నాయకత్వం అంశం లో స్వామి వివేకానంద ఇచ్చిన ఉపదేశాన్ని అనుసరించండంటూ దేశ యువజనుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించారు. వ్యక్తుల ను, సంస్థల ను తీర్చిదిద్దడంలో మాన్య సాధువు అందించిన తోడ్పాటు ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. మంగళవారం నిర్వహించిన రెండో ‘జాతీయ యువజన పార్లమెంట్ ఉత్సవం’ తాలూకు ముగింపు సభ లో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, వ్యక్తి వికాసం మొదలుకొని సంస్థ నిర్మాణం వరకు సాగే ఒక సత్ప్రవర్తన భరిత వలయానికి శ్రీకారాన్ని చుట్టడం లో స్వామీ జీ అందించిన తోడ్పాటు ను గురించి ప్రస్తావించారు.
స్వామి వివేకానంద ప్రభావ క్షేత్రం లోకి అడుగుపెట్టిన వ్యక్తులు సంస్థల ను ఏర్పాటు చేశారని, ఆ సంస్థలు వాటి వంతు గా కొత్త సంస్థలను నిర్మించేవారిని తయారు చేశాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఇది ఒక సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగత వికాసం, సంస్థ నిర్మాణం అనే ప్రక్రియ లు ఒక క్రమబద్ధమైన రీతి న రూపుదిద్దుకొనేందుకు నాంది ని పలికింది అని ఆయన చెప్పారు. నవ పారిశ్రామికత్వం తాలూకు ఉదాహరణ ను ప్రధాన మంత్రి వివరిస్తూ ఇది భారతదేశానికి ఒక భారీ బలం గా ఉందన్నారు. ఒక వ్యక్తి ఒక గొప్ప కంపెనీ ని నిర్మిస్తారు; మరి ఆ కంపెనీ తాలూకు ఇకోసిస్టమ్ తెలివైన అనేకమంది వ్యక్తుల ఎదుగుదల కు తోడ్పడుతుంది. వారు, వారి హయాము లో, కొత్త కొత్త కంపెనీల ను ఏర్పాటుచేస్తారు అని ఆయన చెప్పారు.
ఇటీవల ప్రవేశపెట్టిన జాతీయ విద్య విధానం అందిస్తున్న సరళతరమైనటువంటి, సరికొత్తదైనటువంటి అభ్యాస స్వరూపం తాలూకు లబ్ధి ని పొందండంటూ యువతీయువకులను ఆయన కోరారు. ఈ విధానం యువత ఆకాంక్షలకు, నైపుణ్యాలకు, అవగాహన కు, ఎంపిక కు ప్రాథమ్యాన్ని కట్టబెట్టడం ద్వారా ఉత్తములైన వ్యక్తులను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకొందని ఆయన వివరించారు. దేశ యువతీ యువకుల కోసం ఉత్తమ విద్యావకాశాలను, నవ పారిశ్రామికత్వం అవకాశాలను అందుబాటు లోకి తీసుకు రావడం జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ‘‘మేం దేశం లో ఒక విధమైన ఇకోసిస్టమ్ ను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాం. ఆ తరహా ఇకో సిస్టమ్ గనక లోపించినట్లయితే, అది యువత విదేశీ తీరాలకేసి తరచుగా దృష్టి సారించేటట్లు చేస్తుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
ధీమా కలిగిన, నిర్భయులైన, సాహసికులైన, పరిశుద్ధ హృదయం కలిగిన యువతీ యువకులే దేశానికి పునాది అని గుర్తించింది స్వామి వివేకానంద అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. యువత కోసం స్వామి వివేకానంద బోధించిన మంత్రాలను గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. శారీరక దృఢత్వానికి ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు’ అవసరం అని చెప్తే, ప్రభుత్వం ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ను, యోగా ను ప్రోత్సహిస్తూ క్రీడల కై ఆధునిక సౌకర్యాలను సమకూర్చుతోందని తెలిపారు. వ్యక్తిత్వ వికాసం కోసం, ‘మిమ్మల్ని మీరు నమ్మండి’ అనే సలహా ను ఇవ్వడం జరిగిందని; నాయకత్వం, బృంద కృషి ల పరం గా ‘అందరి పట్ల నమ్మకం ఉంచండి’ అనే మాటలను స్వామీ జీ ఉపదేశించారని ప్రధాన మంత్రి అన్నారు.