ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని పుణె లో గల ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేశన్ ఎండ్ రిసర్చ్ (ఐఐఎస్ఇఆర్)కు చెందిన శాస్త్రవేత్తల తో ఈ రోజు న సంభాషించారు.
ఐఐఎస్ఇఆర్ శాస్త్రవేత్త లు వివిధ అంశాల పై వారి యొక్క నివేదికల ను ప్రధాన మంత్రి ఎదుట ఆవిష్కరించారు. పరిశుభ్రమైన శక్తి వినియోగాని కి గాను ఉద్దేశించిన నూతన సామగ్రి మరియు పరికరాలు మొదలుకొని వ్యవసాయ సంబంధిత బయోటెక్నాలజీ నుండి నేచురల్ రిసోర్స్ మ్యాపింగ్ వరకు ఆయా అంశాల లో ఉన్నాయి. ఈ నివేదిక లు మేథమేటికల్ ఫినాన్స్ రిసర్చ్, క్లైమేట్ స్టడీస్, మలెక్యులర్ బాయోలజి మరియు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ రంగం లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల ను కూడా కళ్ళ కు కట్టాయి.
శాస్త్రవేత్త ల నివేదిక లు సమాచార భరితం గా ఉన్నాయంటూ ప్రధాన మంత్రి అభినందించారు. భారతదేశ నిర్దుష్ట ఆవశ్యకతల ను తీర్చేటటువంటి మరియు తక్కువ వ్యయం తో కూడినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచాలని, తద్వారా భారతదేశం వృద్ధి ని శీఘ్ర తరం చేయడం లో తోడ్పడాలని వారి ని ఆయన కోరారు.
అంత క్రితం, ఐఐఎస్ఇఆర్ ప్రాంగణాన్ని ప్రధాన మంత్రి కలియదిరిగారు. అక్కడి పరిశోధకుల తో మరియు విద్యార్థుల తో ఆయన ముచ్చటించారు. ఆయన సి-డిఎసి నియోగించిన అత్యధునాతన సూపర్ కంప్యూటర్ పరం బ్రహ్మ ను కూడా తిలకించారు. దీని గరిష్ఠ కంప్యూటింగ్ పవర్ 797 టెరాఫ్లాప్స్.
అనేది భారతదేశం లో విజ్ఞాన శాస్త్రం మరియు సంబంధిత పరిశోధన సంస్థ ల ప్రతిష్టాత్మక బృందమే ద ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేశన్ ఎండ్ రిసర్చ్ (ఐఐఎస్ఇఆర్ ఎస్).
పుణె లో డిజిపి ల సమావేశాని కి హాజరు కావడం కోసం రెండు రోజుల యాత్ర కు గాను ప్రధాన మంత్రి పుణె కు తరలివచ్చారు.