ప్రియ మిత్రులారా!
దాడిలో ఉపయోగించే కలష్నికోవ్ తుపాకుల ఉత్పత్హి కోసం సంయుక్త రంగంలో ఏర్పాటైన రష్యా – భారత్సంస్థ ప్రారంభోత్సవానికి మీ అందరినీ స్వాగతిస్తున్నాను.
రష్యా , భారత్ మధ్య ప్రత్యేకమైన విషేశాదికారయుక్త వ్యూయాత్మక భాగస్వామ్యం ఉంది. దానిలో అనాదిగా కొనసాగుతున్న కీలక క్షేత్రాలలో సైనిక , సాంకేతిక సహకారం ఒకటి. భారత మిత్రులకు ఏడు దశాబ్దాలకు పైగామేము విశ్వసనీయమైన మరియు అతి నాణ్యమైన యుద్ధసామగ్రిని మరియు పరిరికరాలను సరఫరా చేస్తున్నాము. భారత్ దేశంలో దాదాపు 170 సైనిక మరియు పారిశ్రామిక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మా దేశం సహాయం చేసింది.
సంయుక్త రంగంలో ఏర్పాటు చేసినకొత్త సంస్థ ప్రపంచప్రఖ్యాతి చెందిన, అత్యంత ఆధునాతన 200 శ్రేణికి చెందిన కలష్నికోవ్ రైఫిల్స్ తయారు చేస్తుంది. చివరకు ఉత్పత్తిలో స్థానీకరణ జరుగుతుంది. ఆ విధంగా అత్యంత అదునాతన రష్యా సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే ఈ చిన్న ఆయుధాల వర్గంలో జాతీయ భద్రతా సంస్థల అవసరాలను తీర్చే అవకాశం భారత రక్షణ-పారిశ్రామిక రంగానికి వస్తుంది.
గత అక్టోబరులో నేను ఇండియాలో జరిపిన అధికార ప్రకటన సందర్భంగా మిత్రుడు, భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీతో ఈ దేశంలో కలష్నికోవ్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుచేసేందుకు ఒప్పందం కుడుర్చుకున్నాను. అతి తక్కువ కాలంలో సంబంధిత అంతర్ ప్రభుత్వ ఒప్పందం తయారుచేసి సంతకాలు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ స్థాపనకు తోడ్పడిన రష్యా, ఇండియా నిపుణులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ కొత్త ప్రాజెక్టు ప్రారంభం వల్ల భారత రక్షణ సామర్ధ్యం మరింత బలోపేతమవుతుంది. జాతీయ ఆర్ధిక వ్యవస్థ శాస్త్రీయ, పారిశ్రామిక పునాదులు మరింత అభివృద్ధి చెందుతాయి. అంతేకాక విద్యార్హత ఉన్న వారికి కొత్త ఉద్యోగాల సృష్టి సాధ్యమవుతుంది. వృత్తి విద్యకు, సిబ్బంది శిక్షణకు ప్రేరణ అవుతుంది. ఈ ప్లాంటు మన రెండు దేశాల మధ్య మైత్రికి మరియు నిర్మాణాత్మక సహకారానికి మరో సంకేతంగా మారుతుంది.
ఈ ప్రయత్నం విజయవంతం కావాలని, అంత మంచే జరగాలని కోరుకుంటున్నాను.