ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న హిమాచల్ ప్రదేశ్ లోని మండీ లో జరిగిన ‘హిమాచల్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్’ తాలూకు రెండో గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమని కి అధ్యక్షత వహించారు. దాదాపు 28,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల ద్వారా ఆ ప్రాంతం లో పెట్టుబడి కి ఈ సదస్సు ఒక దన్ను గా నిలుస్తుందన్న అంచనా ఉంది. ప్రధాన మంత్రి 11,000 కోట్ల రూపాయల కు పైగా విలువ గల జల విద్యుత్తు పథకాల ను కూడా ప్రారంభించి, ఆ తరహా పథకాలు మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. జల విద్యుత్తు పథకాల లో కొన్ని ఏవేవంటే అవి రేణుకాజీ ఆనకట్ట పథకం, లుహ్ రీ ఒకటో దశ జల విద్యుత్తు పథకం, ధౌలాసిధ్ జల విద్యుత్ పథకం. ఆయన సావ్ రా- కుడ్ డూ జల విద్యుత్తు పథకాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జయ్ రామ్ ఠాకుర్, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ లు ఉన్నారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, హిమాచల్ ప్రదేశ్ తో తనకు ఉన్నటువంటి భావోద్వేగభరిత బంధాన్ని గుర్తు కు తెచ్చుకున్నారు. ఆ రాష్ట్రం లోని పర్వతాలు తన జీవనం లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర ను పోషించాయి అని ఆయన అన్నారు. నాలుగు సంవత్సరాల పాటు జోడు ఇంజిన్ ల ప్రభుత్వానికిగాను హిమాచల్ ప్రదేశ్ ప్రజల కు ఆయన అభినందనల ను కూడా తెలియ జేశారు. ఈ నాలుగేళ్ళ లో రాష్ట్రం మహమ్మారి సవాలు ను ఎదుర్కొని, అలాగే అభివృద్ధి తాలూకు శిఖరాల ను కూడా అధిరోహించింది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘జయ్ రామ్ గారు మరియు ఆయన నేతృత్వం లో కష్టించి పనిచేసిన బృందం హిమాచల్ ప్రదేశ్ ప్రజల కలల ను పండించడం కోసం ఏ ఒక్క అవకాశాన్ని అయినా విడిచిపెట్టలేదు’’ అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.
దేశం లోని ప్రజల కు ‘జీవించడం లో సౌలభ్యం’ కల్పన అనేది అగ్ర ప్రాథమ్యాల లో ఒకటి గా ఉంది మరి దీని ని నెరవేర్చడం లో విద్యుత్తు ఒక పెద్ద పాత్ర ను పోషిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ రోజు న ప్రారంభించినటువంటి జల విద్యుత్తు పథకాలు పర్యావరణ మిత్ర పూర్వకమైన అభివృద్ధి పట్ల భారతదేశం యొక్క వచన బద్ధత కు అద్దం పడుతున్నాయి అని ఆయన అన్నారు. ‘‘గిరి నది మీది శ్రీ రేణుకాజీ ఆనకట్ట ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది అంటే, దాని వల్ల ఒక విశాల ప్రాంతం ప్రత్యక్ష ప్రయోజనాన్ని పొందుతుంది. ఈ ప్రాజెక్టు నుంచి అందే ఏ ఆదాయం లో అయినా సరే అందులోని ఒక పెద్ద భాగాన్ని కూడా ఇక్కడి అభివృద్ధి కై వెచ్చించడం జరుగుతుంది’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
‘న్యూ ఇండియా’ పని తీరు మారింది అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. భారతదేశం తన పర్యావరణ సంబంధి లక్ష్యాల ను నెరవేర్చుకొంటున్న వేగాన్ని గురించి ఆయన మాట్లాడారు. ‘‘2016వ సంవత్సరం లో, భారతదేశం తన స్థాపిత విద్యుత్తు సామర్ధ్యం లో 40 శాతాన్ని 2030వ సంవత్సరానికల్లా శిలాజేతర శక్తి వనరుల నుంచి సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకొంది. ఈ లక్ష్యాన్ని భారతదేశం ఈ ఏడాది నవంబర్ లోనే సాధించింది అనే విషయం పట్ల భారతదేశం లోని ప్రతి ఒక్కరు ప్రస్తుతం గర్వించాలి’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘పర్యావరణాన్ని కాపాడుతూనే భారతదేశం ఏ విధం గా అభివృద్ధి ని వేగిరపరచుకొంటున్నదీ గమనించి యావత్తు ప్రపంచం భారతదేశాన్ని మెచ్చుకొంటున్నది. సౌర విద్యుత్తు మొదలుకొని జల విద్యుత్తు వరకు, పవన విద్యుత్తు మొదలుకొని గ్రీన్ హైడ్రోజన్ వరకు నవీకరణ యోగ్య శక్తి తాలూకు ప్రతి ఒక్క వనరు ను పూర్తి స్థాయి లో వినియోగించుకోవడాని కి దేశం అదే పని గా పాటుపడుతోంది’’ అని ప్రధాన మంత్రి తెలిపారు.
ప్లాస్టిక్ ను ఒకసారి ఉపయోగించిన తరువాత వదలివేయాలి అనే తన ఆలోచన ను గురించి ప్రధాన మంత్రి మరోమారు వెల్లడించారు. ప్లాస్టిక్ వల్ల పర్వతాల కు వాటిల్లిన నష్టం విషయం లో ప్రభుత్వం అప్రమత్తం గా ఉంది అని ఆయన చెప్పారు. ఒకసారి వినియోగించవలసిన ప్లాస్టిక్ పట్ల దేశవ్యాప్త ప్రచార ఉద్యమాన్ని నడపడం తో పాటుగా ప్రభుత్వం ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అంశం పైన సైతం కృషి చేస్తోంది. మనిషి ప్రవర్తన లో మార్పు రావలసిన అవసరాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావిస్తూ, ‘‘హిమాచల్ ను స్వచ్ఛం గాను, ప్లాస్టిక్ కు మరియు ఇతర వ్యర్థ పదార్థాల కు తావు ఉండనటువంటివి గాను అట్టిపెట్టడం లో పర్యటకుల కు కూడా ఒక ప్రధాన బాధ్యత ఉంది. ప్లాస్టిక్ అన్ని చోట్ల కు వ్యాపించింది. ప్లాస్టిక్ నదుల లోకి వెళ్తోంది. అది హిమాచల్ కు కలుగజేస్తున్న నష్టాన్ని అడ్డుకోవడం కోసం మనమంతా కలసి తప్పక పాటుపడాలి’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో ఔషధ నిర్మాణ రంగం యొక్క వృద్ధి ని ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. ‘‘భారతదేశం ప్రస్తుతం ప్రపంచ ఔషధాలయం అనే పేరు ను తెచ్చుకొందీ అంటే దాని వెనుక ఉన్న శక్తి హిమాచల్. హిమాచల్ ప్రదేశ్ కరోనా విశ్వమారి కాలం లో ఇతర రాష్ట్రాల కు సాయపడటం ఒక్కటే కాకుండా ఇతర దేశాల కు కూడాను సాయం చేసింది’’ అని ఆయన అన్నారు.
రాష్ట్రం కనబరచిన గొప్ప పని తీరు ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘హిమాచల్ తన యావత్తు వయోజనుల కు టీకామందు ను అందించడం లో ఇతర రాష్ట్రాల కంటే ఉజ్జ్వలం గా ప్రకాశించింది. ఇక్కడ ప్రభుత్వం లో ఉన్న వారు రాజకీయ స్వార్ధపరత్వం లో మునిగిపోలేదు. అంతకంటే వారు వారి పూర్తి దృష్టి ని హిమాచల్ లోని ప్రతి ఒక్క పౌరుడు\పౌరురాలు ఏ విధం గా వ్యాక్సీన్ ను పొందగలరు అనే అంశం పైనే నిలిపారు’’ అని ఆయన అన్నారు.
అమ్మాయిలకు వివాహ వయస్సు ను మార్చడాని కి ప్రభుత్వం ఇటీవల తీసుకొన్న నిర్ణయాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ‘‘కుమారుల ను వివాహానికి అనుమతించే వయస్సు తో సమానం గా కుమార్తె ల వివాహ వయస్సు కూడా ఉండాలి అని మేం నిర్ణయించాం. కుమార్తెల కు వివాహ యుక్త ప్రాయాన్ని 21 సంవత్సరాల కు పెంచడం అనేది వారికి చదువుకోవడానికి పూర్తి కాలాన్ని ప్రసాదిస్తుంది. మరి వారు వారి యొక్క ఉద్యోగ జీవనాన్ని కూడా తీర్చిదిద్దుకోగలుగుతారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
కొత్త వాక్సీనేశన్ కేటగిరీ ల విషయం లో ఇటీవల ప్రకటనల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు. ప్రతి ఒక్క అవసరాన్ని దృష్టి లో పెట్టుకొని ప్రభుత్వం అత్యంత సూక్ష్మ గ్రాహ్యత తో, జాగ్రత తో పని చేస్తోంది అని ఆయన అన్నారు. 15 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళ మధ్య వయస్సు కలిగిన వారి కి సైతం రాబోయే జనవరి 3వ తేదీ నుంచి టీకామందు ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
గడచిన రెండు సంవత్సరాల లో కరోనా కు వ్యతిరేకం గా జరుగుతూ ఉన్న యుద్ధం లో మన ఆరోగ్య రంగ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్ లు దేశాని కి బలం గా నిలచారు అని ప్రధాన మంత్రి అన్నారు. వారికి ప్రికాశన్ డోజు ను ఇచ్చే ప్రక్రియ కూడా రాబోయే జనవరి 10వ తేదీ నుంచి మొదలవుతుంది. 60 సంవత్సరాల వయస్సు పైబడిన వృద్ధులు ఇదివరకే గంభీరమైన వ్యాధుల బారిన పడి ఉన్నట్లయితే వారికి కూడా వైద్యుల సలహా ప్రకారం ప్రికాశన్ డోసేజీ తాలూకు ఐచ్ఛికాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ప్రధాన మంత్రి తెలిపారు.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, ఇంకా సబ్ కా ప్రయాస్’ మంత్రం స్ఫూర్తి తో కృషి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘ప్రతి దేశాని కి వేరు వేరు ఆదర్శవాదాలంటూ ఉంటాయి. కానీ ప్రస్తుతం మన దేశ ప్రజలు రెండు విధాలైన ఆలోచనవిధానాల ను స్పష్టం గా గమనిస్తున్నారు. ఒక ఆలోచన విధానం జాప్యాని కి సంబంధించింది. మరొక ఆలోచన విధానం అభివృద్ధి కి సంబంధించింది. జాప్యం చేయడం అనే ఆలోచన విధానం కలిగిన వారు పర్వత ప్రాంతాల లో ప్రజల పట్ల ఎన్నడూ శ్రద్ధ వహించ నేలేదు’’ అని ఆయన అన్నారు. జాప్యాని కి తావునిచ్చే ఆలోచన విధానం హిమాచల్ ప్రదేశ్ ప్రజల ను దశాబ్దుల పాటు నిరీక్షణ కు గురి చేసింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణం గా అటల్ సొరంగ మార్గం నిర్మాణం లో అనేక సంవత్సరాల ఆలస్యం జరిగింది. రేణుక ప్రాజెక్టు కూడా మూడు దశాబ్దాల పాటు ఆలస్యం అయింది. ప్రభుత్వం నిబద్ధతల్లా అభివృద్ధే అని ఆయన నొక్కి చెప్పారు. అటల్ సొరంగ మార్గం పని పూర్తి అయింది. మరి చండీగఢ్ నుంచి మనాలీ ని మరియు శిమ్ లా ను కలిపే రహదారి ని కూడా విస్తరించడం జరిగింది అని ఆయన వివరించారు.
హిమాచల్ ఒక పెద్ద సంఖ్య లో రక్షణ సిబ్బంది కి పుట్టినిల్లుగా ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. రక్షణ సిబ్బంది కి, ఆ రంగం లో ఇది వరకు పని చేసిన వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొన్న చర్యల ను గురించి ఆయన వివరించారు. ‘‘హిమాచల్ ప్రదేశ్ లో ప్రతి ఒక్క కుటుంబం లోను దేశాన్ని కాపాడే ధైర్యవంతులైన కుమారులు, కుమార్తెలు ఉన్నారు . దేశ భద్రత ను పెంచడం కోసం గత ఏడేళ్ళ లో మా ప్రభుత్వం చేసిన కార్యాలు, సిపాయిలు, మాజీ సైనికోద్యోగుల కోసం తీసుకొన్న నిర్ణయాలు సైతం హిమాచల్ ప్రజల కు గొప్ప ప్రయోజనాల ను అందించాయి’’ అని చెప్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
जयराम जी और उनकी परिश्रमी टीम ने हिमाचल वासियों के सपनों को पूरा करने के लिए कोई कोर-कसर नहीं छोड़ी है।
— PMO India (@PMOIndia) December 27, 2021
इन 4 वर्षों में 2 साल हमने मजबूती से कोरोना से भी लड़ाई लड़ी है और विकास के कार्यों को भी रुकने नहीं दिया: PM @narendramodi
गिरी नदी पर बन रही श्री रेणुकाजी बांध परियोजना जब पूरी हो जाएगी तो एक बड़े क्षेत्र को इससे सीधा लाभ होगा।
— PMO India (@PMOIndia) December 27, 2021
इस प्रोजेक्ट से जो भी आय होगी उसका भी एक बड़ा हिस्सा यहीं के विकास पर खर्च होगा: PM @narendramodi
पूरा विश्व भारत की इस बात की प्रशंसा कर रहा है कि हमारा देश किस तरह पर्यावरण को बचाते हुए विकास को गति दे रहा है।
— PMO India (@PMOIndia) December 27, 2021
सोलर पावर से लेकर हाइड्रो पावर तक
पवन ऊर्जा से लेकर ग्रीन हाइड्रोजन तक
देश renewable energy के हर संसाधन को पूरी तरह इस्तेमाल करने के लिए निरंतर काम कर रहा है: PM
भारत ने 2016 में ये लक्ष्य रखा था कि वो साल 2030 तक, अपनी installed electricity capacity का 40 प्रतिशत, non-fossil energy sources से पूरा करेगा।
— PMO India (@PMOIndia) December 27, 2021
आज हर भारतीय को इसका गर्व होगा कि भारत ने अपना ये लक्ष्य, इस साल नवंबर में ही प्राप्त कर लिया है: PM @narendramodi
पहाड़ों को प्लास्टिक की वजह से जो नुकसान हो रहा है, हमारी सरकार उसे लेकर भी सतर्क है।
— PMO India (@PMOIndia) December 27, 2021
सिंगल यूज प्लास्टिक के खिलाफ देशव्यापी अभियान के साथ ही हमारी सरकार, प्लास्टिक Waste मैनेजमेंट पर भी काम कर रही है: PM @narendramodi
हिमाचल को स्वच्छ रखने में, प्लास्टिक और अन्य कचरे से मुक्त रखने में पर्यटकों का भी दायित्व बहुत बड़ा है।
— PMO India (@PMOIndia) December 27, 2021
इधर उधर फैला प्लास्टिक, नदियों में जाता प्लास्टिक, हिमाचल को जो नुकसान पहुंचा रहा है, उसे रोकने के लिए हमें मिलकर प्रयास करना होगा: PM @narendramodi
भारत को आज pharmacy of the world कहा जाता है तो इसके पीछे हिमाचल की बहुत बड़ी ताकत है।
— PMO India (@PMOIndia) December 27, 2021
कोरोना वैश्विक महामारी के दौरान हिमाचल प्रदेश ने ना सिर्फ दूसरे राज्यों, बल्कि दूसरे देशों की भी मदद की है: PM @narendramodi
हिमाचल ने अपनी पूरी वयस्क जनसंख्या को वैक्सीन देने में बाकी सबसे बाजी मार ली।
— PMO India (@PMOIndia) December 27, 2021
यहां जो सरकार में हैं, वो राजनीतिक स्वार्थ में डूबे नहीं बल्कि उन्होंने पूरा ध्यान, हिमाचल के एक-एक नागरिक को वैक्सीन कैसे मिले, इसमें लगाया है: PM @narendramodi
हमने तय किया है कि बेटियों की शादी की उम्र भी वही होनी चाहिए, जिस उम्र में बेटों को शादी की इजाजत मिलती है।
— PMO India (@PMOIndia) December 27, 2021
बेटियों की शादी की उम्र 21 साल होने से, उन्हें पढ़ने के लिए पूरा समय भी मिलेगा और वो अपना करियर भी बना पाएंगी: PM @narendramodi
हमारी सरकार पूरी संवेदनशीलता के साथ, सतर्कता के साथ, आपकी हर आवश्यकता को ध्यान में रखते हुए काम कर रही है।
— PMO India (@PMOIndia) December 27, 2021
अब सरकार ने तय किया है कि 15 से 18 साल के बीच के बच्चों को भी 3 जनवरी, सोमवार से वैक्सीन लगाना शुरू हो जाएगा: PM @narendramodi
60 साल से ऊपर के बुजुर्ग जिन्हें पहले से गंभीर बीमारियां हैं, उन्हें भी डॉक्टरों की सलाह पर प्री-कॉशन डोज का विकल्प दिया गया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 27, 2021
हमारे जो हेल्थ सेक्टर के लोग हैं, फ्रंटलाइन वर्कर हैं, वो पिछले दो साल से कोरोना से लड़ाई में देश की ताकत बने हुए हैं।
— PMO India (@PMOIndia) December 27, 2021
इन्हें भी 10 जनवरी से प्री-कॉशन डोज देने का काम शुरू होगा: PM @narendramodi
हर देश में अलग-अलग विचारधाराएं होती हैं, लेकिन आज हमारे देश के लोग स्पष्ट तौर पर दो विचारधाराओं को देख रहे हैं।
— PMO India (@PMOIndia) December 27, 2021
एक विचारधारा विलंब की है और दूसरी विकास की।
विलंब की विचारधारा वालों ने पहाड़ों पर रहने वाले लोगों की कभी परवाह नहीं की: PM @narendramodi
हमारा कमिटमेंट सिर्फ और सिर्फ विकास के लिए है।
— PMO India (@PMOIndia) December 27, 2021
हमने अटल टनल का काम पूरा करवाया।
हमने चंडीगढ़ से मनाली और शिमला को जोड़ने वाली सड़क का चौड़ीकरण किया: PM @narendramodi
विलंब की विचारधारा वालों ने, हिमाचल के लोगों को दशकों का इंतजार करवाया।
— PMO India (@PMOIndia) December 27, 2021
इसी वजह से अटल टनल के काम में बरसों का विलंब हुआ।
रेणुका जी परियोजना में भी तीन दशकों का विलंब हुआ: PM @narendramodi
यहां के घर-घर में देश की रक्षा करने वाले वीर बेटे-बेटियां हैं।
— PMO India (@PMOIndia) December 27, 2021
हमारी सरकार ने बीते सात वर्षों में देश की सुरक्षा बढ़ाने के लिए जो काम किए हैं, फौजियों, पूर्व फौजियों के लिए जो निर्णय लिए हैं, उसका भी बहुत बड़ा लाभ हिमाचल के लोगों को हुआ है: PM @narendramodi