ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంటెల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ) శ్రీ పేట్ జెల్సింగర్ తో సమావేశమయ్యారు. సాంకేతిక విజ్ఞానం, పరిశోధన మరియు నూతన ఆవిష్కరణ లకు సంబంధించిన విషయాల పైన ఈ సందర్భం లో చర్చించారు. భారతదేశం పట్ల శ్రీ పేట్ జల్సింగర్ వ్యక్తంచేసిన ఆశావాదాన్ని కూడా ఆయన ప్రశంసించారు.
ఇంటెల్ సిఇఒ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానమిస్తూ,
‘‘మిమ్మల్ని కలుసుకొన్నందుకు సంతోషిస్తున్నాను @PGelsinger గారూ!. మనం సాంకేతిక విజ్ఞానం, పరిశోధన మరియు నూతన ఆవిష్కరణ లకు సంబంధించిన విషయాల పై ఉత్కృష్టమైనటువంటి చర్చల ను జరిపాం. నేను భారతదేశం పట్ల మీరు వ్యక్తం చేసిన ఆశావహ దృక్పథాన్ని మెచ్చుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
Celebrating three decades of @intel partnership with India! pic.twitter.com/jlV2KNKsMO
— Pat Gelsinger (@PGelsinger) April 6, 2022