జోర్డాన్ శత వార్షికోత్సవం సందర్భంగా జోర్డాన్ ప్రజలకు, రాజు అబ్దుల్లా -2కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
వీడియో సందేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లా -2కు, జోర్డాన్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జోర్డాన్ రాజు దూరదృష్టి గల నాయకత్వంతో జర్డాన్ సుస్థిర, సమగ్ర ప్రగతిసాధించిందని, ఆర్థిక,సామాజిక, సాంస్కృతిక రంగాలలో గణనీయమైన ప్రగతి సాధించిందని ప్రశంసించారు. పశ్చిమాసియాలో శాంతిని పెంపొందించడంలో రాజు అబ్దుల్లా -2 కీలక పాత్రను ప్రధానమంత్రి ఈసందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. జోర్డాన్ ఇవాళ బలమైన గొంతుకగా అవతరించిందని,ప్రపంచంలోని ఒక ప్రముఖ ప్రాంతంలో మితవాద భావాలకు అంతర్జాతీయ గుర్తుగా జోర్డాన్ ఎదిగిందన్నారు.
ఇండియా జోర్డాన్ ల మధ్యగల లోతైన సంబంధాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, 2018లో జోర్డాన్ రాజు అబ్దుల్లా -2 భారతదేశాన్ని సందర్శించిన చరిత్రాత్మక పర్యటనను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంలో రాజు అబ్దుల్లా -22004 నాటి అమ్మాన్ సందేశమైన శాంతి, ఐక్యత, మానవాళిపట్ల పరస్పర గౌరవం, ఓర్పును ఆయన పునరుద్ఘాటించారు.
శాంతి, సుసంపన్నతకు మితవాద భావాలు, శాంతియుత సహజీవనం అవసరమన్న అభిప్రాయంలో ఇండియా జోర్డాన్‌లు ఒక్కటే విశ్వాసంతో ఉన్నాయని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.ఉభయ పక్షాలూ సమస్త మానవాళి అద్భుత భవిష్యత్‌కోసం సాగించే కృషిలో ఉభయ పక్షాలూ కలిసినడుస్తాయని ఆయన నొక్కి చెప్పారు.