ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో కలిసి బిజినెస్ రౌండ్ టేబుల్ కు సహాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేపట్టిన స్థూల సంస్కరణలు, దేశంలో పెరుగుతున్న స్టార్టప్ లు, యునికార్న్ ల గురించి వివరించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన వ్యాపారవేత్తలను ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఉభయ దేశాల ప్రభుత్వాల ఉన్నత స్థాయి ప్రతినిధులు, కార్పొరేట్ కంపెనీల సిఇఓలు పాల్గొన్నారు. వాతావరణ సహకారం, సరఫరా వ్యవస్థలు; పరిశోధన, అభివృద్ధి సహా భిన్న అంశాలపై వారు చర్చించారు.
ఈ బిజినెస్ రౌండప్ లో ఈ దిగువ పేర్కొన్న వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.
భారత ప్రతినిధివర్గం సభ్యులు...
- సంజీవ్ బజాజ్ (భారత ప్రతినిధి వర్గం నాయకుడు), ఎన్నికైన ప్రెసిడెంట్, సిఐఐ; చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, బజాజ్ ఫిన్ సర్వ్
- బాబా ఎన్ కల్యాణి; చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్; భారత్ ఫోర్జ్
- సికె బిర్లా, మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ; సికె బిర్లా గ్రూప్
- పునీత్ ఛత్వాల్; మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ; ఇండియన్ హోటల్స్ కంపెనీ
- సలీల్ సింఘాల్, ఛైర్మన్ ఎమిరిటస్, పిఐ ఇండస్ర్టీస్
- సుమంత్ సిన్హా; మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ; రెన్యూ పవర్; ప్రెసిడెంట్, అసోచాం
- దినేష్ ఖారా, చైర్మన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- సిపి గుర్నాని, మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓ; టెక్ మహీంద్రా లిమిటెడ్
- దీపక్ బాగ్లా; చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్; ఇన్వెస్ట్ ఇండియా
జర్మనీ ప్రతినిధివర్గం సభ్యులు
- రోనాల్డ్ బుచ్, జర్మన్ ప్రతినిధివర్గం నాయకుడు; ప్రెసిడెంట్, సిఇఓ, సీమెన్స్; చైర్మన్, జర్మన్ వ్యాపార సామ్రాజ్యం ఆసియా పసిఫిక్ కమిటీ
- మార్టిన్ బ్రూడర్ ముల్లర్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్; బిఏఎస్ఎఫ్
- హెర్బర్ట్ డీస్, బోర్డ్ ఆఫ్ మేనేజ్ మెంట్ చైర్మన్, ఫోక్స్ వేగన్
- స్టెఫాన్ హర్తుంగ్, బోర్డ్ ఆఫ్ మేనేజ్ మెంట్ చైర్మన్, బాష్
- మరికా లులే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్; జిఎఫ్ టి టెక్నాలజీస్
- క్లాస్ రోసెన్ ఫెల్డ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, షేఫ్లర్
- క్రిస్టియన్ సెవింగ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, డాయిష్ బ్యాంక్
- రాల్ఫ్ వింటర్ గెర్స్ట్, మేనేజింగ్ బోర్డు చైర్మన్, గీసికి + డివ్రియెంట్
- జర్గెన్ జెష్క్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎనర్కాన్