PM announces Rs. 1 lakh relief from PMNRF to the next kin of e-rickshaw driver beaten to death in Delhi

విదేశీ పర్యటనలో ఉన్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, న్యూ ఢిల్లీ లో బహిరంగంగా మూత్ర విసర్జన వద్దంటూ ఇద్దరిని ఆపినందుకు అమానుష హత్యకు గురైన శ్రీ రవీంద్ర కుమార్ అనే ఒక ఇ-రిక్షా డ్రైవర్ కుటుంబానికి ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుండి ఒక లక్ష రూపాయలను మంజూరు చేశారు. ఈ హత్యాఘటనను ప్రధాన మంత్రి ఖండించారు. ఇటువంటి అమానుష చేష్టకు ఒడిగట్టిన దోషులను పట్టుకొని శిక్షించండంటూ అధికారులను ప్రధాన మంత్రి ఆదేశించారు.

అంతక్రితం, కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలలో పేదరికం నిర్మూలన, గృహ‌ నిర్మాణం మరియు సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు న్యూ ఢిల్లీ లోని జిటిబి నగర్ లో ఉన్న ఇ-రిక్షా డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ హత్యాఘటన ఖండించదగ్గదంటూ, తన జీతంలో నుండి 50 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించి, ఆ సొమ్ముకు చెక్కు రాసి ఇ-రిక్షా డ్రైవర్ కుటుంబానికి శ్రీ వెంకయ్య నాయుడు అందజేశారు. దోషులను శిక్షించితీరాలని కేంద్ర మంత్రి అన్నారు.

.