ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్ లోని వల్‌సాడ్ జిల్లా జుజ్ వా గ్రామం లో జరిగిన ఒక పెద్ద జన సభ లో వేలాది ప్రజలతో కలసి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం యొక్క లబ్దిదారుల సామూహిక ఇ-గృహప్రవేశాలను వీక్షించారు. ఒక లక్ష కు పైగా గృహాలను రాష్ట్రం లోని 26 జిల్లాలలో విస్తరించిన లబ్ధిదారులకు అప్పగించడం జరిగింది. పలు జిల్లాల్లో లబ్దిదారులను ఒక వీడియో లింక్ ద్వారా ప్రధాన కార్యక్రమానికి జత పరచగా, వారిలో కొద్ది మంది తో ప్రధాన మంత్రి సంభాషించారు.
ఇదే కార్యక్రమంలో భాగంగా, ప్రధాన మంత్రి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ్ కౌశల్ యోజన, ముఖ్యమంత్రి గ్రామోదయ యోజన, నేశనల్ రూరల్ లైవ్‌లీహుడ్ మిశన్ లు సహా వివిధ అభివృద్ధి పథకాల లబ్దిదారుల లో ఎంపిక చేసిన కొంత మంది లబ్ధిదారులకు ధ్రువ పత్రాలను, నియామక పత్రాలను ప్రధాన మంత్రి ప్రదానం చేశారు. మహిళా బ్యాంక్ కరస్పాండెంట్‌ల కు నియామక పత్రాలను, మినీ-ఎటిఎమ్ లను ఆయన అందించారు.
అస్తోల్ నీటి సరఫరా పథకానికి ప్రధాన మంత్రి పునాది రాయి ని కూడా వేశారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, త్వరలో రక్షా బంధన్ పండుగ రానుందంటూ గుర్తు చేశారు. ఒక లక్ష మందికి పైగా మహిళలు వారి పేరిట ఒక గృహాన్ని రక్షా బంధన్ బహుమతి వలె స్వీకరించడం తనకు సంతృప్తి ని ఇచ్చినట్లు ఆయన చెప్పారు. కొత్త ఇల్లు తనతో పాటే కొత్త కలలను కూడా వెంట తీసుకువస్తుందని, ఆయా కలలను నెరవేర్చుకోవడం కోసం కష్టించి పని చేయాలనే ఒక నూతన సామూహిక ఉత్సాహం కుటుంబం లో వెల్లివిరుస్తుందని ఆయన అన్నారు.
ఈ రోజున ఇ-గృహప్రవేశాలలో కనిపించినటువంటి ఇళ్ళు చక్కటి నాణ్యత తో ఉన్నాయనిపించిందని, ఎటువంటి మధ్యదళారులు లేనందువల్లనే ఈ పరిణామం సాధ్యం అయ్యిందని ఆయన తెలిపారు. 2022వ సంవత్సరాని కల్లా “అందరికీ గృహ వసతి’’ లభించేలా చూడడమే కేంద్ర ప్రభుత్వ దార్శనికత అని ఆయన పునరుద్ఘాటించారు.
ఇంతవరకు ఉన్న హయాం లలో రాజకీయ నాయకులు ఖరీదైన ఇళ్ళ ను నిర్మించుకొంటూ వచ్చారని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రస్తుత హయాం లో పేదలు వారి సొంత ఇళ్ళ ను పొందే విధంగా మార్పు చోటు చేసుకొందని ఆయన అన్నారు.
ఈ రోజున శంకు స్థాపన జరిగిన అస్తోల్ నీటి సరఫరా పథకాన్ని రూపు దాల్చనున్న ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా ఆయన అభివర్ణించారు. శుభ్రమైన త్రాగునీరు వ్యాధుల బారి నుండి ప్రజలను కాపాడగలుగుతుందని ప్రధాన మంత్రి వివరించారు.
పేదలకు వారి సొంత ఇల్లు మొదలుకొని, విద్యుత్తును, పరిశుభ్రమైన త్రాగునీటిని, కాలుష్యానికి తావు ఉండని వంటింటి ఇంధనాన్ని అందుబాటు లోకి తీసుకు రావడం ద్వారా వారి జీవితాల్లో పరివర్తన ను తేవాలని ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తున్నదీ ప్రధాన మంత్రి విశదీకరించారు.
I got an opportunity to talk to women across the state today who got their homes under PM Awas Yojana.
— PMO India (@PMOIndia) August 23, 2018
The wonderful homes under PM Awas Yojana are being made possible because there are no middlemen: PM
It is my dream, it is our endeavour to ensure that every Indian has his own house by 2022.
— PMO India (@PMOIndia) August 23, 2018
Till now, we only heard about politicians getting their own homes.
Now, we are hearing about the poor getting their own homes: PM