India-France strategic partnership may be just 20 years old but spiritual partnership between both countries exists since ages: PM
India and France have strong ties in defence, security, space and technology sectors: PM Modi
India welcomes French investments in the defence sector under the #MakeInIndia initiative: PM Modi

నా స్నేహితుడు, ఫ్రాన్స్ అధ్య‌క్షుడు శ్రీ మాక్రాన్‌,

గౌర‌వ‌నీయులైన ప్ర‌తినిధి వ‌ర్గం స‌భ్యులు, 
గౌరవనీయులైన ప్ర‌సార మాధ్య‌మాల స‌భ్యులారా,

న‌మ‌స్కారం.

అధ్యక్షులు శ్రీ మాక్రాన్ కు, ఆయ‌న వెంట విచ్చేసిన ప్ర‌తినిధుల‌కు ఇదే నా సాద‌ర స్వాగ‌తం. అధ్యక్షుల వారూ- కొన్ని నెల‌ల కింద‌ట మీరు- గత సంవత్సరం పారిస్ లో నాకు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు. ఈ రోజున భార‌త‌దేశం గ‌డ్డ‌ పైన మీకు స్వాగ‌తం ప‌లికే అవ‌కాశం నాకు ద‌క్కినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.

అధ్యక్షుల వారూ,

మ‌నం ఇరువుర‌మూ ఈ వేదిక మీద ఉన్నాం. మ‌నమిద్దరం శ‌క్తివంత‌మైన, స్వ‌తంత్ర‌మైన‌ మరియు వైవిధ్య‌భ‌రిత‌మైన రెండు ప్ర‌జాస్వామ్య దేశాల‌ నాయ‌కులం మాత్ర‌మే కాదు; సుసంప‌న్న‌మైనటువంటి మ‌రియు దీటైనటువంటి వార‌స‌త్వానికి ఉత్త‌రాధికారులం కూడాను. మ‌న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం 20 సంవ‌త్స‌రాల క్రిందటిది అయినప్పటికీ మ‌న నాగ‌ర‌క‌త‌ల యొక్క ఆధ్యాత్మిక భాగ‌స్వామ్యం శ‌తాబ్దాల తరబడి ప్రాచీనమైనటువంటిది.

18వ శ‌తాబ్దం నుండి ఫ్రెంచ్ మేధావులు పంచ‌తంత్రం లోని క‌థ‌లు, శ్రీ రామ‌కృష్ణ‌, శ్రీ అర‌బిందో ల వంటి మహాపురుషుల నుండి, ఇంకా వేదాల నుండి, ఉప‌నిష‌త్తుల నుండి మ‌రియు ఇతిహాసాల ద్వారా భార‌త‌దేశం యొక్క ఆత్మ‌ లోలోపలకు తొంగి చూస్తూ వ‌చ్చారు. వోల్టేయర్, విక్ట‌ర్ హ్యుగో, రొమాం రోలామ్, రెనీ దౌమల్ మరియు ఆంద్రీ మాల్ రాక్స్ ల వంటి అసంఖ్యాక మ‌హ‌నీయుల అనేక అభిప్రాయాలు భార‌త‌దేశం నుండి ప్రేర‌ణ‌ను పొందాయి.

అధ్య‌క్షుల వారూ,

ఇవాళ్టి మ‌న స‌మావేశం రెండు దేశాల నాయ‌కుల భేటీయే కాకుండా ఒకే ర‌క‌మైన అభిప్రాయాలు కలిగినటువంటి మరియు ఆ అభిప్రాయాల తాలూకు ఉమ్మ‌డి వార‌స‌త్వం కలిగినటువంటి రెండు నాగ‌ర‌క‌త‌ల క‌ల‌యిక కూడాను. స్వేచ్ఛ, స‌మాన‌త్వం, సోద‌ర భావం.. వీటి యొక్క ప్ర‌తిధ్వ‌నులు ఫ్రాన్స్ లోనే కాక భార‌త‌దేశం యొక్క రాజ్యాంగం లోనూ మారుమోగ‌డం కాకతాళీయం కాదు. ఉభయ దేశాల స‌మాజాలు ఈ విలువ‌ల పునాది మీద నిలచివున్నాయి. ఈ విలువల పరిరక్షణ కోసం మ‌న సాహ‌సిక సైనికులు రెండు ప్ర‌పంచ యుద్ధాల‌లో వారి ప్రాణాల‌ను అర్పించారు.

మిత్రులారా,

ఒకే వేదిక మీద ఫ్రాన్స్ మ‌రియు భార‌త‌దేశం కొలువు దీర‌డం ఒక స‌మ్మిళిత‌మైనటువంటి, బాహాటమైనటువంటి, స‌మృద్ధ‌మైన‌టువంటి మ‌రియు శాంతియుత‌మైనటువంటి ప్ర‌పంచానికొక స్వర్ణ సంకేతంగా ఉంది. ఇరు దేశాల‌కూ చెందినటువంటి స్వ‌యం వర్తిత, స్వతంత్ర విదేశీ విధానాలు వాటి కేంద్ర స్థానంలో తమ ప్ర‌యోజ‌నాల‌తో పాటు తమ దేశవాసుల ప్ర‌యోజ‌నాల‌కు పెద్ద పీటను వేయడంతో పాటు విశ్వ మాన‌వ విలువల ప‌రిర‌క్ష‌ణ‌కు కూడా క‌ట్టుబ‌డిన‌వే. ఇవాళ భార‌త‌దేశం మ‌రియు ఫ్రాన్స్ చేతిలో చేయిని వేసి ఎటువంటి ప్ర‌పంచ స‌వాలునైనా ఎదుర్కొనే స్థితిలో ఉన్నాయి. అధ్య‌క్షుల‌ వారూ, మీ నాయ‌క‌త్వం ఈ ప‌ద‌విని సుల‌భ‌త‌రంగా చేసేసింది. ఫ్రెంచ్ అధ్య‌క్షుల‌తో క‌ల‌సి 2015 వ సంవ‌త్సరంలో పారిస్ లో అంత‌ర్జాతీయ సౌర కూట‌మిని ఆరంభించ‌డం జ‌రిగింది. రేపు జ‌రుగ‌నున్న అంత‌ర్జాతీయ సౌర కూట‌మి స్థాప‌న స‌మావేశం మ‌న ఉమ్మ‌డి బాధ్య‌త‌ల ప‌ట్ల మ‌న‌కు ఉన్న అవ‌గాహ‌న‌కు ఒక సుస్ప‌ష్ట‌మైన ఉదాహ‌ర‌ణ‌గా ఉంటుంది. ఈ పవిత్ర కార్యభారాన్ని ఫ్రాన్స్ అధ్య‌క్షుల వారితో క‌ల‌సి నెర‌వేర్చనుండ‌డం నాకు సంతోషాన్నిస్తోంది.

మిత్రులారా,

ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌, అంత‌రిక్షం ఇంకా ఉన్న‌త సాంకేతిక విజ్ఞానం రంగాల‌లో భార‌త‌దేశానికి, ఫ్రాన్స్ కు మ‌ధ్య నెల‌కొన్నటువంటి ద్వైపాక్షిక స‌హ‌కారం యొక్క చరిత్ర యుగాల కింద‌టిది. రెండు దేశాల‌కు మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల తాలూకు ద్విపక్షీయ ఒప్పందమొక‌టి నెల‌కొంది. మ‌న సంబంధాల స్థాయి రెండు దేశాల‌లో అధికారంలో ఉన్న ప్ర‌భుత్వానికి అతీతంగా ఎల్ల‌ప్ప‌టికీ వృద్ధి చెందుతూ వ‌చ్చింది. నేటి ఒప్పందంలో చోటు చేసుకొన్న సంభాష‌ణ వివ‌రాలు మ‌రియు తీసుకొన్న నిర్ణ‌యాల తాలూకు వివరాలు మీకు అందాయి. ఈ కార‌ణంగా నేను మూడు నిర్దిష్ట అంశాల‌ పైన నా అభిప్రాయాల‌ను వెల్ల‌డి చేయాలనుకొంటున్నాను. ఒక‌టోది, ర‌క్ష‌ణ రంగంలో మ‌న సంబంధాలు ఎంతో గాఢ‌మైన‌వనేది. మరి మేం ఫ్రాన్స్ ను మా అత్యంత విశ్వ‌స‌నీయ‌ ర‌క్ష‌ణ రంగ భాగ‌స్వామ్య దేశాల్లో ఒక‌ దేశంగా మేము భావిస్తున్నాం. మ‌న సైన్యాల మ‌ధ్య క్ర‌మం త‌ప్ప‌క చ‌ర్చ‌లు, ఇంకా సైనిక విన్యాసాలు జ‌రుగుతూ వ‌స్తున్నాయి. ర‌క్ష‌ణ రంగ సామ‌గ్రి మ‌రియు ఉత్ప‌త్తిలో మ‌న సంబంధాలు బ‌లంగా ఉన్నాయి. ర‌క్ష‌ణ రంగంలో ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మానికి ఫ్రాన్స్ ప్ర‌క‌టించిన వ‌చ‌నబ‌ద్ధ‌త‌ను మేము స్వాగ‌తిస్తున్నాం.

నేడు, ప‌ర‌స్ప‌ర లాజిస్టిక్స్ ప‌ర‌మైన మ‌ద్ధ‌తు ఒప్పందాన్ని మ‌న స‌న్నిహిత‌మైన‌టువంటి ర‌క్ష‌ణ రంగ స‌హ‌కారపు చ‌రిత్ర‌లో ఒక సువ‌ర్ణ అధ్యాయంగా నేను ప‌రిగ‌ణిస్తున్నాను. రెండోది, ప్ర‌పంచం యొక్క ప్ర‌స‌న్న‌త‌, పురోగ‌తి మ‌రియు స‌మృద్ధి ల‌లో ఒక అతి ముఖ్య‌మైన పాత్ర‌ను హిందూ మ‌హా స‌ముద్ర ప్రాంత భ‌విష్య‌త్తు పోషించ‌నుంద‌ని మ‌న‌మిరువుర‌ం న‌మ్ముతున్నాం. ప‌ర్యావ‌ర‌ణం, స‌ముద్ర సంబంధ భ‌ద్ర‌త‌, సాగర వ‌న‌రులు, నౌకాయానంలో స్వేచ్ఛ తదితర రంగాల‌లో మ‌న స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసుకొనేందుకు మ‌నం కంక‌ణ బ‌ద్ధులమయ్యాం. కాబట్టి, ఈ రోజు మ‌నం హిందూ మ‌హా స‌ముద్ర ప్రాంతంలో మ‌న స‌హ‌కారానికి సంబంధించి ఒక సంయుక్త వ్యూహాత్మ‌క‌మైన దార్శ‌నిక‌తను ఆవిష్కరిస్తున్నాం. 
మూడోది ఏమిటంటే, మ‌న ద్వైపాక్షిక సంబంధాల యొక్క ఉజ్జ్వల భ‌విష్యత్తు కు మన ప్ర‌జ‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య సంబంధాలు, మ‌రీ ముఖ్యంగా మ‌న యువ‌జ‌నుల మ‌ధ్య నెల‌కొన్న సంబంధాలు అత్యంత ముఖ్యమైన పార్శ్వం అని మేం నమ్ముతున్నాం. ఉభయ దేశాలకు చెందిన యువత ఒక దేశాన్ని గురించి మ‌రొక దేశంలోని వారు తెలుసుకోవాల‌ని, అర్థం చేసుకోవాల‌ని, అక్క‌డ‌కు వెళ్ళి బ‌స చేసి ప‌ని చేయాల‌ని.. అలా చేయడం ద్వారా సంబంధాల‌ను పెంపొందించుకోవ‌డానికి వేల సంఖ్య‌లో రాయ‌బారులు సంసిద్ధం కావ‌చ్చ‌ని మేము అభిలషిస్తున్నాం. ఇందుకు ఈ రోజు రెండు ముఖ్య‌మైన ఒప్పంద పత్రాల‌పై మ‌నం సంత‌కాలు చేశాం. వీటిలో ఒక‌టోది ఒక దేశం అవ‌త‌లి దేశం యొక్క విద్యార్హ‌త‌ల‌కు మాన్య‌త‌ను క‌ల్పించడానికి సంబంధించింది. ఇక రెండోది, వ‌ల‌స‌లు మ‌రియు చ‌ల‌నశీల‌త భాగ‌స్వామ్యానికి సంబంధించిన‌టువంటిది. ఈ రెండు ఒప్పందాలు మ‌న ప్ర‌జ‌ల మధ్య మ‌రియు మ‌న యువ‌త మ‌ధ్య స‌న్నిహిత సంబంధాల‌కు ఒక స్వ‌రూపాన్ని సిద్ధం చేయ‌గ‌లుగుతాయి.

మిత్రులారా,

మ‌న సంబంధాల‌కు మ‌రెన్నో పార్శ్వాలు ఉన్నాయి. వాటన్నింటినీ నేను ప్ర‌స్తావించ‌డం మొద‌లు పెట్టానంటే అన్నింటినీ ఏకరువు పెట్టే స‌రికి సాయంత్రం అయిపోతుంది. మ‌న స‌హ‌కారం రైల్వేలు, ప‌ట్ట‌ణాభివృద్ధి, ప‌ర్యావ‌ర‌ణం, భ‌ద్ర‌త‌, అంత‌రిక్షం వరకు.. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. నేల నుండి నింగి వ‌ర‌కు విస్త‌రించింది. ఏ ఒక్క రంగాన్ని స్ప‌ర్శించ‌కుండా వదలివేయలేదు. అంత‌ర్జాతీయ స్థాయిలోనూ మనం స‌మ‌న్వ‌యాన్ని నెల‌కొల్పుకొంటూ పోతున్నాం. ఆఫ్రికా ఖండంలోని దేశాల‌తో భార‌త‌దేశం, ఫ్రాన్స్ దృఢ‌మైన సంబంధాలను కలిగివున్నాయి. అవి మ‌న స‌హ‌కారానికి మ‌రొక పార్శ్వాన్ని జతపరచుకోవడానికి ఒక బ‌ల‌మైన పునాదిని స‌మ‌కూరుస్తాయి. రేపటి అంత‌ర్జాతీయ సౌర కూట‌మి స్థాప‌న స‌మావేశం అధ్య‌క్షులు శ్రీ మాక్రాన్ తో పాటు నా యొక్క స‌హ అధ్య‌క్ష‌త‌న జ‌రుగనుంది. అనేక ఇత‌ర దేశాల అధ్య‌క్షులు, ప్ర‌భుత్వాలు మ‌రియు ప‌లువురు మంత్రులు మా వెంట ఉండ‌బోతున్నారు. భూ గోళం భ‌విష్య‌త్తు కోసమని, మ‌న‌మంతా అంత‌ర్జాతీయ సౌర కూట‌మి యొక్క విజ‌యానికి క‌ట్టుబ‌డివున్నాం.

అధ్య‌క్షుల వారూ, రేప‌టి తరువాతి రోజున వారాణ‌సీ లో మీరు భార‌త‌దేశం యొక్క ప్రాచీనమైనటువంటి మరియు ఎప్ప‌టికీ ప‌చ్చ‌గా ఉండేటటువంటి ఆత్మ యొక్క చవిని అనుభూతి చెందుతార‌ని నేను ఆశిస్తున్నాను. భార‌త‌దేశం యొక్క నాగ‌ర‌క‌త తాలూకు సార‌ం అది. ఫ్రాన్స్ కు చెందిన ఎంతో మంది ఆలోచనపరులు, ర‌చ‌యిత‌లు మ‌రియు క‌ళాకారుల‌కు స్ఫూర్తిని ఇచ్చిందది. అధ్య‌క్షులు శ్రీ మాక్రాన్‌ మరియు నేను మా ఆలోచ‌న‌ల‌ను రానున్న రెండు రోజులలోనూ ఒక‌రితో మ‌రొక‌రం పంచుకోబోతున్నాం. మ‌రొక్క మారు అధ్య‌క్షుల వారికి మ‌రియు ఆయ‌న ప్ర‌తినిధి వ‌ర్గానికి భార‌త‌దేశం లోకి నేను ఆత్మీయంగా స్వాగ‌త వచనాలు ప‌లుకుతున్నాను.

అనేకానేక ధ‌న్య‌వాదాలు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi