చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’ విభాగంలో రజతం సాధించిన సౌండ్ర్య ప్రధాన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ పురుషుల ‘చదరంగం బి-1’ (వ్యక్తిగత) విభాగంలో రజత పతకం సాధించిన సౌండ్ర్య ప్రధాన్‌కు నా అభినందనలు. అతని విజయంపై భారతీయులంతా సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Congratulations to Soundrya Pradhan on winning the Silver Medal in Men's Chess B1 Category (Individual) at the Asian Para Games. India is elated! pic.twitter.com/vLxXO7SS0b
— Narendra Modi (@narendramodi) October 28, 2023