ఇంధ‌న భ‌ద్ర‌త‌కు మ‌రింత ఊతం

Published By : Admin | February 10, 2019 | 13:00 IST

గుంటూరును సంద‌ర్శించిన ప్ర‌ధాన‌మంత్రి,
1.33 ఎంఎంటి విశాఖ‌ప‌ట్నం ఎస్‌.పి.ఆర్ ఫెసిలిటీ జాతికి అంకితం
బిపిసిఎల్ కోస్ట‌ల్ ఇన్‌స్ట‌లేష‌న్ ప్రాజెక్టు, ఒ.ఎన్‌.జి.సి ఎస్‌1 వ‌శిష్ఠ ఆవిష్క‌ర‌ణ‌
ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరును సంద‌ర్శించి మూడు ప్ర‌ధాన ప్రాజెక్టుల‌ను ప్రారంభించారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ శ్రీ ఇ.ఎస్‌.ఎల్‌.న‌ర‌సింహ‌న్‌, కేంద్ర వాణిజ్య‌,ప‌రిశ్ర‌మ‌లు,పౌర విమాన‌యాన శాఖ మంత్రి శ్రీ సురేష్ ప్ర‌భు ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

|

దేశంలో ఇంధ‌న భ‌ద్ర‌తా రంగానికి మ‌రింత ఊతం ఇచ్చేవిధంగా ప్ర‌ధాన‌మంత్రి, ఇండియ‌న్ స్ట్రాట‌జిక్ పెట్రోలియం రిజ‌ర్వు లిమిటెడ్ (ఐఎస్‌పిఆర్ ఎల్‌)కుచెందిన  విశాఖ‌ప‌ట్నం వ్యూహాత్మ‌క పెట్రోలియం రిజ‌ర్వు (ఎస్‌పిఆర్‌) ను జాతికి అంకితం చేశారు. ఈప్రాజెక్టు వ్య‌యం 1125 కోట్ల‌రూపాయ‌లు. ఈ వ్యూహాత్మ‌క ఫెసిలిటీ  ఇంధ‌న నిల్వ‌కు సంబంధించి దేశంలోనే అతిపెద్ద భూగ‌ర్భ‌ కంపార్టెమెంట్ క‌లిగి ఉంటుంది.
కృష్ణ‌ప‌ట్నంవ‌ద్ద భార‌త్‌పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (బిపిసిఎల్‌)చే కోస్ట‌ల్ ఇన్‌స్ట‌లేష‌న్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్ర‌ధాన‌మంత్రి ఈరోజు శంకుస్థాప‌న చేశారు.100 ఎక‌రాల విస్తీర్ణంలో నెల‌కొల్ప‌బోయే ఈప్రాజెక్టు వ్య‌యం 580 కోట్ల‌రూపాయ‌లు. ప్రాజెక్టు 2020 న‌వంబ‌ర్ నాటికి పూర్తి కానుంది. అత్యాధునిక సౌక‌ర్యాల‌తో, పూర్తి ఆటోమేటిక్ సాంకేతిక‌ప‌రిజ్ఞానంతో ఏర్పాటు కానున్న కోస్ట‌ల్ ఇన్‌స్ట‌లేష‌న్ ప్రాజెక్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు పెట్రోలియం ఉత్ప‌త్తుల‌కు సంబంధించి ఇంధ‌న భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తుంది.

|

గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మ‌రింత ప్రోత్సాహం ఇస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ఓఎన్‌జిసికి చెందిన ఎస్ 1 వ‌శిష్ఠ అభివృద్ధి ప్రాజెక్టును కూడా  ఈరోజు జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా – గోదావ‌రి ఆఫ్‌షోర్‌బేసిన్‌లో నెల‌కొని ఉంది. ఈ ప్రాజెక్టు వ్య‌యం సుమారు 5,700 కోట్ల‌రూపాయ‌లు.ఈ ప్రాజెక్టువ‌ల్ల దేశ చ‌మురు దిగుమ‌తులు 2020 నాటికి 10 శాతం త‌గ్గించ‌డానికి గ‌ణ‌నీయంగా దోహ‌ద‌ప‌డుతుంది.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
'New India's Aspirations': PM Modi Shares Heartwarming Story Of Bihar Villager's International Airport Plea

Media Coverage

'New India's Aspirations': PM Modi Shares Heartwarming Story Of Bihar Villager's International Airport Plea
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 మార్చి 2025
March 07, 2025

Appreciation for PM Modi’s Effort to Ensure Ek Bharat Shreshtha Bharat