ఈ సంద‌ర్భంగా స్మార‌క నాణెం, త‌పాలా బిళ్ల‌ను విడుద‌ల చేసిన ప్ర‌ధాన‌మంత్రి
గురువుల ప్ర‌బోధాల‌కు అనుగుణంగా దేశం ముందుకు క‌దులుతోంది.
వంద‌లాది సంవ‌త్స‌రాల బానిస‌త్వం నుంచి భార‌త‌దేశం సాధించిన స్వేచ్ఛ దాని ఆథ్యాత్మిక‌, సాంస్కృతిక ప్ర‌యాణం నుంచి వేరు చేయ‌రాదు
"ఔరంగజేబు నిరంకుశ ఆలోచనా విధానం ముందు గురు తేజ్ బహదూర్ జీ 'హింద్ ది చాదర్'గా వ్యవహరించారు"
న‌వ‌భార‌తం ప్ర‌కాశంలో ప్రతిచోటా గురు తేజ్ బహదూర్ జీ ఆశీర్వాదాలను మేము అనుభవిస్తున్నాము"
గురువులు అందించిన జ్ఞానం, ఆశీర్వాదంతో మ‌నం ప్ర‌తిచోటా ఏక్ భార‌త్ ను చూస్తాం.
అంత‌ర్జాతీయంగా ఘ‌ర్ష‌ణ‌లు ఎన్ని ఉన్న‌ప్ప‌టికీ, ప్ర‌స్తుత భార‌త‌దేశం, సుస్థిర‌త‌తో శాంతి కోసం ప్ర‌య‌త్నిస్తుంది. దేశ ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త విష‌యంలో అంతే స‌మానంగా దృఢంగా ఉంది.

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ  ఎర్ర‌కోట‌లో జ‌రిగిన‌, గురు తేజ్‌బ‌హ‌దూర్ జీ ప్ర‌కాశ్ పూర‌బ్ 400 వ ఉత్స‌వాల‌లో పాల్గొన్నారు. ప్ర‌ధాన‌మంత్రి శ్రీ గురు తేజ్ బ‌హ‌దూర్‌జీకి ప్రార్ధ‌న‌లు నిర్వ‌హించారు.  400 మంది షాబాద్ , కీర్త‌న్ ఆల‌పిస్తుండ‌గా ప్ర‌ధాన‌మంత్రి వారితో క‌ల‌సి ప్రార్థ‌న‌ల‌లో పాల్గొన్నారు.సిక్కు నాయ‌కులు ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రిని స‌త్క‌రించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ సంద‌ర్భంగా ఒక స్మార‌క త‌పాలాబిళ్ల‌ను విడుద‌ల చేశారు.

 ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి,గురువుల ఆశీస్సుల‌తో ,వారి ప్ర‌బోధాల‌కు అనుగుణంగా దేశం ముందుకు పోతున్న‌ద‌ని అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి గురువుల ముందు మోక‌రిల్లి వారికి న‌మ‌స్క‌రించారు. ఎర్ర‌కోట ప్రాముఖ్య‌త గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ, ఈ ఎర్ర‌కోట గురు తేజ్ బ‌హ‌దూర్ జీ అమ‌ర‌త్వాన్ని చూసింద‌ని, ఇది దేశ ఆకాంక్ష‌ల‌కు , చ‌రిత్ర‌కు ప్ర‌తిబింబ‌మ‌ని అన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ చ‌రిత్రాత్మ‌క ప్ర‌దేశానికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

 వంద‌లాది సంవ‌త్స‌రాల బానిస‌త్వం నుంచి విముక్తి కోసం సాగిన భార‌త స్వాతంత్ర సంగ్రామం గురిచి ప్ర‌ధాన‌మంత్రి నొక్కి చెప్పారు. భార‌త స్వాతంత్ర సంగ్రామాన్ని దేశ ఆథ్యాత్మిక‌, సాంస్కృతిక ప్ర‌యాణం నుంచి వేరు చేయరాద‌ని అన్నారు. ఈ స్ఫూర్తితోనే దేశం ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను ,  గురు తేజ్ బ‌హ‌దూర్ జీ 400 వ ప్ర‌కాష్ పూర‌బ్ ఉత్స‌వాల‌న‌కు ఉమ్మ‌డి స్ఫూర్తితో నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. మ‌న గురువులు ఎల్ల‌ప్పుడూ స‌మాజ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించ‌డ‌మే కాక జ్ఞానం,ఆథ్యాత్మిక‌త‌, సంస్కృతిని ముందుకు తీసుకుపోతూ వచ్చార‌ని అన్నారు. సేవ వారి మాధ్య‌మం అన్నారు.

ఈ ప‌విత్ర భూమి కేవ‌లం ఒక దేశం కాద‌ని, ఇది మ‌న గొప్ప వార‌స‌త్వం, అపూర్వ సంప్ర‌దాయ‌మ‌ని ఆయ‌న అన్నారు. దీనిని మ‌న రుషులు పెంపొందిస్తూ వ‌చ్చార‌ని ఆయ‌న అన్నారు. వంద‌ల వంద‌ల ఏళ్ల త‌ప‌స్సుతో మన గురువులు ఆలోచ‌న‌ల‌కు ప‌రిపుష్టి క‌లిగించార‌ని అన్నారు. ద‌గ్గ‌ర‌లోనే ఉన్న గురుద్వారా షీష్ గంజ్ సాహిబ్‌, గురు తేజ్ బ‌హ‌దూర్ జీ అమ‌ర‌త్యాగానికి నిలువెత్తు నిద‌ర్శ‌న మ‌న్నారు. ఇది గురుతేజ్ బ‌హ‌దూర్ జీ త్యాగం ఎంత‌టిదో గుర్తుచేస్తుంద‌న్నారు. ఆరోజుల‌లో మ‌తం పేరుతో హింస‌కు పాల్ప‌డి, మ‌తోన్మాదంతో దారుణ అకృత్యాల‌కు పాల్ప‌డిన వారి గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించి ఆనాటి రోజుల‌ను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ రోజుల‌లో ఇండియా త‌న ఉనికిని కాపాడుకోవ‌డానికి ఒక గొప్ప ఆశ రూపంలో గురు తేజ్ బ‌హ దూర్ జీ ఆవిర్భ‌వించార‌ని ఆయ‌న చెప్పారు. ఔరంగ‌జేబు నిరంకుశ ఆలోచ‌నా విధానం ముందు, గురు తేజ్ బ‌హ‌దూర్ జీ, హింద్ దీ చ‌ద‌ర్ గా , శిఖ‌ర స‌మానుడై నిలిచార‌ని అన్నారు. గురు తేజ్ బ‌హ‌దూర్ జీ త్యాగం, భార‌త‌దేశంలోని ఎన్నొ త‌రాల‌కు ప్రేర‌ణ క‌ల్పిస్తూ వ‌స్తున్న‌ద‌ని , దేశ గౌర‌వం, సంస్కృతిని కాపాడుకోవ‌డానికి జీవించాలని ,దాని కోసంమ‌ర‌ణించాల‌న్న ప్రేర‌ణ నిచ్చింద‌ని అన్నారు.
 పెద్ద పెద్ద శ‌క్తులు మాయ‌మ‌య్యాయి. పెను సంక్షోభాలు స‌ద్దుమ‌ణిగాయి, కానీ ఇండియా ఎన్న‌టికీ నిలువెత్తున నిలిచి ముందుకు సాగుతున్న‌ది అని ఆయ‌న అన్నారు. ఇవాళ ,ప్ర‌పంచం మ‌రోసారి ఎంతో ఆశ‌గా , ఎన్నో ఆకాంక్ష‌ల‌తో ఇండియావైపు చూస్తున్న‌ద‌ని ప్ర‌ధానంత్రి అన్నారు.మ‌న న‌వ‌భార‌తంలో ప్ర‌తిచోటా శ్రీ గురు తేజ్ బ‌హదూర‌ర్‌జీ ఆశీస్సుల దివ్య ప్ర‌కాశం కాంతులీనుతూ ఉన్న‌దానిని మ‌నం అనుభ‌వంలో చూస్తున్నామ‌ని అన్నారు.

గురువుల ప్ర‌భావం, వారి జ్ఞాన జ్యోతి దేశంలోని మారుమూల ప్రాంతాల‌కూ విస్త‌రించింద‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. గురునాన‌క్ దేవ్ జీ దేశాన్ని ఒక్క తాటిపై నిలిపార‌ని ప్ర‌ధాన‌మంత్రి కీర్తించారు. గురు తేజ్ బ‌హ‌దూర్ అనుయాయులు ప్ర‌తి చోటా ఉన్నార‌న్నారు. ప‌ట్నాలోని ప‌ట్నా సాహిబ్‌, ఢిల్లీలోని రాక‌బ్ గంజ్ సాహిబ్ ల గురించి ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. గురువుల ఆశీస్సులలో మ‌నం ఏక్ భార‌త్ ను ద‌ర్శిస్తున్నామ‌న్నారు. సిక్కు సంస్కృతి కి సంబంధించిన ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ గురించి ప్ర‌స్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, డిసెంబ‌ర్ 26ను షాహిబ్ జాదాల గొప్ప త్యాగానికి గుర్తుగా వీర్ బాల్ దివ‌స్‌గా జ‌రుపుకోవాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు చెప్పారు. సిక్కు సంప్ర‌దాయాల‌కు సంబంధించిన యాత్రాస్థలాల‌ను క‌లిపే ప్ర‌క్రియ నిరంత‌రం కొన‌సాగిస్తున్న‌ద‌ని  చెప్పారు. క‌ర్తార్‌సాహిబ్ కోసం వేచిచూసే స‌మ‌యం అయిపోయింద‌ని, ఎన్నో ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ఈ ప‌విత్ర పుణ్య‌క్షేత్రాల‌ను ద‌ర్శించ‌డం సుల‌భ‌త‌రం చేశాయ‌ని వాటిని అందుబాటులోకి తెచ్చాయని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. స్వ‌దేశీ ద‌ర్శ‌న్‌కార్య‌క్ర‌మం కింద , యాత్రా స‌ర్కూట్ వ‌స్తున్న‌ద‌ని, ఇందులో ప్ర‌ముఖ ప్ర‌దేశాలైన ఆనందపూర్ సాహిబ్‌, అమృత్ స‌ర్‌సాహిబ్ ఉన్నాయ‌న్నారు. హేమ‌కుంట్ సాహిబ్ వ‌ద్ద రోప్‌వే ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయ‌న్నారు. శ్రీ గురుగ్రంథ్ సాహిబ్ కు శిర‌సువంచి న‌మ‌స్క‌రిస్తూ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ గురుగ్రంథ్ సాహిబ్ జీ మ‌న‌కు ఆత్మ‌వివేచ‌న‌కు మార్గ‌ద‌ర్శి అని అన్నారు. ఇది భార‌త‌దేశ వైవిధ్య‌త‌కు, ఐక్య‌త‌కు ఇది స‌జీవ‌రూప‌మ‌న్నారు. అందువ‌ల్ల ప్ర‌భుత్వం ఆఫ్ఘ‌నిస్తాన్‌లో సంక్షోభం ఏర్ప‌డిన‌పుడు గురుగ్రంథ్ సాహిబ్ ప‌విత్ర స్వ‌రూప్‌ను అన్ని మ‌ర్యాద‌ల‌తో తీసుకువ‌చ్చిన‌ట్టు తెలిపారు. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం గురించి కూడా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌స్తావించారు. పొరుగుదేశాల నుంచి వ‌చ్చే సిక్కులు ఇత‌ర మైనారిటీల పౌర‌స‌త్వ మార్గాన్ని సుగ‌మం చేసిన‌ట్టు తెలిపారు.

భార‌త‌దేశ మౌలిక తాత్విక చింత‌న గురించి ప్రస్తావిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఇండియా ఏనాడూ ఏ దేశానికి, ఏ స‌మాజానికి ముప్పు క‌లిగించ‌లేద‌ని అన్నారు. ఇవాళ కూడా మ‌నం ప్ర‌పంచం మొత్తం సంక్షేమం గురించి ఆలోచిస్తామ‌న్నారు. ఇండియా స్వావ‌లంబ‌న గురించి మాట్లాడుతున్నామంటే, మ‌నం మొత్తం ప్ర‌పంచ ప్ర‌గ‌తిని ముందుంచుకుని మాట్లాడుతున్నామ‌ని అన్నారు. ఇవాళ ఇండియా శాంతికి పాటుప‌డుతున్న‌ద‌ని, ప్ర‌పంచంలో నెల‌కొన్న సంక్షోభ ప రిస్థితుల ప‌రిపూర్ణ శాంతి, సుస్థిర‌త‌కు ఇండియా పాటుప‌డుతున్న‌దని చెప్పారు. అల‌గే ఇండియా త‌న‌ను తాను ర‌క్షించుకోవ‌డంలో, భ‌ద్ర‌త విష‌యంలో అంతే స్థిర సంకల్పంతో ఉంటుంద‌ని అన్నారు. సిక్కు గురువులు అందించిన గొప్ప సంప్ర‌దాయం మ‌న ముందు నిలిచి ఉన్న‌ద‌ని ఆయ‌న అన్నారు.

పాత మూస ఆలోచ‌న‌ల స్థానంలో మ‌న గురువులు నిత్య‌నూత‌న ఆలోచ‌న‌లు మ‌న ముందుంచార‌ని ఆయ‌న అన్నారు.నూత‌న ఆలోచ‌న‌ల‌ను ముందుకు తీసుకువెళ్లే సామాజిక ప్ర‌చారం, ఆలోచ‌నల వ్యాప్తి స్థాయిలో నూత‌న అన్వేష‌ణ అని ఆయ‌న అన్నారు. నూత‌న ఆలోచ‌న‌లు, క‌ష్టించి ప‌నిచేయ‌డం, నూరుశాతం నిబ‌ద్ధ‌త‌,ఇది మ‌న సిక్కు స‌మాజ గుర్తింపుగా ఇవాల్టీకి ఉన్నాయ‌న్నారు. ప్ర‌స్తుత ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వ్ సంద‌ర్భంగా దేశ సంకల్పం ఇది అన్నారు. మ‌న గుర్తింపు మ‌నకు గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. మ‌నం స్థానిక‌త విష‌యంలో గ‌ర్వప‌డాల‌ని, స్వావ‌లంబిత భార‌త దేశాన్ని నిర్మించాల‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage