We are in favour of making ties with Spain even more productive in the coming years: PM
The discussions with President Mariano Rajoy will lead to enhancement of India-Spain bilateral ties: PM Modi
Vision of "New India" will be enhanced through the "New Momentum" in relations between India and Spain: PM Modi
Seven key agreements exchanged between India and Spain, covering subjects such as energy, security and civil aviation

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్పెయిన్ ప్రభుత్వ ప్రెసిడెంట్ శ్రీ మారియానొ రాజోయ్ తో మాడ్రిడ్ లో ఈ రోజు చర్చలు జరిపారు.

ఉభయ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంలో నేటి చర్చలు ప్రముఖ పాత్ర వహిస్తాయని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఒక దేశంతో మరొక దేశం పరస్పరం ఆధారపడ్డ, అనుసంధానమై ఉన్న ప్రస్తుత ప్రపంచ వ్యవస్థలో స్పెయిన్, భారతదేశం వాటి వాటి ప్రయోజనాలతో పాటు ప్రపంచ ప్రయోజనాలను కూడా దృష్టిలో ఉంచుకొని కృషి చేయవలసి ఉందని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రెసిడెంట్ శ్రీ రాజోయ్ దార్శనికత గల నాయకుడు అని ఆయన అభివర్ణించారు.

ఉగ్రవాద భూతాన్ని అటు భారతదేశం, ఇటు స్పెయిన్ ఎదుర్కొంటున్నాయని, ఆ భూతంతో పోరాటం జరపడంపై ఈ రెండు దేశాలు దృష్టిని కేంద్రీకరిస్తాయని ప్రధాన మంత్రి చెప్పారు.

భారతదేశం, స్పెయిన్ ఆర్థిక సంస్కరణలను చురుకుగా అమలు చేస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. అవస్థాపన, రైల్వేలు మరియు స్మార్ట్ సిటీస్ రంగాలలో సహకరించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.

భారతదేశానికి, స్పెయిన్ కు మధ్య నెలకొన్న సంబంధాలకు సరికొత్త వేగాన్ని అందించడం ద్వారా ‘‘న్యూ ఇండియా’’ విజన్ కు సరికొత్త కోణాన్ని జోడించడం జరుగుతుందని ప్రధాన మంత్రి చెప్పారు.

రెండు దేశాల మధ్య శక్తి, భద్రత మరియు పౌర విమానయానం వంటి రంగాలతో సహా మొత్తం ఏడు ఒప్పందాలు కుదిరాయి.

ఆ తరువాత ప్రధాన మంత్రి శ్రీ మోదీ, స్పెయిన్ కు చెందిన సిఇఒ లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో స్పెయిన్ పెట్టుబడులు మరింతగా వృద్ధి చెందడానికి విస్తృత‌ అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. మరీ ముఖ్యంగా అవస్థాపన, నవీకరణ యోగ్య శక్తి, ఫూడ్ ప్రాసెసింగ్, ఆటో, రసాయనాలు మరియు జౌళి తదితర రంగాలను గురించి ఆయన ప్రస్తావించారు. స్మార్ట్ సిటీస్ కార్యక్రమంలో పాలుపంచుకోవలసిందిగా స్పెయిన్ సంస్థలను ఆయన ఆహ్వానించారు. వస్తువులు, సేవల పన్ను (జిఎస్ టి) సహా భారతదేశం అమలుచేస్తున్న ఆర్థిక సంస్కరణలను గురించి ఆయన విపులంగా వివరించారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘‘డిజిటల్ ఇండియా’’ ఇంకా 'స్టార్ట్ అప్ ఇండియా' వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలో అయస్కాంతాల లాగా పని చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి తన పర్యటనలో భాగంగా స్పెయిన్ రాజు ఆరవ ఫెలిపె ను కూడా కలుసుకొన్నారు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Space Sector: A Transformational Year Ahead in 2025

Media Coverage

India’s Space Sector: A Transformational Year Ahead in 2025
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 డిసెంబర్ 2024
December 24, 2024

Citizens appreciate PM Modi’s Vision of Transforming India