జపాన్ లో హేగీబిస్ తుఫాను కారణం గా ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘జపాన్ లో హెగీబిస్ తుఫాను వల్ల ప్రాణ నష్టం సంభవించినందుకు భారతీయులు అందరి పక్షాన నేను సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ ప్రాకృతిక విపత్తు కలిగించిన విధ్వంసం మరియు నష్టాల బారి నుండి శీఘ్రం గా బయటపడాలని నేను ఆకాంక్షిస్తున్నాను. జపాన్ ప్రజలు ఆపదల కు ఎదురొడ్డి నిలబడతారని , విపత్తుల కు వారు సర్వ సన్నద్ధంగా ఉంటారని, తుఫాను అనంతర పరిస్థితుల లో త్వరిత గతి న అవసరమైన చర్యల ను నా మిత్రుడు శింజో ఆబే నాయకత్వం ప్రభావవంతం గా చేపడుతుందని నేను నమ్ముతున్నాను. ఇదివరకు ప్రాకృతిక విపత్తుల వేళల్లో జపాన్ సన్నద్ధత బహుళ అభినందన లకు నోచుకొన్నటువంటిది. ఈ విపత్తు కాలం లో జపాన్ కు భారతదేశం తన సంఘీభావాన్ని వెల్లడి చేస్తోంది. ముందుగా నిర్ణయించిన మేరకు ప్రస్తుతం జపాన్ ను సందర్శిస్తున్నటువంటి భారతీయ నౌకాదళం సిబ్బంది వారి సత్వర సహాయాన్ని సహర్షం గా అందిస్తారు’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
インド国民を代表して、大型台風ハギビス(台風19号)の犠牲となった方々にお悔やみを申し上げます。この自然災害による損害や破壊からの早期の回復を願っております。
— Narendra Modi (@narendramodi) October 13, 2019
日本の皆さんの災害に対する備えと困難に打ち勝つ強さ、そして私の友人である安倍首相のリーダーシップにより、日本が災害の影響から迅速に回復することを確信しています。日本の自然災害に対する備えは高く評価されています。
— Narendra Modi (@narendramodi) October 13, 2019
インドはこの困難な時に日本と共にあります。現在日本に駐留中のインド海軍も、必要な支援を提供する用意ができています
— Narendra Modi (@narendramodi) October 13, 2019
I offer condolences on behalf of all Indians on the loss of life caused by super-typhoon #Hagibis in Japan. I wish early recovery from the damage and devastation caused by this natural calamity.
— Narendra Modi (@narendramodi) October 13, 2019
I am sure that the preparedness and resilience of the Japanese people and the leadership of my friend @AbeShinzo would be able to address the aftermath effectively and quickly. Japan’s preparedness against natural disasters is well appreciated.
— Narendra Modi (@narendramodi) October 13, 2019
India stands in solidarity with Japan at this difficult hour. Personnel of the Indian Navy, in Japan on a scheduled visit, will be happy to assist immediately.
— Narendra Modi (@narendramodi) October 13, 2019