శ్రీ లంక యొక్క అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె ఫోన్ ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాట్లాడుతూ, శ్రీ నరేంద్ర మోదీ కి ఆయన యొక్క చారిత్రిక ఎన్నికల విజయానికి గాను అభినందనల ను తెలియ జేశారు.
అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె కు ఆయన వ్యక్తం చేసిన స్నేహపూర్ణమైన శుభాకాంక్షల కు గాను ధన్యవాదాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. భారతదేశం అనుసరిస్తున్న ‘నేబర్‌హుడ్ ఫస్ట్’ పాలిసీ ని మరియు సాగర్ (SAGAR) విజన్ ను దృష్టి లో పెట్టుకొని భారతదేశాని కి మరియు శ్రీ లంక కు మధ్య బలమైన సంబంధాల ను నిర్మించడం కోసం భారతదేశం నిబద్ధత ను నిరంతరం పాటిస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
ఇద్దరు నేతలు అధ్యక్షుడు శ్రీ రణిల్ విక్రమ సింఘె 2023 వ సంవత్సరం జులై లో న్యూ ఢిల్లీ ని సందర్శించిన సందర్భం లో జారీ చేసినటువంటి విజన్ డాక్యుమెంటు ను అమలు పరచడం లో చోటు చేసుకొన్న విశేష ప్రగతి ని కూడా పరిశీలించారు. మరీ ముఖ్యం గా, ఇద్దరు నేతలు పరస్పర వికాసం, ప్రగతి మరియు సమృద్ధి లకు ఊతాన్ని ఇవ్వడం కోసం నలు దిక్కుల కనెక్టివటీ ని పెంపొందింప చేయడం లో మరింత వేగం గా ముందుకు పోవాలి అనేటటువంటి వారి యొక్క నిబద్ధత ను పునరుద్ఘాటించారు.
Thank you for your call and warm wishes, President @RW_UNP. Sri Lanka is an important partner in our Neighbourhood First policy. India is proud to be a dependable partner for Sri Lanka. I look forward to realising our joint vision of enhancing connectivity in all its dimensions.
— Narendra Modi (@narendramodi) June 5, 2024