిర్భర్ భారత్ (స్వయంసమృద్ధియుత భారత్) ను ఆవిష్కరించాలి అనే కల ను నెరవేర్చుకోవాలన్న వచనబద్ధత స్థిరం గానే ఉంది అని ఆయన అన్నారు. మన దేశం లో లభిస్తున్నటువంటి అవకాశాల ను అనుకూలం గా వినియోగించుకోవాలి అంటూ ఆయన పిలుపునిచ్చారు. మన ఎమ్ఎస్ఎఇ లకు, స్టార్ట్ అప్స్ కు వ్యవసాయ రంగం మొదలుకొని విద్య రంగం వరకు ప్రతి ఒక్క రంగం లో గొప్ప కార్యక్షమత కు ఆస్కారం ఉందని ఆయన తెలిపారు. కోవిడ్ సంక్షోభం కాలం లో ప్రతి రంగం లోనూ సాధించిన సాఫల్యాన్ని తిరిగి సాధించవలసిందంటూ శాస్త్రవేత్తలందరికీ, పరిశ్రమ కు ఆయన విజ్ఞప్తి చేశారు.
कोरोना वैश्विक महामारी, पूरी दुनिया के सामने इस सदी की सबसे बड़ी चुनौती बनकर आई है।
— PMO India (@PMOIndia) June 4, 2021
लेकिन इतिहास इस बात का गवाह है, जब जब मानवता पर कोई बड़ा संकट आया है, साइन्स ने और बेहतर भविष्य के रास्ते तैयार कर दिए हैं: PM @narendramodi
बीती शताब्दी का अनुभव है कि जब पहले कोई खोज दुनिया के दूसरे देशों में होती थी तो भारत को उसके लिए कई-कई साल का इंतज़ार करना पड़ता था।
— PMO India (@PMOIndia) June 4, 2021
लेकिन आज हमारे देश के वैज्ञानिक दूसरे देशों के साथ कंधे से कंधा मिलाकर चल रहे हैं, उतनी ही तेज गति से काम कर रहे हैं: PM @narendramodi
हमारी इस संस्था ने देश को कितनी ही प्रतिभाएं दी हैं, कितने ही वैज्ञानिक दिये हैं।
— PMO India (@PMOIndia) June 4, 2021
शांतिस्वरूप भटनागर जैसे महान वैज्ञानिक ने इस संस्था को नेतृत्व दिया है: PM @narendramodi
किसी भी देश में साइन्स और टेक्नालॉजी उतनी ही ऊंचाइयों को छूती है, जितना बेहतर उसका इंडस्ट्री से, मार्केट से संबंध होता है।
— PMO India (@PMOIndia) June 4, 2021
हमारे देश में CSIR साइन्स, सोसाइटी और इंडस्ट्री की इसी व्यवस्था को बनाए रखने के लिए एक institutional arrangement का काम करता है: PM @narendramodi
आज भारत sustainable development और क्लीन एनर्जी के क्षेत्र में दुनिया को रास्ता दिखा रहा है।
— PMO India (@PMOIndia) June 4, 2021
आज हम software से लेकर satellites तक, दूसरे देशों के विकास को भी गति दे रहे हैं, दुनिया के विकास में प्रमुख engine की भूमिका निभा रहे हैं: PM @narendramodi
आज भारत,
— PMO India (@PMOIndia) June 4, 2021
एग्रिकल्चर से एस्ट्रॉनॉमी तक,
Disaster management से defence technology तक,
वैक्सीन से वर्चुअल रियलिटी तक,
बायोटेक्नालजी से लेकर बैटरी टेक्नालजीज़ तक, हर दिशा में आत्मनिर्भर और सशक्त बनना चाहता है: PM @narendramodi
कोरोना के इस संकट ने रफ्तार भले कुछ धीमी की है लेकिन आज भी हमारा संकल्प है- आत्मनिर्भर भारत, सशक्त भारत: PM @narendramodi
— PMO India (@PMOIndia) June 4, 2021