ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫిలిప్పీన్స్లో లాస్ బనస్లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఆర్ఆర్ఐ) ను సందర్శించారు. ఐ.ఆర్.ఆర్.ఐ అనేది వరి శాస్త్రం ద్వారా పేదరికం మరియు ఆకలి తగ్గించడానికి; వరి రైతులు మరియు వినియోగదారుల ఆరోగ్య మరియు సంక్షేమ అభివృద్ధికి; మరియు భవిష్యత్ తరాల కోసం వరి పెరుగుదల పర్యావరణాన్ని పరిరక్షించడానికి అంకితమైన ఒక ప్రధాన పరిశోధన సంస్థ.
వరదలను తట్టుకోగల వరి రకాలు; కరువును తట్టుకునే వరి రకాలు; లవణము తట్టుకోగల వరి రకాలు; మరియు మహిళల సహకార సంఘాలతో ఐఆర్ఆర్ఐ యొక్క కృషిని చూపిస్తున్న ఫోటో ప్రదర్శనను ప్రధానమంత్రి సమీక్షించారు.
ముంపును తట్టుకోగల వరి రకాలు అభివృద్ధి చేస్తున్న కొత్త ప్లాట్లుకు ప్రధాన మంత్రి ప్రతీక ఆవిష్కరణ చేశారు. శ్రీ నరేంద్ర మోదీ రెలిజియెంట్ రైస్ ఫీల్ద్ లాబొరేటరీ ప్రారంభోత్సవం గుర్తుగా శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.ఆయన ఐఆర్ఆర్ఐ జన్యు బ్యాంకుకు రెండు భారత వరి విత్తురకాలను అందజేశారు.
ఈ సందర్శన సందర్భంగా, ప్రధాన మంత్రి ఐఆర్ఆర్ఐలో పనిచేస్తున్న అనేక మంది భారత శాస్త్రవేత్తలతో మాట్లాడారు.
PM @narendramodi visits the International Rice Research Institute (IRRI), which is working towards developing better quality of rice seed and addressing food scarcity issues. A large number of Indian scientists are working in IRRI and contributing to R&D in these areas. pic.twitter.com/pg3IpVqAkT
— PMO India (@PMOIndia) November 13, 2017
In July 2017, the Cabinet approved a proposal for IRRI to set up its South Asia Regional Centre at Varanasi. This will be the first Research Centre by IRRI outside its headquarters in the Philippines.
— PMO India (@PMOIndia) November 13, 2017
The Varanasi Centre would help increase farmers' income by enhancing and supporting rice productivity, reducing cost of production, value addition, diversification and enhancement of farmers' skills.
— PMO India (@PMOIndia) November 13, 2017