ఘర్షణల నివారణ,పర్యావరణ స్పృహ పై రెండో అంతర్జాతీయ సంవాద్ సమావేశం ఈరోజు, రేపు యాంగ్యాన్‌లో జరుగుతుంది.
2015 సెప్టెంబర్‌లో వివేకానంద కేంద్ర ఈ ప్రత్యేక తొలి సదస్సును కొత్తఢిల్లీలో నిర్వహించింది. ఇందులో పలు మతాలకు చెందిన వారు, సంప్రదాయాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు.
ప్రస్తుతం జరుగుతున్న సంవాద్ రెండో సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం పంపుతూ, ప్రపంచవ్యాప్తంగా నేడు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. అందులో
ఘర్షణలను నివారించడమెలా?
వాతావరణ మార్పుల వంటి అంతర్జాతీయ సవాలను ఎదుర్కోవడం ఎలా?
శాంతి , సామరస్యంతో జీవిస్తూ, మన జీవితాలనుభద్రంగా ఉంచుకోవడమెలా? అన్నవి ఉన్నాయన్నారు.
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వివిధ మతాలు, నాగరితలు, వివిధ ఆథ్యాత్మిక భావనల మానవ జాతి సుదీర్ఘ సంప్రదాయ ఆలోచనల వెలుగులో దర్శించడం ఒక్కటే సహజసిద్ధమైన మార్గం అవుతుందని ఆయన అన్నారు.
సంక్లిష్టమైన అంశాల విషయంలో చర్చలే సరైనవని గట్టిగా విశ్వసించే ప్రాచీన భారతీయ సంప్రాదాయ వారసత్వం నుంచి తాను వచ్చానని ప్రధాని అన్నారు. పరస్పరం అభిప్రాయాలు వ్యక్తం చేసుకోవడానికి, సంఘర్షణల నివారణకు ఒక నమూనాగా భారతీయ తర్కశాస్త్రం సంభాషణ, చర్చల పునాదిపై రూపుదిద్దుకున్నదని ప్రధానమంత్రి అన్నారు.
భారతీయ పురాణాలలోని పాత్రలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, శ్రీరాముడు, కృష్ణుడు, బుద్ధుడు, భక్తప్రహ్లాదుడు వీరందరి చర్యలూ ధర్మాన్ని కాపాడడం కోసం ఉద్దేశించినవేనని అన్నారు. ఇదే ప్రాచీన కాలం నుంచి ఆధునిక యుగం వరకు భారతీయలను ముందుకు నడిపిస్తోందని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సమాజాలను విచ్చిన్నం చేసే తీవ్ర మతపరమైన దురభిమానాలు, పక్షపాత ధోరణులు, వివిధ దేశాలు, సమాజాల మధ్య అవి నాటే ఘర్షణాత్మక బీజాలు తొలగించాలంటే సంవాద్ లేదా చర్చ ఒక్కటే సరైన పరిష్కారమని ప్రధాని అన్నారు.
మానవుడు ప్రకృతిని ప్రేమించకపోతే, అది వాతావరణ మార్పుల రూపంలో ప్రతిస్పందిస్తుందని ఆయన అన్నారు. ఆధునిక సమాజంలో పర్యావరణ చట్టాలు, నిబంధనలు తప్పనిసరని అయితే, అవి పర్యావరణానికి కొంతమేరకు మాత్రమే రక్షణనివ్వగలవని అంటూ, పర్యావరణ పరంగా సానుకూల దృక్పథం అవసరమని పిలుపునిచ్చారు.
మానవుడు ప్రకృతితో అనుసంధానం కావాలని, మనిషి ప్రకృతిని ఆరాధించాలని ఆయన అన్నారు.
ఒకదానితో ఒకటి అనుసంధానమైన, ఒక దానిపై ఒకటి ఆధారపడిన 21 వ శతాబ్దపు ప్రపంచంలో ఉగ్రవాదం నుంచి వాతావరణ మార్పులవరకు ఎన్నో ఘర్షణలు, అంతర్జాతీయ సవాళ్ళకు పరిష్కారం, ఆసియాలో అత్యంత ప్రాచీన సంప్రదాయాలైన చర్చలు, సంభాషణలద్వారా కనుగొనవచ్చని తాను విశ్వసిస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
Shared my message for the 2nd edition of 'Samvad- Global Initiative on Conflict Avoidance and Environment Consciousness', held in Yangon.
— Narendra Modi (@narendramodi) August 5, 2017
Talked about issues such as avoiding conflicts, addressing climate change and furthering peace.
— Narendra Modi (@narendramodi) August 5, 2017
Asia’s oldest traditions of dialogue and debate can give the answers to several global challenges such as terrorism and climate change.
— Narendra Modi (@narendramodi) August 5, 2017