అభిధమ్మ దినాని కి గుర్తు గా కుశీనగర్ లోని మహాపరినిర్వాణ మందిరం లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భం లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు శ్రీయుతులు జి. కిషన్ రెడ్డి, కిరెన్ రిజిజూ, జ్యోతిరాదిత్య సింధియా, శ్రీ లంక ప్రభుత్వం లో కేబినెట్ మంత్రి శ్రీ నమల్ రాజపక్ష, శ్రీ లంక నుంచి విచ్చేసిన బౌద్ధ ప్రతినిధి వర్గం, ఇంకా మ్యాంమార్, వియత్ నామ్, కంబోడియా, థాయిలాండ్, లావో పిడిఆర్, భూటాన్, దక్షిణ కొరియా, శ్రీ లంక, మంగోలియా, జపాన్, సింగపూర్, నేపాల్ లకు చెందిన రాయబారులు సహా ఇతరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, మంగళప్రదమైన అశ్విన్ పూర్ణిమ సందర్భం గురించి, భగవాన్ బుద్ధుని పవిత్ర స్మృతి చిహ్నాలను గురించి ప్రస్తావించారు. శ్రీ లంక ప్రతినిధి వర్గాని కి ప్రధాన మంత్రి స్వాగతం పలుకుతూ, భారతదేశాని కి, శ్రీ లంక కు మధ్య గల సంబంధాల ను గుర్తు కు తెచ్చారు. సమ్రాట్టు అశోకుని కుమారుడైన మహేంద్ర, కుమార్తె సంఘమిత్ర లు బౌద్ధ ధర్మం తాలూకు సందేశాన్ని శ్రీ లంక కు తీసుకుపోయిన విషయాన్ని ప్రధాన మంత్రి వివరించారు. ఇదే రోజు న ‘అర్హత్ మహిందా’ వెనుదిరిగి వచ్చి బుద్ధుని సందేశాన్ని శ్రీ లంక ఎంతో ఉత్సాహం తో అంగీకరించిందీ తన తండ్రి కి వెల్లడించినట్టు భావిస్తారంటూ ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ఈ సమాచారం బుద్ధుని సందేశం యావత్తు ప్రపంచం కోసం, బుద్ధుని ధమ్మ ప్రబోధం మానవ జాతి అంతటికోసం అనే భావన ను పెంచింది అని ప్రధాన మంత్రి అన్నారు.
భగవాన్ బుద్ధుని సందేశాన్ని వ్యాప్తి చేయడం లో ఇంటర్ నేశనల్ బుద్ధిస్ట్ కన్ఫెడరేశన్ పోషించిన పాత్ర ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, ఇంటర్ నేశననల్ బుద్ధిస్ట్ కాన్ఫెడరేశన్ కు డిజి గా శ్రీ శక్తి సిన్హా అందించిన తోడ్పాటు ను స్మరించుకొన్నారు. శ్రీ శక్తి సిన్హా ఇటీవలే కన్నుమూశారు.
ఈ రోజు న మరొక మంగళప్రదమైనటువంటి సందర్భం కూడాను - అది, భగవాన్ బుద్ధుడు తుషిత స్వర్గం నుంచి తిరిగి భూమి మీదకు విచ్చేసినటువంటి దినం- అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణం గా, అశ్విన్ పూర్ణిమ నాడు మన భిక్షువులు వారి మూడు మాసాల ‘వర్షావాస్’ ను పూర్తి చేసుకొంటారు. ఈ రోజు న ‘వర్షావాస్’ అనంతరం సంఘ్ భిక్షువు లకు ‘చీవర్ దానాన్ని’ ఇచ్చేటటువంటి సౌభాగ్యం నాకు దక్కింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
బుద్ధుడు సార్వజనీనం.. ఎందుకు అంటే మన అంతరంగం లో నుంచి ఆరంభించండి అని బుద్ధుడు చెప్తారు కాబట్టి అని ప్రధాన మంత్రి అన్నారు. బుద్ధుని యొక్క బుద్ధత్వం అనేది సర్వోన్నతమైనటువంటి బాధ్యత తాలూకు భావన అని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచం పర్యావరణ పరిరక్షణ ను గురించి మాట్లాడుతున్నది; జల వాయు పరివర్తన పట్ల తన ఆందోళన ను వ్యక్తం చేస్తోంది. అలాంటప్పుడు, అనేకమైన ప్రశ్నలు తల ఎత్తుతున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. అయితే, మనం బుద్ధుని సందేశాన్ని గనుక అనుసరించిన పక్షం లో ‘ఎవరు చేయాలి’ అనే దానికి బదులు గా ‘ఏమి చేయాలి’ అనేటటువంటి మార్గం తనంతట తాను కనుపించడం మొదలవుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. మానవ జాతి ఆత్మ లో బుద్ధుడు కొలువై ఉంటారు. విభిన్న సంస్కృతుల ను, దేశాల ను జోడిస్తుంటారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఆయన బోధించిన దానిలో నుంచి ఈ కోణాన్ని భారతదేశం తన వృద్ధి యాత్ర లో ఒక భాగం గా చేసుకొంది అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం ఎన్నడూ మహనీయుల జ్ఞానాన్ని, గొప్ప గొప్ప సందేశాల ను లేదా ఆలోచనల ను పరిధులలో బంధించాలి అని విశ్వసించ లేదు. మనకు ఉన్నదానినల్లా యావత్తు మానవ జాతి తోనూ పంచుకోవడం జరిగింది. ఈ కారణం గానే అహింస, కరుణ ల వంటి మానవీయ విలువ లు భారతదేశం యొక్క హృదయం లో ఎంతో స్వాభావికం గా స్థిరపడిపోయాయి’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
బుద్ధుడు నేడు సైతం భారతదేశం రాజ్యాంగాని కి ప్రేరణ గా ఉన్నారు. బుద్ధుని ధమ్మ చక్రం భారతదేశ త్రివర్ణ పతాకం లో నెలవైంది. అది మనలకు గతి ని ప్రసాదిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఈ రోజు కు కూడా ఎవరైనా భారతదేశ పార్లమెంటు భవనాని కి వెళ్ళారంటే అప్పుడు ‘ధర్మ చక్ర ప్రవర్తనాయ’ మంత్రం మీద కు దృష్టి ప్రసరిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
గుజరాత్ లో, ప్రత్యేకించి ప్రధాన మంత్రి జన్మస్థలం వడ్ నగర్ లో, భగవాన్ బుద్ధుని ప్రభావాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, బుద్ధుని ప్రభావం దేశం లోని తూర్పు ప్రాంతాల మాదిరిగానే దేశం లోని పశ్చిమ ప్రాంతాల లోను, దక్షిణ ప్రాంతాల లోను సమపాళ్ళ లో కనుపిస్తుంది అని పేర్కొన్నారు. ‘‘బుద్ధుడు సరిహద్దుల కు, దిశల కు అతీతం అయినటువంటి వ్యక్తి అని గుజరాత్ యొక్క గతం చాటి చెప్తున్నది. బుద్ధుని యొక్క సత్యం మరియు అహింస ల సందేశాని కి గుజరాత్ గడ్డ మీద పుట్టిన అటువంటి మహాత్మ గాంధీ ఆధునిక కాలం లో ఒక పతాక దారి గా నిలచారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
భగవాన్ బుద్ధుడు ప్రబోధించిన ‘అప్ప దీపో భవ’ మాటల ను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. అప్ప దీపో భవ అనే మాటల కు ‘మీకు దీపం గా మారాల్సింది మీరే’ అని భావం. ఎప్పుడైతే ఒక వ్యక్తి స్వయం ప్రకాశాన్ని పొందుతారో, అప్పుడు ప్రపంచాని కి సైతం ఆ వ్యక్తి వెలుగు ను ఇస్తారు అని ప్రధాన మంత్రి అన్నారు. ఇదే భారతదేశం ఆత్మనిర్భరత దిశ లో పయనించడానికి ప్రేరణ అని ఆయన చెప్పారు. ఈ ప్రేరణే ప్రపంచం లో ప్రతి దేశం యొక్క ప్రగతి లో పాలుపంచుకోవడానికి మనకు బలాన్ని ఇచ్చేది అని కూడా ఆయన అన్నారు. భగవాన్ బుద్ధుని ప్రబోధాల ను ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, ఇంకా సబ్ కా ప్రయాస్’ మంత్రం ద్వారా భారతదేశం ముందుకు తీసుకుపోతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.
इस समाचार ने ये विश्वास बढ़ाया था, कि बुद्ध का संदेश पूरे विश्व के लिए है, बुद्ध का धम्म मानवता के लिए है: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 20, 2021
हम सभी जानते हैं कि श्रीलंका में बौद्ध धर्म का संदेश, सबसे पहले भारत से सम्राट अशोक के पुत्र महेन्द्र और पुत्री संघमित्रा ले कर गए थे।
— PMO India (@PMOIndia) October 20, 2021
माना जाता है कि आज के ही दिन ‘अर्हत महिंदा’ ने वापस आकर अपने पिता को बताया था कि श्रीलंका ने बुद्ध का संदेश कितनी ऊर्जा से अंगीकार किया है: PM
आज एक और महत्वपूर्ण अवसर है- भगवान बुद्ध के तुषिता स्वर्ग से वापस धरती पर आने का!
— PMO India (@PMOIndia) October 20, 2021
इसीलिए, आश्विन पूर्णिमा को आज हमारे भिक्षुगण अपने तीन महीने का ‘वर्षावास’ भी पूरा करते हैं।
आज मुझे भी वर्षावास के उपरांत संघ भिक्षुओं को ‘चीवर दान’ का सौभाग्य मिला है: PM @narendramodi
बुद्ध इसीलिए ही वैश्विक हैं क्योंकि बुद्ध अपने भीतर से शुरुआत करने के लिए कहते हैं।
— PMO India (@PMOIndia) October 20, 2021
भगवान बुद्ध का बुद्धत्व है- sense of ultimate responsibility: PM @narendramodi
आज जब दुनिया पर्यावरण संरक्षण की बात करती है, क्लाइमेट चेंज की चिंता जाहिर करती है, तो उसके साथ अनेक सवाल उठ खड़े होते हैं।
— PMO India (@PMOIndia) October 20, 2021
लेकिन, अगर हम बुद्ध के सन्देश को अपना लेते हैं तो ‘किसको करना है’, इसकी जगह ‘क्या करना है’, इसका मार्ग अपने आप दिखने लगता है: PM @narendramodi
बुद्ध आज भी भारत के संविधान की प्रेरणा हैं, बुद्ध का धम्म-चक्र भारत के तिरंगे पर विराजमान होकर हमें गति दे रहा है।
— PMO India (@PMOIndia) October 20, 2021
आज भी भारत की संसद में कोई जाता है तो इस मंत्र पर नजर जरूर पड़ती है- ‘धर्म चक्र प्रवर्तनाय’: PM @narendramodi
भगवान बुद्ध ने कहा था- “अप्प दीपो भव”।
— PMO India (@PMOIndia) October 20, 2021
यानी, अपने दीपक स्वयं बनो।
जब व्यक्ति स्वयं प्रकाशित होता है तभी वह संसार को भी प्रकाश देता है।
यही भारत के लिए आत्मनिर्भर बनने की प्रेरणा है। यही वो प्रेरणा है जो हमें दुनिया के हर देश की प्रगति में सहभागी बनने की ताकत देती है: PM