టెక్నాలజీ, పరిపాలనల అద్భుత కలబోతగా ‘ప్రగతి’ (పీఆర్ఏజీఏటీఐ) ప్లాట్‌ఫార్మ్ ఉంటూ ప్రాజెక్టుల అమల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరిస్తోందనీ, ఆ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి అయ్యేందుకు తోడ్పడుతోందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. ‘ప్రగతి’ పనితీరుకు ఆక్స్‌ఫర్డ్ సయీద్ బిజినెస్ స్కూల్‌తోపాటు గేట్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తింపు లభించినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆయన ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘టెక్నాలజీ, పరిపాలనల అద్భుత మేళనానికి ‘ప్రగతి’ ప్రాతినిధ్యం వహిస్తున్నది. ప్రాజెక్టుల అమల్లో ఎదురయ్యే సమస్యలను ‘ప్రగతి’ పరిష్కరిస్తూ, ఆ ప్రాజెక్టులు అనుకున్న కాలానికి పూర్తి అయ్యేటట్టు చూస్తున్నది. గత కొన్నేళ్ళలో నిర్వహిస్తూ వస్తున్న ఈ కార్యక్రమాలు చెప్పుకోదగిన ఫలితాలను అందించాయి. దీంతో ప్రజలు చాలా లాభపడ్డారు.
‘ప్రగతి’ పనితీరుకు @OxfordSBS తోపాటు @GatesFoundation నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తింపు లభించినందుకు నేను సంతోషిస్తున్నాను.’’
PRAGATI represents a wonderful amalgamation of technology and governance, ensuring silos are removed and projects are completed on time. Over the years, these sessions have led to substantive benefits, which have greatly benefitted people.
— Narendra Modi (@narendramodi) December 2, 2024
Am glad that the effectiveness of…