Quote‘‘మనం 2014వ సంవత్సరాని కి పూర్వం ఉన్న సమస్యల ను, సవాళ్ళ ను ఒక్కటొక్కటి గాపరిష్కరించడాని కి మార్గాల ను కనుగొన్న క్రమం లో ప్రస్తుతం బ్యాంకుల ఆర్థిక పరమైనఆరోగ్యం చాలా మెరుగు పడిన స్థితి లో ఉన్నది’’
Quote‘‘దేశ ఆర్థిక వ్యవస్థ కు సరికొత్త శక్తి ని అందించడం లోభారతదేశ బ్యాంకు లు ఒక ప్రధానమైన పాత్ర ను పోషించగల పటిష్టమైన రీతి లో ఉన్నాయి; మరి అవి ఒక పెద్ద నెట్టు నెట్టి భారతదేశాన్నిస్వయం సమృద్ధం గా తీర్చిదిద్దగలిగేవి గా ఉన్నాయి’’
Quote‘‘ఈ కాలం మీకు ఎటువంటి కాలం అంటే, అది మీరు సంపద సృష్టి కర్తల ను, ఉద్యోగాల సృష్టి కర్తల నుసమర్ధించవలసినటువంటి కాలం. ఇక భారతదేశం లో బ్యాంకులు వాటి ఆస్తి, అప్పుల పట్టికల తో పాటు దేశం సంపద పట్టిక కు కూడా మద్దతివ్వడానికిముందు చూపు తో కృషి చేయవలసిన తక్షణావసరం ఉంది’’
Quote‘‘బ్యాంకులు తాము ఆమోదించేవి గాను, వినియోగదారు ను ఒక దరఖాస్తుదారు గానుతలపోసే భావన ను వదలుకోవలసిన అవసరం ఉంది. బ్యాంకులు ఇచ్చేవి గా, వినియోగదారు ను స్వీకర్త గాభావించకూడదు; భాగస్వామ్య నమూనా ను బ్యాంకులు అంగీకరించాలి’’
Quote‘‘ఆర్థిక సేవల ను అందరికీ అందించడం కోసం దేశం ఎప్పుడైతే కఠోరం గా పాటుపడుతోందో,అటువంటి సమయం లో పౌరుల యొక్క ఉత్పాదక శక్తి ని వెలికితీయడమనేది ఎంతో ముఖ్యమైందవుతుంది’’
Quote‘‘స్వాతంత్య్రం తాలూకు ‘అమృత కాలం’ లో భారతదేశ బ్యాంకింగ్ రంగం పెద్దపెద్ద ఆలోచనలతో, వినూత్నమైన వైఖరి తో ముందుకు సాగుతుంది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘క్రియేటింగ్ సినర్జీస్ ఫార్ సీమ్ లెస్ క్రెడిట్ ఫ్లో ఎండ్ ఇకానామిక్ గ్రోథ్’ అంశం పై జరిగిన సమావేశం ముగింపు సదస్సు ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్మాధ్యమం ద్వారా ప్రసంగించారు. 

|

ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గడచిన ఆరేడు సంవత్సరాల లో బ్యాంకింగ్ రంగం లో ప్రభుత్వం తీసుకు వచ్చినసంస్కరణ లు ఆ రంగాన్ని అన్ని విధాలుగాను సమర్ధించాయని, దీనితో దేశ బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం చాలా బలమైన స్థితి లో ఉందన్నారు.  బ్యాంకుల ఆర్థిక ఆరోగ్య స్థితి  ప్రస్తుతంఎంతో మెరుడుపడిందని ఆయన అన్నారు.  2014వ సంవత్సరం కంటే పూర్వం ఉన్న సమస్యల ను, సవాళ్ళ నుపరిష్కరించడానికి తగిన మార్గాల ను కనుగొనడం జరిగిందని ప్రధాన మంత్రి అన్నారు. 

|

 ‘‘మేము వసూలు కాని రుణాల (ఎన్ పిఎ స్)సమస్య ను పరిష్కరించాం.  బ్యాంకుల కు మళ్ళీ మూలధనాన్ని ఇచ్చాం.  అంతేకాక, వాటి బలాన్ని కూడా వృద్ధి చేశాం.  మేం ఐబిసి వంటి సంస్కరణల ను ప్రవేశపెట్టాం. అనేక చట్టాల లో సంస్కరణల ను తీసుకు వచ్చాం.  మరి అదేవిధం గా డెట్ రికవరీ ట్రైబ్యునల్   కు సాధికారితను కల్పించాం.  కరోనా కాలం లో దేశం లో స్ట్రెస్ డ్ ఆసెట్మేనేజ్ మెంట్ వర్టికల్ అంటూ ప్రత్యేకం గా ఒక విభాగాన్నే ఏర్పాటు  చేయడం జరిగింది అని శ్రీ నరేంద్ర  మోదీఅన్నారు.  ‘‘దేశ ఆర్థిక వ్యవస్థ కు సరికొత్త శక్తిని అందించడం లో ఒక ప్రధానమైన పాత్ర ను పోషించడానికి సరిపడ బలం భారతదేశం బ్యాంకుల కుఉందని, అవి భారతదేశాన్ని ఒక పెద్ద నెట్టునెట్టడం ద్వారా స్వయం సమృద్ధం గా తీర్చిదిద్ద గలుగుతాయని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ దశ ను భారతదేశం బ్యాంకింగ్ రంగాని కి ఒక ప్రధానమైన మైలు రాయి వంటిది గానేను చూస్తున్నాను’’ అని ఆయన అన్నారు.  ఇటీవలి కొన్నేళ్ళ కాలం లో తీసుకొన్న చర్యలు బ్యాంకుల కు ఒక పటిష్టమైనమూలధన పునాది ని ఏర్పరచాయి.  బ్యాంకుల వద్ద ద్రవ్యలభ్యత చాలినంతగా ఉంది.  మరి ఎన్ పిఎ స్ కై సర్దుబాటు నుచేయవలసిన అగత్యమంటూ లేదు.  ఎందుకంటే ప్రభుత్వ రంగబ్యాంకుల లో ఎన్ పిఎ అనేది గడచిన అయిదు సంవత్సరాల లో చూస్తే అత్యంత తక్కువ గాఉంది.  ఇది భారతదేశ బ్యాంకుల దృక్పథాన్ని అంతర్జాతీయసంస్థ లు ఉన్నతీకరించడాని కి దారితీసింది అని ప్రధాన మంత్రి తెలిపారు.  ఒక మైలురాయి గా నిలవడం తో పాటు ఈ దశ ను ఒక కొత్త ఆరంభ స్థానం గా కూడా చెప్పవచ్చు అని ప్రధాన మంత్రిఅన్నారు.  సంపద ను సృష్టించే వారిని, ఉద్యోగాల ను ఇచ్చే వారిని సమర్ధించాలి అని బ్యాంకింగ్ రంగాన్ని ఆయన కోరారు.  ‘‘బ్యాంకులు వాటి బ్యాలెన్స్ శీట్ లతోపాటు దేశం యొక్క వెల్థ్ శీట్ కు కూడా మద్దతిచ్చేదిశ లో దూసుకు పోవలసిన తక్షణావసరం ఉంది’’ అని ప్రధాన మంత్రినొక్కి చెప్పారు.  వినియోగదారుల కు ముందుచూపు భావన తో సేవల నుఅందించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  

|

వినియోగదారుల కు, కంపెనీల కుఎమ్ఎస్ఎమ్ఇ లకు వాటి వాటి అవసరాల ను బేరీజు వేసిన తరువాత ఒక్కొక్క వర్గాని కిప్రత్యేకించినటువంటి పరిష్కార మార్గాల ను సమకూర్చవలసింది అంటూ బ్యాంకుల కు ఆయన సూచనచేశారు.  బ్యాంకులు తాము మంజూరు చేసేవి గాను, వినియోగదారు ను ఒక దరఖాస్తుదారు గాను, అలాగే తమ ను దాత గాను, కక్షదారు ను ఒక స్వీకర్త గాను తలపోసే అభిప్రాయాన్ని రద్దు చేసుకోవాలి అనిప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.  బ్యాంకులు భాగస్వామ్య నమూనా నుఅనుసరించవలసిందే అంటూ ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  జన్ధన్ స్కీము ను అమలు చేయడం లో బ్యాంకింగ్ రంగం ప్రదర్శించిన ఉత్సాహాన్ని ఆయన ప్రశంసించారు.

 బ్యాంకులు వాటి స్టేక్ హోల్డర్స్ సాధించే వృద్ధి లోతమకు కూడా ఒక భాగం ఉంది అని భావించాలి; అంతేకాకుండా వృద్ధి గాథ లో ముందుచూపు తో పాలుపంచుకోవాలి అని ప్రధాన మంత్రి అన్నారు.  పిఎల్ఐ ని ఒక ఉదాహరణ గా ఆయన ప్రస్తావిస్తూ, అందులో ప్రభుత్వం చేస్తున్నది ఇదే.. భారతదేశ తయారీదారు సంస్థల కు వాటియొక్క ఉత్పత్తి స్థాయిల కు గాను ప్రోత్సాహకాన్ని ఇవ్వడం జరుగుతోందన్నారు.  పిఎల్ ఐ స్కీము లో భాగం గా తయారీదారు సంస్థ లు వాటి సామర్ధ్యాన్ని అనేకరెట్ల మేరకు పెంచుకోవడానికి మరియు వాటిని అవి గ్లోబల్ కంపెనీస్ గా పరివర్తనచేసుకోవడానికి వీలుగా ప్రోత్సాహకాల ను అందించడం జరుగుతున్నది.  బ్యాంకులు వాటి యొక్క మద్ధతు ద్వారా, ప్రావీణ్యం  ద్వారా ప్రాజెక్టుల ను లాభదాయకం గా మలచడం లో ఒకప్రముఖ పాత్ర ను పోషించేందుకు ఆస్కారం ఉంది అని ప్రధాన మంత్రి సూచించారు. 

|

దేశం లో పెనుమార్పులు చోటుచేసుకొన్నందువల్లనూ, అమలుచేసినటువంటి పథకాల వల్లనూ సమాచారం తాలూకు ఒకపెద్ద రాశి అంటూ ఏర్పడిందని ప్రధాన మంత్రి వివరించారు.  దీని తాలూకు ప్రయోజనాన్ని బ్యాంకింగ్ రంగం తప్పక పొందాలి అని ప్రధానమంత్రి చెప్పారు.  పిఎమ్ ఆవాస్ యోజన, స్వామిత్వ, ఇంకా స్వనిధి ల వంటి ప్రధానమైన పథకాలుఇవ్వజూపుతున్న అవకాశాల ను గురించి ఆయన ఒక్కటొక్కటిగా వల్లిస్తూ, ఆయా పథకాల లో బ్యాంకులు పాలుపంచుకొని వాటిదైన పాత్ర ను పోషించాలి అని ఆయనకోరారు. 

ఆర్థిక సేవల ను అందరికీ అందుబాటులోకి తీసుకు రావడంతాలూకు మొత్తం మీద ప్రభావాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, దేశం ఎప్పుడైతే ఫైనాన్ శల్ఇన్ క్లూజన్ విషయం లో ఎంత కఠోరం గా శ్రమిస్తోందో పౌరుల లో అంతర్గతం గా ఉన్నటువంటిశక్తియుక్తుల ను బయటకు రప్పించడం చాలా ముఖ్యం అన్నారు.  బ్యాంకింగ్ రంగమే  ఇటీవల జరిపినఒక పరిశోధన ను ఒక ఉదాహరణ గా ఆయన ప్రస్తావించారు.  జన్ధన్ ఖాతాల ను తెరిచిన రాష్ట్రాల లో నేరాలసంఖ్య తగ్గుముఖం పట్టినట్లు ఈ పరిశోధన తేల్చింది. అదేవిధం గా, ప్రస్తుతంకార్పొరేట్స్, స్టార్ట్- అప్స్ ముందంజ వేస్తున్న తీరుఇదివరకు ఎన్నడు లేనిది అని ప్రధాన మంత్రి అన్నారు.  ‘‘ఈ తరహా స్థితి లో భారతదేశం యొక్క ఆకాంక్షల ను బలపరచడానికి, నిధుల నుసమకూర్చడాని కి, పెట్టుబడి పెట్టడానికి ఒక ఉత్తమమైన కాలం అంటూ మరేమిటి ఉంటుంది ? ’’ అని ప్రధాన మంత్రి అడిగారు. 

|

బ్యాంకింగ్ రంగం తనకు తాను గా జాతీయ లక్ష్యాల ను, వాగ్దానాల ను జత పరచుకొని ముందుకు సాగాలి అని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.  మంత్రిత్వ శాఖల ను, బ్యాంకుల ను సన్నిహితం చేసేందుకువెబ్ ఆధారిత ప్రాజెక్టు ఫండింగ్ ట్రాకర్ ను తీసుకు రావాలని ప్రతిపాదించినటువంటి ఒకకార్యక్రమం ప్రశంసనీయమని ఆయన అన్నారు.  దీనిని ‘గతిశక్తి పోర్టల్’ కు ఒక ఇంటర్ ఫేస్ వలే జోడిస్తేబాగుంటుంది అంటూ ఆయన సలహా ను ఇచ్చారు.  స్వాతంత్య్రంతాలూకు ‘అమృత కాలం’ లో భారతదేశం యొక్క బ్యాంకింగ్ రంగం సరికొత్త దృక్పథం తో, పెద్ద పెద్ద ఆలోచనల తో పయనించగలదన్న ఆశ ను ఆయన వ్యక్తం చేశారు.

 

  • Reena chaurasia September 06, 2024

    बीजेपी
  • DR HEMRAJ RANA February 19, 2022

    धर्म ध्वज रक्षक छत्रपति शिवाजी महाराज राष्ट्र के प्रेरणा पुरुष हैं। उन्होंने धर्म, राष्ट्रीयता, न्याय और जनकल्याण के स्तम्भों पर सुशासन की स्थापना कर भारतीय वसुंधरा को गौरवांवित किया। शिव-जयंती पर अद्भुत शौर्य और देशभक्ति की अद्वितीय प्रतिमूर्ति के चरणों में वंदन करता हूँ।
  • शिवकुमार गुप्ता February 03, 2022

    जय भारत
  • शिवकुमार गुप्ता February 03, 2022

    जय हिंद
  • शिवकुमार गुप्ता February 03, 2022

    जय श्री सीताराम
  • शिवकुमार गुप्ता February 03, 2022

    जय श्री राम
  • G.shankar Srivastav January 03, 2022

    जय हो
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India signs highest-ever international transaction APAs in 2024-25

Media Coverage

India signs highest-ever international transaction APAs in 2024-25
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM pays tributes to His Holiness Dr. Sree Sree Sree Sivakumara Swamigalu on his Jayanti
April 01, 2025

The Prime Minister Shri Narendra Modi paid tributes to His Holiness Dr. Sree Sree Sree Sivakumara Swamigalu on the special occasion of his Jayanti today. Hailing his extraordinary efforts, Shri Modi lauded him as a beacon of compassion and tireless service, who showed how selfless action can transform society.

In separate posts on X, he wrote:

“Heartfelt tributes to His Holiness Dr. Sree Sree Sree Sivakumara Swamigalu on the special occasion of his Jayanti. He is remembered as a beacon of compassion and tireless service. He showed how selfless action can transform society. His extraordinary efforts across various fields continue to inspire generations.”

“ಪರಮಪೂಜ್ಯ ಡಾ. ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ಶಿವಕುಮಾರ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ಜಯಂತಿಯ ಈ ವಿಶೇಷ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಅವರಿಗೆ ಹೃತ್ಪೂರ್ವಕ ನಮನಗಳು. ಕಾರುಣ್ಯ ಮತ್ತು ದಣಿವರಿಯದ ಸೇವೆಯ ದಾರಿದೀಪವೆಂದು ಅವರನ್ನು ಸ್ಮರಿಸಲಾಗುತ್ತದೆ. ನಿಸ್ವಾರ್ಥ ಸೇವೆಯು ಸಮಾಜವನ್ನು ಹೇಗೆ ಪರಿವರ್ತಿಸುತ್ತದೆ ಎಂಬುದನ್ನು ಅವರು ತೋರಿಸಿದ್ದಾರೆ. ನಾನಾ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಅವರ ಅಸಾಧಾರಣ ಪ್ರಯತ್ನಗಳು ಪೀಳಿಗೆಗಳಿಗೆ ಸ್ಫೂರ್ತಿ ನೀಡುತ್ತಲೇ ಇವೆ.”