చిత్తోడ్ ఘఢ్ పూర్వ ఎంపీ శ్రీ మహేంద్ర సింహ్ మేవాడ్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం తెలిపారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘సామాజిక జీవనంలోనూ, రాజకీయ జీవనంలోనూ అమూల్యమైన తోడ్పాటును అందించిన చిత్తోడ్ ఘఢ్ పూర్వ ఎంపీ, మేవాడ్ రాజవంశంలో సభ్యుడూ అయిన శ్రీ మహేంద్ర సింహ్ మేవాడ్ జీ కన్నుమూశారన్న సంగతి తెలిసి అత్యంత దుఃఖానికి లోనయ్యాను. రాజస్థాన్ వారసత్వాన్ని పరిరక్షించడానికి ఆయన తన జీవన పర్యంతం కృషి చేశారు. ప్రజలకు ఆయన పూర్తి అంకిత భావంతో సేవలను అందించారు. ఆయన చేపట్టిన సమాజ సంక్షేమ కార్యాలు ఎల్లప్పటికీ ప్రేరణను అందిస్తూనే ఉంటాయి. ఆయన ఆత్మీయులకు, ఆయనను అభిమానించే వారికి ఈ శోక ఘడియలో నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓమ్ శాంతి.’’
सामाजिक और राजनीतिक जीवन में अमूल्य योगदान देने वाले चित्तौड़गढ़ के पूर्व सांसद और मेवाड़ राजघराने के सदस्य महेंद्र सिंह मेवाड़ जी के निधन से अत्यंत दुख हुआ है। वे जीवनपर्यंत राजस्थान की विरासत को सहेजने और संवारने में जुटे रहे। उन्होंने लोगों की सेवा के लिए पूरे समर्पित भाव से…
— Narendra Modi (@narendramodi) November 10, 2024