ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత ప్రభుత్వం లో సహాయక కార్యదర్శులు గా ఇటీవల నియామకం పొందిన 170 మంది కి పైగా యువ ఐఎఎస్ అధికారులతో ఈ రోజు సమావేశమయ్యారు.
క్షేత్ర శిక్షణ లో వారి యొక్క అనుభవాలను వెల్లడి చేయవలసిందిగా వారిని ప్రధాన మంత్రి ఉత్సాహపరచారు. ప్రజల భాగస్వామ్యం, సమాచారం అందజేత, వనరుల గరిష్ట వినియోగం తో పాటు పాలన పట్ల ప్రజల విశ్వసనీయత తో సహా సుపరిపాలనలో కొన్ని అంశాల పై వారి తో ఆయన చర్చ జరిపారు.
ఇటీవలే ప్రారంభమైన గ్రామ్ స్వరాజ్ అభియాన్, ఇంకా ఆయుష్మాన్ భారత్ ల వంటి ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చర్చలో చోటు చేసుకొన్నాయి.
పిఎమ్ఒ లో సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింహ్ తో పాటు సిబ్బంది మరియు శిక్షణ విభాగానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.