శకటాల కళాకారులు, ఆదివాసీ అతిథులు, ఎన్‌సిసి కేడెట్ లు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటియర్ లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు లోక్ కళ్యాణ్ మార్గ్ లోని తన నివాసం లోకి స్వాగతం పలికారు.
గణతంత్ర దినోత్సవ పరేడ్ లోను, సంబంధిత కార్యక్రమాల లోను పాలుపంచుకొంటున్నందుకు గాను కళాకారుల కు మరియు ప్రతినిధుల ను ఆయన అభినందిస్తూ, ఇది వారి జీవితాల లో ఒక గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. యావత్తు దేశం వారి నుండి ప్రేరణ ను పొందుతుందని కూడా ఆయన అన్నారు.
నిత్య జీవితం లో క్రమశిక్షణ కు ఉన్నటువంటి ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వివరించారు. క్రమశిక్షణ అనేది ఎన్‌సిసి లో ఒక అభిన్న భాగం అని ఆయన పేర్కొన్నారు. పౌరులు వారి కి ఉన్నటువంటి పౌర విధుల పట్ల అన్ని కాలాల్లోను సచేతనం గా ఉండాలని ఆయన చెప్పారు. దీని కి ప్రజల ఆకాంక్షలు జత పడటం భారతదేశాన్ని మరిన్ని శిఖరాల కు తీసుకు పోగలదన్నారు.
ఆహ్వానితుల లో కొందరు ఈ సందర్భం గా ప్రదర్శించినంటువంటి సాంస్కృతిక కళా రూపాల ను ప్రధాన మంత్రి వీక్షించారు.