విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, న్యూ ఢిల్లీ లో బహిరంగంగా మూత్ర విసర్జన వద్దంటూ ఇద్దరిని ఆపినందుకు అమానుష హత్యకు గురైన శ్రీ రవీంద్ర కుమార్ అనే ఒక ఇ-రిక్షా డ్రైవర్ కుటుంబానికి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఒక లక్ష రూపాయలను మంజూరు చేశారు. ఈ హత్యాఘటనను ప్రధాన మంత్రి ఖండించారు. ఇటువంటి అమానుష చేష్టకు ఒడిగట్టిన దోషులను పట్టుకొని శిక్షించండంటూ అధికారులను ప్రధాన మంత్రి ఆదేశించారు.
అంతక్రితం, కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు న్యూ ఢిల్లీ లోని జిటిబి నగర్ లో ఉన్న ఇ-రిక్షా డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ హత్యాఘటన ఖండించదగ్గదంటూ, తన జీతంలో నుండి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించి, ఆ సొమ్ముకు చెక్కు రాసి ఇ-రిక్షా డ్రైవర్ కుటుంబానికి శ్రీ వెంకయ్య నాయుడు అందజేశారు. దోషులను శిక్షించితీరాలని కేంద్ర మంత్రి అన్నారు.
.