ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్ లోని జెనీవాలో జరిగిన ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 76 వ
సమావేశంలో వీడియో సందేశం ద్వారా
ప్రసంగించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి
ప్రసంగిస్తూ, 75 సంవత్సరాల పాటు
ప్రపంచానికి సేవ చేసే చారిత్రాత్మక మైలురాయిని పూర్తి చేసుకున్నందుకు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ను అభినందించారు. 100 ఏళ్ల సర్వీసుకు చేరుకోబోయే వచ్చే 25 ఏళ్ల కాలానికి డబ్ల్యూహెచ్ తగిన లక్ష్యాలను నిర్దేశించు కోగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆరోగ్య సంరక్షణలో మరింత సహకారం అవసరాన్ని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, కోవిడ్-19 మహమ్మారి సమయంలో బహిర్గతమైన ప్రపంచ ఆరోగ్య వ్యవస్థల
లోని అంతరాలను ప్రస్తావించారు. స్థితిస్థాపక ప్రపంచ వ్యవస్థలను నిర్మించడంలో, ప్రపంచ ఆరోగ్య సమానత్వాన్ని పెంచడంలో సమిష్టి కృషి అవసరాన్ని నొక్కి చెప్పారు. అంతర్జాతీయ సహకారానికి భారతదేశ నిబద్ధతను శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. గ్లోబల్ సౌత్ నుండి అనేక దేశాలతో సహా 100 కి పైగా దేశాలకు దాదాపు 300 మిలియన్ మోతాదుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను భారత దేశం రవాణా చేసిందని తెలియజేశారు. రానున్న సంవత్సరాల్లో వనరుల సమాన ప్రాప్యతకు మద్దతు ఇచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
"అనారోగ్యం లేకపోవడం మంచి ఆరోగ్యంతో సమానం కాదని భారతదేశ సాంప్రదాయ విజ్ఞానం చెబుతుంది" అని ప్రధాన మంత్రి అన్నారు, అనారోగ్యాల నుండి విముక్తి పొందడమే కాకుండా, ఆరోగ్యం వైపు అడుగులు వేయాలని ఆయన పేర్కొన్నారు. యోగా, ఆయుర్వేదం, ధ్యానం వంటి సంప్రదాయ విధానాల ప్రయోజనాలను వివరిస్తూ, ఇది ఆరోగ్య సంబంధిత శారీరక, మానసిక ,సామాజిక అంశాలను పరిష్కరిస్తుందని ప్రధాన మంత్రి వివరించారు డబ్ల్యూహెచ్ఓ మొట్టమొదటి గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ భారతదేశంలో ఏర్పాటు కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చిరుధాన్యాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంలో అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం కీలక పాత్ర పోషిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూడాలని మనకు ప్రభోదించే భారతదేశానికి చెందిన పురాతన గ్రంథాలు గురించి
ప్రధాన మంత్రి ప్రస్తావించారు. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే జీ20 థీమ్ ను ఆయన స్పృశిస్తూ, మంచి ఆరోగ్యం కోసం 'వన్ ఎర్త్ వన్ హెల్త్' భారతదేశం విజన్ అని అన్నారు. భారతదేశ దార్శనికత కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదని, జంతువులు, మొక్కలు, పర్యావరణంతో సహా మొత్తం పర్యావరణ వ్యవస్థకు విస్తరిస్తుందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
మన పర్యావరణ వ్యవస్థ మొత్తం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలమని ఆయన అన్నారు.
తక్కువ ఖర్చు తో ఆరోగ్య సంరక్షణ లభ్యత, అందుబాటు కు సంబంధించి గత కొన్నేళ్లలో భారతదేశం సాధించిన విజయాలను వివరిస్తూ, ప్రపంచంలోనే ఆరోగ్య మౌలిక సదుపాయాలను భారీగా పెంచేందుకు ఉద్దేశించిన అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం - ఆయుష్మాన్ భారత్, దేశంలోని మిలియన్ల కుటుంబాలకు పారిశుధ్యం ,త్రాగునీటిని అందించే డ్రైవ్ లను ప్రధాన మంత్రి ఉదాహరణలు గా పేర్కొన్నారు. దేశంలో చివరి మైలు వరకు ఆరోగ్యాన్ని పెంపొందించడమే భారతదేశ అనేక ప్రయత్నాల లక్ష్యమని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, భారతదేశ వైవిధ్యం స్థాయితో పనిచేసే విధానం ఇతర దేశాలకు కూడా ఒక ఫ్రేమ్ వర్క్ గా మారగలదని అన్నారు. అల్ప, మధ్యాదాయ దేశాల్లో ఇలాంటి ప్రయత్నాల లో డబ్ల్యూహెచ్ వో కు మద్దతు ఇవ్వడానికి భారత్ ఆసక్తిని శ్రీ మోదీ వ్యక్తం చేశారు.
ప్రసంగాన్ని ముగీస్తూ ప్రధాన మంత్రి, అందరికీ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో 75 ఏళ్లుగా డబ్ల్యూహెచ్ ఒ చేస్తున్న కృషిని కొనియాడారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు డబ్ల్యూహెచ్ ఒ వంటి అంతర్జాతీయ సంస్థల పాత్ర మరింత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. "ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి ప్రతి ప్రయత్నానికి సహాయం చేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది" అని ప్రధాన మంత్రి ముగించారు.