కర్నాటక లోని కలబురగి లో మరియు తమిళ నాడు లోని కాంచీపురం లో ప్రధాన అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు.
ప్రధాన మంత్రి కర్నాటక లోని కలబురగి లో ఒక ఫలకాన్ని ఆవిష్కరించడం ద్వారా బెంగళూరు కు చెందిన ఇఎస్ఐసి ఆసుపత్రి మరియు వైద్య కళాశాల ను దేశ ప్రజల కు అంకితం చేశారు. అలాగే, ఆయన ఒక మీట ను నొక్కడం ద్వారా హుబ్బళ్ళి లో కెఐఎమ్ఎస్ కు చెందిన సూపర్ స్పెశాలిటీ బ్లాకు ను, బెంగళూరు లో ఇన్‌కమ్ టాక్స్ అపెలిట్ ట్రైబ్యునల్ భవనాన్ని మరియు బెంగళూరు విశ్వవిద్యాలయం లో ఈశాన్య ప్రాంతాల కు చెందిన విద్యార్థుల కోసం ఓ మహిళా వసతి గృహాన్ని ప్రారంభించారు. ప్రధాన మంత్రి మరొక ఫలకాన్ని ఆవిష్కరించడం ద్వారా బిపిసిఎల్ డిపో స్థలాన్ని రాయచూర్ నుండి కలబురగి కి మార్చేందుకు ఉద్దేశించిన పనుల కు శంకుస్థాపన చేశారు.
ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన: ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి భేటీ అయ్యారు.
తమిళ నాడు లోని కాంచీపురం లో వివిధ జాతీయ రహదారి పథకాల ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. వాటిలో ఎన్‌హెచ్-45సి లో భాగమైన విక్రవండి నుండి తంజావూరు కు నాలుగు దోవల రహదారి నిర్మాణాని కి, అలాగే ఎన్‌హెచ్-4 లో భాగమైన కారైపేట్టై-వాలాజాపేట్ సెక్షను ను ఆరు దోవ లు కలిగింది గా విస్తరించే పని కి జరిగిన శంకు స్థాపన లు సైతం ఉన్నాయి. 5 ఎంఎంటిపిఎ సామర్థ్యం తో కూడిన ఎణ్ణూరు లోని ఎల్ఎన్‌జి టర్మినల్ ను ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. ఈ ఎల్ఎన్‌జి టర్మినల్ తమిళ నాడు మరియు చుట్టుపక్కల రాష్ట్రాల ఎల్ఎన్‌జి డిమాండు ను తీర్చడం లో సహాయకారి కానుంది. ప్రధాన మంత్రి విద్యుదీకరణ జరిగినటువంటి ఈరోడ్-కరూర్-తిరుచ్చిరాపల్లి మరియు సేలమ్-కరూర్-దిండుక్కల్ రైలు మార్గాల ను కూడా దేశ ప్రజల కు అంకితం చేశారు.
ప్రధాన మంత్రి వీడియో లింకు ద్వారా చెన్నై లో ని డాక్టర్ ఎం.జి.ఆర్. జానకి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ ఫర్ విమెన్ లో గల డాక్టర్ ఎం.జి. రామచంద్రన్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు.
ఈ రోజు న ప్రారంభించినటువంటి అభివృద్ధి పనులు కర్నాటక మరియు తమిళ నాడు రాష్ట్రాల ప్రజల కు అనేక విధాలు గా లబ్ధి ని చేకూర్చనున్నాయి.