ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో వియత్నాం నేషనల్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్ శ్రీమతి ఎన్ గుయెన్ థీ కిమ్ నగాన్ ఈ రోజు భేటీ అయ్యారు.
ప్రధాన మంత్రి 2016 సెప్టెంబర్ లో తాను వియత్నాం ను సందర్శించినప్పుడు హనోయి లో వారు ఉభయులు ఇదివరకు ఒకసారి సమావేశమైన సంగతిని జ్ఞప్తికి తెచ్చుకొన్నారు. శ్రేష్ఠురాలు శ్రీమతి నగాన్ వియత్నాం నేషనల్ అసెంబ్లీ కి అధ్యక్షత వహించిన మొట్టమొదటి మహిళగా ప్రపంచంలోని మహిళలు అందరికీ ఒక ప్రేరణామూర్తి అయ్యారని ఆయన అన్నారు.
భారతదేశం మరియు వియత్నాం ల మధ్య పార్లమెంటరీ సంప్రదింపులు అధికం కావడాన్ని ప్రధాన మంత్రి స్వాగతించారు. రెండు దేశాలకు చెందిన యువ పార్లమెంట్ సభ్యులు రాకపోకలు జరిపేటట్లు ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
‘అణు ఇంధనాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగించడం కోసం సహకరించుకొనే ఒక ద్వైపాక్షిక ఒప్పంద’పత్రాల పైన ఈ రోజు సంతకాలు జరుగనున్నాయని, భారతదేశం మరియు వియత్నాం ల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందం మరింత దృఢతరం చేయగలుగుతుందని ప్రధాన మంత్రి అన్నారు.
Mrs. Nguyen Thi Kim Ngan, President of the National Assembly of Vietnam met PM @narendramodi. pic.twitter.com/fduG5AuMsR
— PMO India (@PMOIndia) December 9, 2016