‘‘ఇది దేశానికి ఎలాగైతే ‘అమృత కాలం’ గా ఉందో, అదే విధం గా, ఇది మీ జీవనం లోనూ ‘అమృత కాలం’ సుమా’’
‘‘ప్రస్తుతం మీ ఆలోచనలు మరియు మన:ప్రవృత్తి మాదిరిగానే దేశం యొక్క ఆలోచనలుమరియు ప్రవర్తన కూడా ఉన్నాయి; ఇంతకు ముందు ఆలోచన విధానం అనేది మొక్కుబడి గాఉండింది, మరి ఇప్పటి ఆలోచన విధానం ఏదైనా చేసి తీరుదాం, పని చేసి ఫలితాలను సాధించుదాం అనేది గా మారింది’’
‘‘దేశం చాలా కాలాన్ని కోల్పోయింది. ఈ మధ్య లో, రెండు తరాలు వెళ్లి పోయాయి; అందువల్ల మనం రెండు నిమిషాల కాలాన్నయినా పోగొట్టుకోకూడదు’’
‘‘నా మాటలలో మీకు ధీరత్వం లోపించినట్లు కనిపిస్తూ ఉందేమో, కానీ మీరు కూడా ఇదే మాదిరి గా ఒక స్వయంసమృద్ధియుతభారతదేశం కోసం మీ ధీరత్వాన్ని కోల్పోవాలి అనే నేను కోరుకొంటున్నాను; ఆత్మ నిర్భర్ భారత్ అంటేనే అది పూర్ణస్వాతంత్య్రాని కి ఒక మౌలికమైన స్వరూపం; స్వయంసమృద్ధియుత భారతదేశం లో మనం ఎవ్వరిపైనా ఆధారపడబోం’’
‘‘మీరు సవాళ్ళ కోసం వెదకుతూ ఉన్నారనుకోండి, అప్పునడు మీరు ఒక వేటగాడు, మరిసవాలు అనేది మీరు వేటాడేటటువంటిది అవుతుందన్న మాట’’
‘‘సంతోషాన్ని, కరుణ ను పంచుకోవలసి వచ్చిందనుకోండి, అప్పుడు ఎటువంటి పాస్ వర్డ్ ను పెట్టుకోకండి. విశాల హృదయం తో జీవనాన్నిఆనందించండి’’

ఐఐటి కాన్ పుర్ లో ఈ రోజు న జరిగిన 54వ స్నాతకోత్సవాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరై, సంస్థాగత బ్లాక్ చైన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డిజిటల్ డిగ్రీ లను ఇచ్చారు.

 

ఇన్స్ టిట్యూట్ కు చెందిన విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న కాన్ పుర్ కు ఒక గొప్ప రోజు ఎందుకంటే, మెట్రో సదుపాయాని కి ఈ నగరం నోచుకొంటున్నది, మరి దీనితో పాటు గా ఉత్తీర్ణులైన విద్యార్థుల రూపం లో ప్రపంచాని కి ఒక బహు విలువైన కానుక ను కాన్ పుర్ అందిస్తోందన్నారు. ప్రముఖ విద్యాసంస్థ లో విద్యార్థుల యాత్ర ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘ఐఐటి కాన్ పుర్ లో చేరింది మొదలు ఉత్తీర్ణులు కావడం వరకు చూస్తే ఈ మధ్య లో మీరు మీ లోపల ఒక పెద్ద మార్పు ను గమనించే ఉంటారు. ఇక్కడ కు వచ్చే కంటే ముందు ఏదో అజ్ఞాత భయం గాని లేదా తెలియని తనం తాలూకు ప్రశ్న గాని మీలో రేకెత్తి ఉండి ఉంటుంది. ఇప్పుడు ఏదో తెలియని భయమంటూ ఏం లేదు. ఇప్పుడు యావత్తు ప్రపంచాన్ని తెలుసుకొని అర్థం చేసుకొనే ధైర్యం ఉంది. ఇప్పుడిక తెలియని దాని గురించిన ప్రశ్నలు ఎంత మాత్రం లేవు. ఇప్పుడు ఉన్నదల్లా సర్వశ్రేష్ఠమైన దాని ని గురించిన వెతుకులాటే. ఇంకా యావత్తు ప్రపంచం లో మీదే పైచేయి కావాలన్న కల ఉన్నది’’ అని ఆయన అన్నారు.

 

కాన్ పుర్ కు ఉన్నటువంటి చారిత్రిక వారసత్వాన్ని, సామాజిక వారసత్వాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, భారతదేశం లోని అమిత వైవిధ్యభరితమైన నగరాల లో ఒక నగరం కాన్ పుర్ అని పేర్కొన్నారు. ‘‘సతీ చౌరా ఘాట్ నుంచి మదారీ పాసీ వరకు, నానా సాహబ్ నుంచి బటుకేశ్వర్ దత్త్ వరకు.. ఎప్పుడయితే ఈ నగరాన్ని కలియదిరిగామో.. అప్పుడు మనం స్వాతంత్య్ర సంగ్రామం తాలూకు ప్రాణసమర్పణం యొక్క గౌరవాన్ని, ఆ గౌరవాన్విత గతం లోకి విహారం చేస్తున్నటువంటి అనుభూతి ని పొందుతూ ఉన్నట్లు గా తోస్తుంది’’ అని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.

 

ఉత్తీర్ణత ను సాధించిన విద్యార్థుల జీవనం లో వర్తమాన కాలానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. 1930వ దశకం నాటి కాలం నేపథ్యాన్ని ఆయన విపులం గా వివరించారు. ‘‘ఆ కాలం లో, 20-25 ఏళ్ళ వయస్సు కలిగిన యువతరం 1947 వరకు వారి యాత్ర, 1947వ సంవత్సరం లో స్వాతంత్య్రం లభించడం.. ఈ ఘట్టాలు వారి జీవనం లో బంగారు రోజులు అని అనుకోవచ్చు. ఈ రోజు న మీరు కూడా ఒక విధం గా అటువంటి స్వర్ణ యుగం లోకి అడుగు పెడుతున్నారు. ఎలాగయితే ఈ దేశ జీవనం లో ఇది ‘అమృత కాలం’ అయినట్లు గానే, అదే రీతి న ఇది మీ యొక్క జీవనం లో సైతం ‘అమృత కాలం’ సుమా ’’ అని ఆయన అన్నారు.

 

కాన్ పుర్ ఐఐటి కార్య సాధనల ను గురించి ప్రధాన మంత్రి విడమరచి చెప్తూ, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞాన ముఖచిత్రం వృత్తికుశలత కలిగిన వారికి అందిస్తున్న అవకాశాల ను తెలియ జేశారు. ఎఐ, శక్తి, జలవాయు సంబంధి పరిష్కారాలు, ఆరోగ్య రంగ సంబంధి పరిష్కారాలు మరియు విపత్తు నిర్వహణ లో సాంకేతిక విజ్ఞానం వంటి రంగాల లో ప్రాప్తిస్తున్నటువంటి అవకాశాల ను ప్రధాన మంత్రి సూచిస్తూ, ‘‘ఇవి మీ బాధ్యత లు మాత్రమే కాదు, ఇవి అనేక తరాల యొక్క స్వప్నాలు కూడాను. ఈ కలల ను నెరవేర్చే సౌభాగ్యం మీకు దక్కింది. ఈ కాల ఖండం గొప్ప గొప్ప లక్ష్యాల విషయం లో నిర్ణయాలు తీసుకొని, ఇంకా వాటి ని సాధించడం కోసం మీ సర్వ శక్తుల ను ఒడ్డవలసినటువంటి తరుణం’’ అన్నారు.

 

ఇరవై ఒకటో శతాబ్దం పూర్తి గా సాంకేతిక విజ్ఞానం పైన ఆధారపడి నడుస్తుంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఈ దశాబ్దం లో సైతం సాంకేతిక పరిజ్ఞానం వేరు వేరు రంగాల లో తన ఆధిపత్యాన్ని పెంచుకోనుంది. సాంకేతిక విజ్ఞానాని కి తావు లేనటువంటి జీవనం ఒక రకం గా అసంపూర్ణం గా మిగలనుంది అని ఆయన చెప్పారు. జీవితం యొక్క, సాంకేతిక విజ్ఞానం యొక్క స్పర్థ కు సంబంధించిన ఈ యుగం లో విద్యార్థులు తప్పక ముందడుగు వేస్తారు అని ఆయన అభిలషించారు. దేశ ప్రజల ఆలోచన ధోరణి కి సంబంధించిన తన అభిప్రాయాన్ని ప్రధాన మంత్రి విద్యార్థుల కు వెల్లడించారు. ‘‘ఇవాళ దేశం యొక్క ఆలోచన విధానం మరియు వైఖరి మీ లాగానే ఉంది. ఇది వరకు ఆలోచన విధానం మొక్కుబడి గా ఉండేది అనుకుంటే, ఇవాళ ఆలోచన విధానం అనేది క్రియాత్మకం గా, ఫలితాన్ని సాధించడం ప్రధానం గా ఉన్నది. మునుపు సమస్యల నుంచి పరారు అయ్యేందుకు ప్రయత్నం జరిగితే, మరి ఇప్పుడు సమస్యల ను పరిష్కరించడం కోసం సంకల్పాలు తీసుకోవడం జరుగుతున్నది’’ అని ఆయన వివరించారు.

 

స్వాతంత్య్రం తాలూకు 25వ వార్షికోత్సవం నాటి నుంచి జాతి నిర్మాణాని కి వినియోగించవలసిన కాలాన్ని కోల్పోవడం పట్ల ప్రధాన మంత్రి క్షోభ ను వ్యక్తం చేశారు. ‘‘ఎప్పుడైతే దేశ స్వాతంత్య్రం 25 సంవత్సరాల ను పూర్తి చేసుకొన్నదో, అప్పటికంతా మనం మన సొంత కాళ్ళ మీద నిలబడటానికి ఎంతో చేసి ఉండి ఉండాల్సింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ఆలస్యం అయిపోయింది. దేశం చాలా కాలాన్ని పోగొట్టుకొంది. ఇంతలో, రెండు తరాలు వెళ్లిపోయాయి. ఈ కారణం గా, మనం కనీసం రెండు క్షణాలనైనా పోగొట్టుకోవడానికి ఆస్కారం లేదు’’ అని ఆయన అన్నారు.

 

 

నేను ధీరత్వం లోపించి మాట్లాడుతున్నాను అని మీకు అనిపించింది అంటే గనక, అలా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే అది నేను కోరుకుంటున్నాను.. ఉత్తీర్ణులైన విద్యార్థులు ‘‘ఇదే మాదిరి గా స్వయంసమృద్ధియుత భారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం ధీరత్వాన్ని కోల్పోవ్వాలి. స్వయంసమృద్ధియుత భారతదేశం అనేది సంపూర్ణమైనటువంటి స్వాతంత్య్రాని కి మూల స్వరూపం. ఆ బిందువు వద్ద మనం ఎవరి పైనా ఆధారపడి ఉండకూడదు.’’ అని ప్రధాన మంత్రి వివరించారు. స్వామి వివేకానంద మాటల ను ప్రధాన మంత్రి వల్లె వేస్తూ, స్వామి వివేకానందుల వారు అన్నారు కదా.. ప్రతి ఒక్క దేశం వద్ద ఇవ్వడానికంటూ ఒక సందేశం ఉంటుంది. పూర్తి చేయడానికి గాను ఒక మిశన్ ఉంటుంది. చేరుకోవడానికంటూ ఒక గమ్యం ఉంటుంది.. అని. ఒకవేళ మనం స్వయంసమృద్ధం కాలేకపోతే, అడు మన దేశం తన లక్ష్యాల ను ఎలా నెరవేర్చుకోగలదు. అది తన గమ్య స్థానాని కి ఎలా చేరుకోగలదు.. అని పేర్కొన్నారు.

 

అటల్ ఇనొవేశన్ మిశన్, పిఎమ్ రిసర్చ్ ఫెలో శిప్స్, ఇంకా జాతీయ విద్య విధానం వంటి కార్యక్రమాల ద్వారా ఒక సరికొత్త స్వభావాన్ని, నూతన అవకాశాల ను సృష్టించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు. వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని మెరుగు పరచడం, విధానపరమైనటువంటి అడ్డంకుల ను తొలగించడం తాలూకు ఫలితాలు స్పష్టం గా కనిపిస్తున్నాయి అని ఆయన అన్నారు. స్వాతంత్య్రం తాలూకు 75వ సంవత్సరం లో భారతదేశం లో 75 కు పైగా యూనికార్న్ లు, 50,000లకు పైచిలుకు స్టార్ట్-అప్స్ ఉన్నాయి అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. వీటిలో 10,000 వరకు గత 6 నెలల వ్యవధి లోనే ఆరంభం అయ్యాయి. ప్రస్తుతం భారతదేశం ప్రపంచం లో రెండో అతి పెద్ద స్టార్ట్-అప్ హబ్ గా ఎదిగింది. అనేక స్టార్ట్-అప్స్ ఐఐటి ల యువత మొదలుపెట్టినవే. ప్రపంచం లో దేశం స్థితి ని మెరుగుపరచడం లో తోడ్పాటు ను అందించవలసింది విద్యార్థులే అని ప్రధాన మంత్రి తన అభిలాష ను వ్యక్తం చేశారు. ‘‘భారతదేశం లోని కంపెనీ లు, భారతదేశం తయారు చేసే ఉత్పత్తులు ప్రపంచ శ్రేణికి చెందినవి గా తయారు కావాలని భారతదేశం లో ఏ ఒక్కరు కోరుకోరు?!. ఐఐటి లను గురించి తెలిసిన వారు ఇక్కడి ప్రతిభ ను గురించి కూడా తెలుసుకొనే ఉంటారు. ఇక్కడి ఆచార్యుల కఠోర శ్రమ గురించి కూడా వారికి తెలిసే ఉంటుంది. ఈ ఐఐటి లకు చెందిన యువత తప్పక దీనిని నెరవేరుస్తారు అని వారు నమ్ముతారు’’ అని ఆయన అన్నారు.

 

సవాలు కు బదులు గా హాయి ని ఎంపిక చేసుకోవద్దు అంటూ ప్రధాన మంత్రి విద్యార్థుల కు సలహా ను ఇచ్చారు. ‘‘ఇలా ఎందుకు అంటున్నానంటే. మీరు కోరుకున్నా గాని, కోరుకోకపోయినా గాని, జీవనం లో సవాళ్ళు అనేవి తప్పవు. వాటి నుంచి పారిపోయే వారు ఆ సవాళ్ల బాధితులు గా మిగులుతారు. అదే మీరు గనక సవాళ్ళ ను గురించి వెదకుతూ ఉస్తూ పక్షం లో, అప్పుడు మీరే వేటగాడు అవుతారు. అనేదివి మీరు వేటాడేదవుతుంది’’ అని ఆయన అన్నారు.

 

ప్రధాన మంత్రి తన తరపు నుంచి వ్యక్తిగతం గా ఒక సలహా ను విద్యార్థుల కు ఇచ్చారు. అది ఏమిటి అంటే- విద్యార్థులు వారి లోపల సూక్ష్మ గ్రాహ్యత, కుతూహలం, కల్పనశీలత ఇంకా రచనాత్మకత.. వీటిని సజీవం గా అట్టిపెట్టుకోవాలి. ఇంకా వారు జీవనం తాలూకు సాంకేతికేతర అంశాల పట్ల సూక్ష్మ గ్రాహ్యత ను కలిగి ఉండాలి- అనేదే. ‘‘మీరు ఉల్లాసాన్ని, దయ ను పంచుకోవలసి వచ్చిందనుకోండి, అప్పుడు ఎటువంటి పాస్ వర్డ్ ను పెట్టుకోకండి. తెరచి ఉంచిన హృదయం తో జీవనం యొక్క ఆనందాన్ని అనుభూతి చెందండి.’’ అని ఆయన చెప్పారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi