‘ప్రవాసీ భారతీయ దివస్ (పిబిడి) సదస్సు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమంగా ఉంది. విదేశాలలో నివసిస్తున్న భారతీయులతో సన్నిహితంగా ఉండడానికి, వారితో సంబంధాలను పెంపొందించుకోవడానికి ఈ సదస్సు ఒక ముఖ్య వేదిక ను అందిస్తున్నది. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి ప్రభావం కొనసాగుతూ ఉన్నప్పటికీ, మన హుషారైన ప్రవాసీ భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, 16వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ను ఈ నెల 9 న నిర్వహిస్తున్నారు. ఇంతవరకు నిర్వహించిన పి.బి.డి. సమావేశాల మాదిరిగా ఈ సదస్సు ను కూడా వర్చువల్ పద్ధతి లో నిర్వహించడం జరుగుతుంది. ఈ 16వ పిబిడి సదస్సు కు ‘‘ఆత్మ నిర్భర్ భారత్ కు తోడ్పాటు ను అందించడం’’ అనేది ఇతివృత్తం గా ఉంది.
పి.బి.డి. సదస్సులో మూడు విభాగాలు ఉంటాయి. పిబిడి సదస్సు ను భారతదేశం మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథి, సురినామ్ అధ్యక్షుడు మాన్య శ్రీ చంద్రికా ప్రసాద్ సంతోఖి ప్రధానోపన్యాసం చేయనున్నారు. యువత కోసం ఆన్ లైన్ లో నిర్వహించిన ‘భారత్ కో జానియే’ క్విజ్ పోటీ విజేతల పేరులను కూడా ప్రకటించడం జరుగుతుంది.
ప్రారంభ సమావేశానికి తరువాయి గా రెండు సర్వసభ్య సదస్సు లు జరుగుతాయి. ఆత్మ నిర్భర్ భారత్ లో ప్రవాసీ భారతీయల పాత్ర అంశం పై జరిగే మొదటి సర్వసభ్య సదస్సు లో, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, వాణిజ్యం, పరిశ్రమ శాఖ మంత్రులు ప్రసంగిస్తారు. రెండోసర్వసభ్య సదస్సు లో కోవిడ్ అనంతర సవాళ్ల ను ఎదుర్కోవడం – ఆరోగ్యం, ఆర్థిక, సామాజిక, అంతర్జాతీయ సంబంధాల ముఖచిత్రం అంశంపై ఆరోగ్య శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ప్రసంగించనున్నారు. ఈ రెండు సర్వసభ్య సదస్సులలో ప్రముఖ ప్రవాసి భారతీయ నిపుణులను ఆహ్వానిస్తూ ప్యానెల్ చర్చలను నిర్వహించడం జరుగుతుంది.
చివరలో ముగింపు సమావేశం ఉంటుంది. ఆదరణీయ రాష్టప్రతి గారు ప్రవాసీ భారతీయ దివస్ సూచకంగా తన ముగింపు ఉపన్యాసాన్ని ఇస్తారు. 2020-21 సంవత్సరానికి గాను ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కార విజేతల పేరులను కూడా ప్రకటించడం జరుగుతుంది. ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారాలను ఎంపిక చేసిన ప్రవాసీ భారతీయ సముదాయ సభ్యులకు వారి కార్యసాధనలను గుర్తించడం కోసం, భారతదేశంతో పాటు విదేశాలలో వివిధ రంగాలకు వారు అందించిన తోడ్పాటులను గౌరవించుకోవడం కోసం ప్రదానం చేస్తూ వస్తున్నారు.
యువ పిబిడి ని కూడా వర్చువల్ పద్ధతి లోనే ‘‘భారతదేశం మరియు ప్రవాసీ భారతీయ యువ కార్యసాధకులను ఒకచోటుకు తీసుకురావడం’’ ఇతివృత్తం తో ఈ నెల 8న నిర్వహించడం జరుగుతుంది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికిన్యూజిలాండ్ సాముదాయిక, స్వచ్చంద రంగ శాఖ మంత్రి గౌరవనీయురాలు ప్రియంకా రాధాకృష్ణన్ ప్రత్యేక అతిథి గా హాజరు అవుతారు.