ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రిపబ్లిక్ ఆఫ్ టర్కీ అధ్యక్షుడు మాన్య శ్రీ రిసెప్ తయ్యప్ ఎర్దోగన్ నేడు టెలిఫోన్ లో సంభాషించారు.
భారతదేశం లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల లో బాధితులైన వారి కి అధ్యక్షుడు శ్రీ ఎర్దోగన్ సంతాపం తెలిపారు. దాడుల లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
ప్రపంచ శాంతి కి మరియు భద్రత కు ఉగ్రవాదం గంభీరమైన బెదిరింపు గా తయారైందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదం పై సంబంధిత దేశాలు అన్నీ తిప్పివేయటానికి వీలు లేని తగిన చర్యల ను తక్షణమే తీసుకోవడం ఎంతో ముఖ్యం అని ఆయన స్పష్టంచేశారు.