కుశీనగర్ లో రాజకీయ మెడికల్ కాలేజి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆయన కుశీనగర్ లో వివిధ అభివృద్ధి పథకాల ను కూడా ప్రారంభించారు, అలాగే మరికొన్ని అభివృద్ధి పథకాల కు పునాదిరాళ్ల ను సైతం వేశారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కుశీనగర్ కు వైద్య కళాశాల వచ్చిందా అంటే గనక డాక్టర్ కావాలనే స్థానికుల ఆకాంక్షలతో పాటు నాణ్యమైన చికిత్స సంబంధి మౌలిక సదుపాయాలకు నోచుకోవాలనే ఆకాంక్ష లు కూడా నెరవేరుతాయన్నారు. సాంకేతిక విద్య ను ఏ వ్యక్తి అయినా వారి మాతృభాష లో అభ్యసించే అవకాశం జాతీయ విద్య విధానం ద్వారా వాస్తవ రూపం దాల్చుతోంది అని ఆయన అన్నారు. ఇది కుశీనగర్ లోని స్థానిక యువతీ యువకుల కు వారి కలల ను పండించుకోవడానికి వీలు ను కల్పిస్తుంది అని ప్రధాన మంత్రి చెప్పారు. ఎప్పుడైతే మౌలిక సదుపాయాలు లభ్యం అవుతాయో, అప్పుడు పెద్ద పెద్ద కలల ను కనడానికి ధైర్యం తో పాటు ఆ కలల ను నెరవేర్చుకొనేందుకు ఉత్సాహం కూడా జనిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆశ్రయం అంటూ లేనటువంటి ఒక వ్యక్తి కి, గుడిసె లో నివసిస్తూ ఉన్న వ్యక్తి కి, ఒక పక్కా ఇల్లు దక్కితే, మరి ఆ ఇంటి లో ఒక టాయిలెట్, విద్యుత్తు కనెక్శన్, గ్యాస్ కనెక్శన్, నల్లా నీరు.. ఇవి అన్నీ సమకూరాయి అంటే, ఆ పేద వ్యక్తి లో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. రాష్ట్రం లో ‘రెండు ఇంజన్ల’ ప్రభుత్వం స్థితి ని రెండింతల బలం తో మెరుగుపరుస్తోందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఇదివరకటి ప్రభుత్వాలు పురోగతి ని గురించి, వారి గౌరవాన్ని గురించి పట్టించుకోలేదని, వంశవాద రాజకీయాల దుష్ఫలితాలు అనేక మంచి చర్యల తాలూకు ప్రయోజనాలు నిరుపేదల కు చేరకుండా చేశాయంటూ ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు.
చేసే కార్యాల కు దయ ను, పరిపూర్ణమైనటువంటి కరుణ ను జోడించండి అని రామ్ మనోహర్ లోహియా గారు అనే వారు అని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. కానీ, ప్రభుత్వాన్ని ఇదివరకు నడుపుతూ వచ్చినటువంటి వారు పేద ప్రజల బాధ ను గురించి పట్టించుకోలేదు, మునుపటి ప్రభుత్వం వారి కార్యాల ను కుంభకోణాల తో, నేరాల తో జోడించింది అని ప్రధాన మంత్రి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ‘స్వామిత్వ పథకం’ భవిష్యత్తు లో ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాల లో సమృద్ధి తాలూకు కొత్త తలుపుల ను తెరవబోతోందని ప్రధాన మంత్రి అన్నారు. పిఎమ్ స్వామిత్వ యోజన లో బాగం గా గ్రామం లోని ఇళ్ళ కు యాజమాన్య దస్తావేజు పత్రాల ను ఇచ్చే పని మొదలైంది. టాయిలెట్ లు, ఇంకా ఉజ్జ్వల పథకాల తో సోదరీమణులు, కుమార్తెలు సురక్షితంగా ఉన్నట్లు భావించుకొంటున్నారు, వారు గౌరవ భావన ను పొందుతున్నారని ప్రధాన మంత్రి అన్నారు. పిఎమ్ ఆవాస్ యోజన లో చాలా వరకు గృహాలు ఆ ఇంటి మహిళ ల పేరు తోనే ఉన్నాయి అని ఆయన అన్నారు.
ఇదివరకటి కాలాల్లో ఉత్తర్ ప్రదేశ్ లో శాంతి భద్రత ల స్థితి ని గురించి ప్రధాన మంత్రి వ్యాఖ్యానిస్తూ, 2017వ సంవత్సరం కంటే పూర్వం ప్రభుత్వ విధానం బాహాటం గా దోపిడీ చేయడానికి మాఫియా కు యథేచ్ఛ ను ప్రసాదించింది అని పేర్కొన్నారు. ప్రస్తుతం యోగి గారి నాయకత్వం లో మాఫియా క్షమాపణ లు చెప్పుకొంటూ తిరుగుతోందని, అంతేకాక యోగి గారి ప్రభుత్వం లో ఎక్కువ గా ఇబ్బంది పడుతోంది కూడా మాఫియాలే అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు.
దేశాని కి ఎక్కువ మంది ప్రధానుల ను ఇచ్చిన రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అని ప్రధాన మంత్రి అన్నారు. ఇది ఉత్తర్ ప్రదేశ్ యొక్క ప్రత్యేకత. ‘‘అయితే, ఉత్తర్ ప్రదేశ్ గుర్తింపు ను ఈ ఒక్క అంశానికే పరిమితం చేయకూడదు. ఉత్తర్ ప్రదేశ్ ను ఆరేడు దశాబ్దాలకే గిరి గీసివేయడం తగదు. ఈ గడ్డ యొక్క చరిత్ర కాలాని కి కట్టుబడని అటువంటిది. ఈ నేల యొక్క తోడ్పాటు కాలాని కి అతీతమైంద’’న్నారు. భగవాన్ రాముడు ఈ గడ్డ మీద అవతరించారు. భగవాన్ శ్రీకృష్ణుని అవతారం కూడా సాక్షాత్కరించింది ఇక్కడే. 24 మంది జైన తీర్థంకరుల లో 18 మంది తీర్థంకరులు ఉత్తర్ ప్రదేశ్ లోనే అగుపించారు. మధ్య యుగం లో తులసీదాస్, ఇంకా కబీర్ దాస్ ల వంటి మహనీయులు కూడా ఈ మట్టి లోనే పుట్టారు. ఈ రాష్ట్రం సంత్ రవిదాస్ వంటి ఒక సంఘ సంస్కర్త కు జన్మ ను ఇచ్చిన విశేష అధికారాన్ని కలిగినటువంటిది కూడాను అని ప్రధాన మంత్రి అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లో ప్రతి ఒక్క మార్గం లో యాత్ర స్థలాలు మిక్కిలి గా ఉన్నాయి. ఇక్కడి రేణువు లో శక్తి ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. వేదాల ను, పురాణాల ను లిఖించే మహత్కార్యం ఇక్కడి నైమిశారణ్యం లో జరిగింది. అయోధ్య వంటి పుణ్యస్థలం అవధ్ ప్రాంతం లోనే నెలకొంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
మన గౌరవశాలి సిఖ్కు గురువు ల సంప్రదాయానికి కూడా ఉత్తర్ ప్రదేశ్ తో గాఢమైన బంధం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. గురు తేగ్ బహాదుర్ గారి శౌర్యాని కి ఆగ్ రా లోని ‘గురు కా తాళ్’ గురుద్వారా ఇప్పటికీ ఒక సాక్షి గా నిలబడివుంది.. ఇక్కడే ఆయన ఔరంగజేబు కు సవాలు ను విసరారు అని ప్రధాన మంత్రి అన్నారు.
రైతుల నుంచి కొనుగోళ్ల ను జరపడం లో జంట ఇంజను ల ప్రభుత్వం కొత్త రికార్డుల ను నెలకొల్పుతోందని ప్రధాన మంత్రి అన్నారు. ఇంత వరకు పంట కొనుగోళ్ళ రీత్యా ఉత్తర్ ప్రదేశ్ లోని రైతుల బ్యాంకు ఖాతాల లో దాదాపు గా 80,000 కోట్ల రూపాయలు చేరాయి. పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 37,000 కోట్ల రూపాయల కు పైగా ఉత్తర్ ప్రదేశ్ రైతు ల బ్యాంకు ఖాతాల లో జమ చేయడం జరిగింది అని ప్రధాన మంత్రి అన్నారు.
जब मूल सुविधाएं मिलती हैं, तो बड़े सपने देखने का हौसला और सपनों को पूरा करने का जज्बा पैदा होता है।
— PMO India (@PMOIndia) October 20, 2021
जो बेघर है, झुग्गी में है, जब उसको पक्का घर मिले, जब घर में शौचालय हो, बिजली का कनेक्शन हो, गैस का कनेक्शन हो, नल से जल आए, तो गरीब का आत्मविश्वास और बढ़ जाता है: PM
डबल इंजन की सरकार, डबल ताकत से स्थितियों को सुधार रही है।
— PMO India (@PMOIndia) October 20, 2021
वर्ना 2017 से पहले जो सरकार यहां थी, उसे आपकी दिक्कतों से, गरीब की परेशानी से कोई सरोकार नहीं था: PM @narendramodi
लोहिया जी कहा करते थे कि - कर्म को करूणा से जोड़ो, भरपूर करुणा से जोड़ो।
— PMO India (@PMOIndia) October 20, 2021
लेकिन जो पहले सरकार चला रहे थे, उन्होंने गरीब के दर्द की परवाह नहीं की, पहले की सरकार ने अपने कर्म को, घोटालों से जोड़ा, अपराधों से जोड़ा: PM @narendramodi
केंद्र सरकार ने एक और योजना शुरू की है जो भविष्य में उत्तर प्रदेश के ग्रामीण इलाकों में समृद्धि का नया द्वार खोलने वाली है।
— PMO India (@PMOIndia) October 20, 2021
इस योजना का नाम है- पीएम स्वामित्व योजना।
इसके तहत गांव के घरों की घरौनी यानि घरों का मालिकाना दस्तावेज़ देने का काम शुरु किया है: PM @narendramodi
2017 से पहले जो सरकार यहां पर थी, उसकी नीति थी- माफिया को खुली छूट, खुली लूट।
— PMO India (@PMOIndia) October 20, 2021
आज योगी जी के नेतृत्व में यहां माफिया माफी मांगता फिर रहा है और सबसे ज्यादा दर्द भी माफियावादियों को हो रहा है: PM @narendramodi
आप मध्यकाल को देखें तो तुलसीदास और कबीरदास जैसे युगनायकों ने भी इसी मिट्टी में जन्म लिया था।
— PMO India (@PMOIndia) October 20, 2021
संत रविदास जैसे समाजसुधारक को जन्म देने का सौभाग्य भी इसी प्रदेश को मिला है: PM @narendramodi
ये ऐसी धरती है जिसका इतिहास कालातीत है, जिसका योगदान कालातीत है।
— PMO India (@PMOIndia) October 20, 2021
इस भूमि पर मर्यादापुरुष भगवान राम ने अवतार लिया, भगवान श्रीकृष्ण ने अवतार लिया।
जैन धर्म के 24 में 18 तीर्थंकर, उत्तर प्रदेश में ही अवतरित हुए थे: PM @narendramodi
उत्तर प्रदेश के बारे में एक बात हमेशा कही जाती है कि ये एक ऐसा प्रदेश है जिसने देश को सबसे ज्यादा प्रधानमंत्री दिये।
— PMO India (@PMOIndia) October 20, 2021
ये यूपी की खूबी है, लेकिन यूपी की पहचान को केवल इस दायरे में ही नहीं देखा जा सकता।
यूपी को 6-7 दशकों तक ही सीमित नहीं रखा जा सकता: PM @narendramodi
उत्तर प्रदेश एक ऐसा प्रदेश है जहां पग-पग पर तीर्थ हैं, और कण-कण में ऊर्जा है।
— PMO India (@PMOIndia) October 20, 2021
वेदों और पुराणों को कलमबद्ध करने का काम यहाँ के नैमिषारण्य में हुआ था।
अवध क्षेत्र में ही, यहाँ अयोध्या जैसा तीर्थ है: PM @narendramodi
हमारी गौरवशाली सिख गुरु परंपरा का भी उत्तर प्रदेश से गहरा जुड़ाव रहा है।
— PMO India (@PMOIndia) October 20, 2021
आगरा में ‘गुरु का ताल’ गुरुद्वारा आज भी गुरु तेगबहादुर जी की महिमा का, उनके शौर्य का गवाह है जहां पर उन्होंने औरंगजेब को चुनौती दी थी: PM @narendramodi