Once the people of India decide to do something, nothing is impossible: PM Modi
Banks were nationalised but that did not give the poor access to these banks. We changed that through Jan Dhan Yojana: PM
All round and inclusive development is essential. Even in the states with strong development indicators there would be areas which would need greater push for development: PM
Serving in less developed districts may not be glamorous but it will give an important platform to make a positive difference: PM Modi

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ కొత్త ఢిల్లీలోని డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ అంత‌ర్జాతీయ కేంద్రంలో నీతిఆయోగ్ ఏర్పాటు చేసిన , క‌లెక్ట‌ర్లు, అభివృద్ధి కాంక్షిత జిల్లాల ఇంఛార్జి అధికారులతో ఈరోజు స‌మావేశమై వారితో ముచ్చ‌టించారు.

2022 నాటికి భార‌త‌దేశ రూపురేఖ‌లు మార్చాల‌న్న ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. వివిధ ప్ర‌త్యేక అభివృద్ధి ప్ర‌మాణాల‌ను అందుకోలేక వెనుక‌బ‌డి ఉన్న 115 జిల్లాల‌లో గ‌ణ‌నీయ‌మైన మార్పును తీసుకు వ‌చ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క విధాన‌ప‌ర‌మైన చొర‌వ చూపుతోంది.

పౌష్టికాహారం, విద్య‌, మౌలిక స‌దుపాయాలు, వ్య‌వ‌సాయం, నీటివ‌న‌రులు, వామ‌ప‌క్ష తీవ్ర‌వాదాన్ని తుద‌ముట్టించ‌డం, ఆర్థిక సమ్మిళిత‌త్వం,నైపుణ్య వృద్ధికి సంబంధించి ఆరు గ్రూపుల‌కు చెందిన అధికారులు త‌మ ప్రెజెంటేష‌న్స్ ఇచ్చారు.

ప‌లువురు కేంద్ర మంత్రులు, కేంద్ర ప్ర‌భుత్వ అధికారులు కూడా హాజ‌రైన ఈ స‌మావేశంలో మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, ఈ స‌మావేశం, డాక్ట‌ర్ అంబేడ్క‌ర్ అంత‌ర్జాతీయ కేంద్రంలో జ‌రుగుతున్న తొలి స‌మావేశ‌మ‌ని అందువ‌ల్ల దీనికి ప్ర‌త్యేక ప్రాధాన్య‌త ఉంద‌ని అన్నారు.

దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇత‌ర ప్రాంతాల‌తో పోల్చి చూస‌నపుడు వెనుక‌బాటులో ఉండ‌డం ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు అన్యాయమేన‌ని అన్నారు.ఈ నేప‌థ్యంలో , అణ‌గారిన వ‌ర్గాల ప్ర‌జ‌ల స‌ముద్ధ‌రణ‌కు కృషి చేసిన డాక్ట‌ర్ . అంబేడ్క‌ర్ దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా 115 వెనుక‌బ‌డిన జిల్లాల అభివృద్ధికి జ‌రుగుతున్న‌ప్‌‌య‌త్నంగా దీనిని అభివ‌ర్ణించారు.

ఈ సంద‌ర్భంగా జ‌న్‌ధ‌న్‌యోజ‌న , శౌచాల‌యాల నిర్మాణం,గ్రామీణ విద్యుదీక‌ర‌ణ‌ల ఉదాహ‌ర‌ణ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, మ‌న‌కు గ‌ట్టి సంక‌ల్పం ఉంటే ఈ దేశంలో సాధించ‌లేనిదంటూ ఏదీ లేద‌ని అన్నారు. భూసార ప‌రీక్ష‌ల వంటి పూర్తిగా కొత్త అంశాల విష‌యంలోనూ సాధించిన విజ‌యానికి సంబంధించిన ఉదాహ‌ర‌ణ‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు.

భార‌త‌దేశంలో ప్ర‌స్తుతం అప‌రిమిత శ‌క్తిసామ‌ర్ధ్యాలు, అప‌రిమిత అవ‌కాశాలు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో సుల‌భ‌త‌ర వాణిజ్యంలో వ‌చ్చిన మెరుగుద‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ ఘ‌న‌త ప్ర‌భుత్వ అధికారులు – టీం ఇండియా కే చెందుతుంద‌ని ఆయ‌న అన్నారు.

పై నుంచి కిందికి ప‌రిష్కారాలు రుద్దే విధానం ఫ‌లితాల‌నివ్వ‌ద‌ని ప్ర‌ధాని అన్నారు. అందువ‌ల్ల , ఆయా రంగాల‌లో ఉన్న ప్ర‌జ‌లు ప‌రిష్కారాలు సాధించేందుకు తోడ్ప‌డాల‌ని ప్ర‌ధాని పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ జ‌రిగిన ప్రెజెంటేష‌న్ల‌లో ఆలోచ‌న‌ల్లో స్ప‌ష్ట‌త‌, నిబద్ద‌త‌పై అచంచ‌ల విశ్వాసం క‌నిపించాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

ప్రాంతీయ అస‌మాన‌త‌లు నిరంత‌రాయంగా పెరిగిపోతూ ఉండ‌డాన్నిఎంత‌మాత్రం స‌హించ‌రాద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.అందువ‌ల్ల వెనుక‌బ‌డిన జిల్లాల అభివృద్ధి త‌ప్ప‌నిస‌రి అని చెప్పారు. ఈ వెనుక‌బ‌డిన ప్రాంతాల‌లో వ్య‌తిరేక ఆలోచ‌న‌లు, వ్య‌తిరేక భావ‌న‌ల‌లో మార్పు తీసుకురావాలంటే విజ‌య‌గాధ‌లు కీల‌క‌మ‌ని ఆయ‌న అన్నారు. వెనుక‌బ‌డిన ప్రాంతాల‌లో నిరాశామ‌య‌ స్థితినుంచి ఆశావ‌హ‌స్థితికి మార్చ‌డ‌మే తొలి మెట్టు కావాల‌ని ప్ర‌ధాని ఉద్బోధించారు.

అభివృద్ధికోసం జ‌రిగే ప్ర‌జా ఆందోళ‌న‌ల‌కు సంబంధించి కీల‌క బృందంలో అవ‌గాహ‌న ఉండాల‌ని ఆయ‌న సూచించారు.ఈ నేప‌థ్యంలో జిల్లా స్థాయిలో మేథో మ‌థ‌నం జ‌ర‌గాల‌ని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌లో ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం ఉండేలా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం త‌గిన ఏర్పాటు ఉండాల‌ని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. ఇందుకు ప్ర‌ధాన‌మంత్రి స్వ‌చ్ఛ‌భార‌త్ అభియాన్ ఉదాహ‌ర‌ణ‌ను ప్ర‌స్తావించారు. అభివృద్ధి ల‌క్ష్యాల సాధ‌న‌లో ఆశావ‌హ దృక్ప‌థం, సానుకూల ధోర‌ణిని నిర్మించ‌డం అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి నొక్కి చెప్పారు.

అభివృద్ధి ఆకాంక్ష‌ల జిల్లాల‌కు సంబంధించిన ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను గుర్తించ‌డంతో పాటు వాటిని త‌గిన ప‌ద్ధ‌తిలో పెట్టాల‌ని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం, ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు స‌రితూగేదిగా ఉండాల‌ని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు. అభివృద్ధి కాంక్షిత 115 జిల్లాల క‌లెక్ట‌ర్లు, అభివృద్ధి ల‌క్ష్యాల‌ను సాధించ‌డం ద్వారా చిర‌కాల సంతృప్తి పొంద‌డానికి అవ‌కాశం ల‌భిస్తున్న‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. జీవితంలో స‌వాళ్లే విజ‌య‌సాధ‌న‌కు మార్గాల‌ని అంటూ ప్ర‌ధాన‌మంత్రి, ఇందుకు ఈ జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు అవ‌కాశం ల‌భించింద‌ని అన్నారు.

రాగ‌ల మూడు నెల‌ల్లో అంటే ఏప్రిల్ 14 వ‌తేదీ డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేడ్క‌ర్ జ‌యంతి నాటికి చెప్పుకోద‌గిన ఫ‌లితాలు సాధించేందుకు గ‌ట్టి కృషి చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి పిలుపునిచ్చారు. ఏప్రిల్ నెల‌లో ఇలాంటి మంచి ఫ‌లితాలు సాధిస్తున్న ఒక జిల్లాను వ్య‌క్తిగ‌తంగా తాను సంద‌ర్శించాల‌ని అనుకుంటున్న‌ట్టు ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు. న‌వ‌భార‌త అభివృద్ధికి ఈ 115 జిల్లాలు పునాది కానున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Double engine govt becoming symbol of good governance, says PM Modi

Media Coverage

Double engine govt becoming symbol of good governance, says PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2024
December 17, 2024

Unstoppable Progress: India Continues to Grow Across Diverse Sectors with the Modi Government