ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌కు చెందిన 13 ఏళ్ల బాలిక మీనాక్షి క్షత్రియపై ప్రశంసలు గుప్పించారు. ఈ మేరకు ఆమె ‘ని-క్షయ’ మిత్రగా నమోదు చేసుకుని, తన పొదుపు సొమ్ముతో క్షయ రోగుల సంరక్షణ బాధ్యత స్వీకరించడం ద్వారా ఆమె చూపిన విశిష్ట సేవాభావాన్ని ప్రధాని అభినందించారు.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“ఇది అందరూ గుర్తించాల్సిన ఔదార్యం... క్షయరహిత భారతం లక్ష్య సాధన కృషికి ఆమె సేవాభావం ఎంతగానో ఉత్తేజమిస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Noteworthy gesture, which will boost the efforts towards achieving TB-free India. https://t.co/IAFh4k65Em
— Narendra Modi (@narendramodi) February 4, 2023