ఆసియా క్రీడల కబడ్డీలో భారత మహిళల జట్టు చారిత్రక విజయంతో స్వర్ణ పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదొక చారిత్రక ఘట్టం. మన మహిళల కబడ్డీ జట్టు తిరుగులేని పోరాట పటిమ ప్రదర్శించి స్వర్ణం కైవసం చేసుకుంది! ఈ విజయం మన మహిళా క్రీడాకారుల పోరాట స్ఫూర్తికి నిదర్శనం. దీనిపై యావద్దేశం గర్వంతో ఉప్పొంగుతోంది. మన జట్టుకు నా శుభాభినందనలు. భవిష్యత్తులోనూ ఈ విజయ పరంపరను కొనసాగించాలని ఆకాంక్షిస్తూ వారిని ఆశీర్వదిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
It is a historic moment for India at the Asian Games. Our Kabaddi Women's team has clinched the Gold! This victory is a testament to the indomitable spirit of our women athletes. India is proud of this success. Congrats to the team. My best wishes for their future endeavours. pic.twitter.com/amfPaGmiHt
— Narendra Modi (@narendramodi) October 7, 2023