ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మలేసియా ప్రధాని, మాన్య శ్రీ తున్ డాక్టర్ మహాతిర్ మొహమ్మద్ తో టెలిఫోన్ లో మాట్లాడారు. మలేసియా ప్రధాని గా శ్రీ తున్ డాక్టర్ మహాతిర్ మొహమ్మద్ పదవీబాధ్యతలను స్వీకరించడం పట్ల ఆయనను శ్రీ మోదీ ఈ సందర్భంగా అభినందించారు.
స్నేహశీలురైన మలేసియా ప్రజల పురోగతికి మరియు సమృద్ధికి ఇవే నా శుభాకాంక్షలు అని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పేర్కొన్నారు. భారతదేశానికి మలేసియా తో ఉన్నటువంటి సన్నిహితమైన మరియు పరస్పర లాభకరమైన సంబంధాలు ఉమ్మడి విలువలు, ఉమ్మడి ప్రయోజనాలకు తోడు ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న చైతన్యవంతమైన సంబంధాలు అనే బలమైన పునాది పైన నిర్మితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. భారతదేశం మరియు మలేసియా ల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని శ్రీ మహాతిర్ మొహమ్మద్ తో కలసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు.