ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యూక్రేన్ అధ్యక్షుడు శ్రీ వొలొదిమీర్ జెలెన్ స్కీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడుతూ, ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల లో శ్రీ నరేంద్ర మోదీ కి లభించిన విజయం పట్ల ఆయన కు అభినందనల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఆయన కు ధన్యవాదాలు పలుకుతూ, యూక్రేన్ తో భాగస్వామ్యాన్ని మరింతగా బలపరచుకోవాలన్న భారతదేశం యొక్క వచనబద్ధత ను పునరుద్ఘాటించారు
సన్నిహిత వైఖరిని కొనసాగించవలసిన ఆవశ్యకత తో పాటు రెండు దేశాల ప్రజల హితం కోసం పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక సహకారాన్ని క్రొత్త క్రొత్త రంగాల కు విస్తరించాలని నేతలు ఇద్దరు నొక్కి పలికారు.
యూక్రేన్ లో కొనసాగుతున్న సంఘర్షణ విషయం లో, భారతదేశం అనుసరిస్తున్నటువంటి ప్రజా కేంద్రిత దృష్టికోణాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ చర్చ మరియు దౌత్యం ల మాధ్యం ద్వారా ఈ సంఘర్షణ కు శీఘ్ర గతి న, శాంతి యుక్తమైనటువంటి మరియు చిరకాలిక పరిష్కారాన్ని సాధించడం కోసం సాగే అన్ని ప్రయాసల కు భారతదేశం సమర్థన ఉంటుంది అని పునరుద్ఘాటించారు.
నేతలు ఇరువురు ఒకరి తో మరొకరు వారి యొక్క సంప్రదింపుల ను కొనసాగించాలని సమ్మతించారు.