ఐఎన్ఎస్‌వి తారిణి ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చే యాత్రను ఈ రోజు ఆరంభించనున్న నావికా సాగర్ పరిక్రమ కు చెందిన ఆరుగురు మహిళా అధికారులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు అందజేశారు.
నావికా సాగర్ పరిక్రమ బృందానికి Narendra Modi App లో శుభాకాంక్షలను, ప్రోత్సాహకరమైనటువంటి సందేశాలను పంపవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రధాన మంత్రి కోరారు.
‘‘ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. నౌకా దళానికి చెందిన ఆరుగురు మహిళా అధికారులు ఐఎన్ఎస్‌వి తారిణి లో ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు బయలుదేరి వెళ్తున్నారు.
అందరూ మహిళలే సభ్యులుగా ఉండే నావికా సాగర్ పరిక్రమ బృందం వారి అసాధారణ ప్రయత్నంలో సఫలం కావాలని యావత్ దేశ ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు.
నావికా సాగర్ పరిక్రమ బృందానికి మీ యొక్క శుభాకాంక్షలను మరియు ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి సందేశాలను NM App లో నమోదు చేయండి’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
భారతీయ మహిళలు సభ్యులుగా ఉన్నటువంటి ఒక బృందం ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు యాత్రగా బయలుదేరడం ఇదే మొట్టమొదటిసారి. వారు వారి సాహస యాత్రను ఈ రోజు గోవా నుండి మొదలు పెట్టబోతున్నారు. వారు యాత్రను ముగించుకొని 2018 మార్చి నెలలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ యాత్రకు నావికా సాగర్ పరిక్రమ అనే పేరును పెట్టారు. ఈ పరిక్రమ అయిదు చరణాలలో సాగుతూ, దారి మధ్యలో 4 ఓడరేవులు.. ఆస్ట్రేలియాలోని ఫ్రీమేంటల్, న్యూజిలాండ్ లోని లైటల్ టన్, ఫాక్ లాండ్ లోని పోర్ట్ స్టాన్లే తో పాటు, దక్షిణ ఆఫ్రికా లోని కేప్ టౌన్..లలో మజిలీలు చేస్తుంది.
#NavikaSagarParikrama 2day is D-Day. 6 naval offrs set sail onboard #INSVTarini at 1300h as @DefenceMinIndia Smt @nsitharaman flags them off pic.twitter.com/hs37wF7P1k
— SpokespersonNavy (@indiannavy) September 10, 2017
Today is a special day! 6 women officers of the Navy begin their journey of circumnavigating the globe on board INSV Tarini.
— Narendra Modi (@narendramodi) September 10, 2017
The entire nation comes together in wishing the all-women team of Navika Sagar Parikrama the very best in their remarkable endeavour.
— Narendra Modi (@narendramodi) September 10, 2017
Share your good wishes & words of encouragement for the team of Navika Sagar Parikrama, on the NM App. https://t.co/c7sLBPuzYd
— Narendra Modi (@narendramodi) September 10, 2017