థాయ్‌లాండ్ ప్రధాని గౌరవ పేటోంగ్‌టర్న్ చినావత్రా బ్యాంకాక్‌లోని లిటిల్ ఇండియా పహురత్‌లో ఏర్పాటు చేసిన ‘అమేజింగ్ థాయ్‌లాండ్ దీపావళి ఫెస్టివల్ 2024’ను ప్రారంభించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమేజింగ్ థాయ్‌లాండ్ దీపావళి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇది భారత్- థాయ్‌లాండ్ దేశాల మధ్య సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని అన్నారు.
ప్రధాన మంత్రి 'ఎక్స్' మాధ్యమంలో ఇలా పోస్ట్ చేశారు:
'ప్రధాని పేటోంగ్‌టర్న్ చినావత్రా ప్రదర్శించిన ఔదార్యానికి చాలా సంతోషంగా ఉంది. అమేజింగ్ థాయ్‌లాండ్ దీపావళి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు. భారత్, థాయ్‌లాండ్‌ల మధ్య సాంస్కృతిక బంధం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నాను.
@ingshin
Delighted by PM Paetongtarn Shinawatra’s gesture. My best wishes for the Amazing Thailand Diwali Festival. May it deepen the cultural bonds between India and Thailand. @ingshin https://t.co/7TDRP5eKKn
— Narendra Modi (@narendramodi) October 30, 2024