ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గుజరాత్ గాంధీనగర్‌లోని పండిత దీన్‌దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం 8 వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.ఈ సందర్భఃగా ప్రధానమంత్రి 45 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యంగల మొనో క్రిస్టలీన్ సోలార్ ఫొటొవోల్టాయిక్ పానెల్, నీటి సాంకేతిక పరిజ్ఞనానికి సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సుకు శంకుస్థాపన చేశారు. ఇన్నొవేషన్, ఇంక్యుబేషన్ సెంటర్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్, ట్రాన్స్‌లేషనల్ రిసెర్చ్ సెంటర్, యూనివర్సిటీకి చెందిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.
స్నాతకోత్సవం సందర్భంగా విద్యార్ధులనుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ప్రపంచం మొత్తం ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దశలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం అంత సులభమైన విషయం కాదని, అయితే విద్యార్ధుల సామర్ధ్యం ఈ సవాలును మించినదని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో మార్పులు చోటుచేసుకుంటున్న దశలో విద్యార్ధులు పరిశ్రమలో అడుగుపెడుతున్నారన్నారు.
ఈ రకంగా దేశంలో ఇంధనరంగానికి అద్భుతమైన అభివృద్ధికి అవకాశాలు ఉ న్నాయన్నారు. ప్రస్తుతం దేశం 30 నుంచి 25 శాతం కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించే లక్ష్యంతో ముందుకు పోతున్నదని అన్నారు. అలాగే ఈ దశాబ్దంలో ఇంధన రంగంలో సహజవాయు వాటాను నాలుగు రెట్లు పెంచేందుకు కృషి జరుగుతున్నట్టు చెప్పారు. రాగల 5 సంవత్సరాలలో చమురు రిఫైనింగ్ సామర్ధ్యాన్ని రెట్టింపు చేసే కృషి జరుగుతున్నదన్నారు. ఇంధన భద్రత సంబంధింత స్టార్టప్ వాతావరణాన్ని బలోపేతం చేయడం జరుగుతుందని, ఇందుకు విద్యార్ధులు, ప్రొఫెషనల్స్‌కు ఫండ్ కేటాయించినట్టు ప్రధాని తెలిపారు.
విద్యార్ధులు జీవితానికి సార్ధకత ఉండేలా చూసుకోవాలన్నారు. విజయవంతమైన వ్యక్తులకు సమస్యలు లేవని కాదని, సవాళ్లను స్వీకరించి వాటితో తలపడి , వాటిని ఓడించి సమస్యలను పరిష్కరించిన వారు మాత్రమే విజయం సాధించగలుగుతారని అన్నారు. సవాళ్లను స్వీకరించినవారు ఆ తర్వాత జీవితంలో విజయం సాధిస్తారన్నారు. 1922-47 మధ్య కాలపు యువత దేశ స్వాతంత్ర్యం కోసం తమ సర్వస్వం త్యాగం చేశారని ఆయన అన్నారు. విద్యార్ధులు దేశం కోసం పాటుపడాలని, ఆత్మనిర్భర భారత్ ఉద్యమంలో విద్యార్ధులు చేతులు కలపాలని ఒకరకమైన బాధ్యతను అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు.
బాధ్యతలోనే విజయానికి బీజం ఉంటుందని ఆయన అన్నారు. ఆ బాధ్యతను జీవిత ప్రయోజనాల దిశగా మార్చాలన్నారు.
భారాన్ని మోస్తున్నట్టు జీవితం గడిపేవారు విఫలురౌతారన్నారు. బాధ్యతతో వ్వవహరించడం వ్యక్తి జీవితంలో అవకాశాలను ఇస్తుందన్నారు. ఇండియా ఎన్నో రంగాలలో ముందుకు పొతున్నదని, యువ గ్రాడ్యుయేట్లు నిబద్ధతతో ముందుకు కదలాలని ఆయన అన్నారు. పర్యావరణాన్ని ప్రకృతిని పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి ఆయన నొక్కి చెప్పారు.
ప్రస్తుత తరం, 21 వ శతాబ్దపు యువత గత సమస్యలు వైఫల్యాలను పక్కనపెట్టి మంచి మనసుతో మంచి ఉద్దేశంతో ముందుకు కదలాలని అన్నారు. 21 వ శతాబ్దంలో ఇండియా పట్ల ఎన్నో ఆశలు ,ఆకాంక్షలు ఉన్నాయని, ఇండియా ఆకాంక్షలు,ఆశలు విద్యార్ధులు, ప్రొఫెషనల్స్‌పై ఉన్నాయన్నారు.
आज आप ऐसे समय में इंडस्ट्री में कदम रख रहे हैं, जब pandemic के चलते पूरी दुनिया के Energy sector में भी बड़े बदलाव हो रहे हैं।
— PMO India (@PMOIndia) November 21, 2020
ऐसे में आज भारत में Energy Sector में Growth की,
Entrepreneurship की, Employment की, असीम संभावनाएं हैं: PM
आज देश अपने carbon footprint को 30-35% तक कम करने का लक्ष्य लेकर आगे बढ़ रहा है।
— PMO India (@PMOIndia) November 21, 2020
प्रयास है कि इस दशक में अपनी ऊर्जा ज़रूरतों में Natural Gas की हिस्सेदारी को हम 4 गुणा तक बढ़ाएं: PM
एक ऐसे समय में graduate होना जब दुनिया इतने बड़े संकट से जूझ रही है,ये कोई आसान बात नहीं है।
— PMO India (@PMOIndia) November 21, 2020
लेकिन आपकी क्षमताएँ इन चुनौतियों से कहीं ज्यादा बड़ी हैं।
Problems क्या हैं, इससे ज्यादा महत्वपूर्ण ये है कि आपका purpose क्या है, आपकी Preference क्या है और आपका plan क्या है?: PM
ऐसा नहीं है कि सफल व्यक्तियों के पास समस्याएं नहीं होतीं,
— PMO India (@PMOIndia) November 21, 2020
लेकिन जो चुनौतियों को स्वीकार करता है, उनका मुकाबला करता है, उन्हें हराता है, समस्याओं का समाधान करता है, वो सफल होता है: PM
आप देखिए जीवन में वही लोग सफल होते है, वही लोग कुछ कर दिखाते है जिनके जीवन में Sense of Responsibility का भाव होता है। विफल वो होते है जो Sense of Burden में जीते है।
— PMO India (@PMOIndia) November 21, 2020
Sense of Responsibility का भाव व्यक्ति के जीवन में Sense of Opportunity को भी जन्म देता है: PM
आज की जो पीढ़ी है, 21वीं सदी का जो युवा है, उसको एक Clean Slate के साथ आगे बढ़ना होगा।
— PMO India (@PMOIndia) November 21, 2020
कुछ लोंगों के मन में ये जो पत्थर की लकीर बनी हुई है, कि कुछ बदलेगा नहीं, उस लकीर को Clean करना होगा।
और Clean Heart... Clean Heart मतलब साफ नीयत: PM
21वीं सदी में दुनिया की आशाएं और अपेक्षाएं भारत से हैं और भारत की आशा और अपेक्षा आपके साथ जुड़ी हैं।
— PMO India (@PMOIndia) November 21, 2020
हमें तेज गति से चलना ही होगा, आगे बढ़ना ही होगा: PM