ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో జర్మన్ ఛాన్సలర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్ తో కలిసి గాం
ధీ స్మృతిని సందర్శించారు. జర్మన్ ఛాన్సలర్ కు ప్రధానమంత్రి , ప్రముఖ శిల్పి, పద్మభూషణ్ శ్రీరామ్ సుతార్ చెక్కిన మహాత్మాగాంధీ విగ్రహం ముందు స్వాగతం పలికారు.
ఈ ప్రాంగణం ప్రాధాన్యతను డాక్టర్ మెర్కెల్ కు వివరిస్తూ ప్రధానమంత్రి, మహాత్మాగాంధీ తన జీవితంలో చివరి కొద్ది నెలలు గడిపిన ప్రదేశంలో ఈ స్మృతిని నెలకొల్పినట్టు తెలిపారు. 1948 జనవరి 30న మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు.
ఎందరో ప్రపంచ నాయకులు ఈ మ్యూజియంను సందర్శించి ప్రముఖ చిత్రకారుడు శ్రీ ఉపేంద్ర మహారథి,ఇండో హంగేరియన్ పెయింటర్ ,శాంతినికేతన్ కు చెందిన నందాలాల్ బోస్ విద్యార్థి, ఎలిజెబెత్ బ్రునెర్, వేసిన స్కెచ్ లను పెయింటింగ్‌లను చూసినట్టు ప్రధానమంత్రి తెలిపారు. అహింస, సత్యాగ్రహ జంట ఇతివృత్తాల ఆధారంగా శ్రీ బిరద్ రాజారామ్ యాజ్ఞిక్ రూపొందించిన డిజిటల్ గ్యాలరీని వారు సందర్శించారు.
అనంతరం ఇరువురు నాయకులు మ్యూజియంలోని పలు డిజిటల్ విభాగాలను సందర్శించారు. అందులో మహాత్మాగాంధీపై అల్బర్ట్ ఐన్‌స్టీన్ వెల్లడించిన అభిప్రాయానికి సంబంధించిన ఆడియో విభాగాన్నీ సందర్శంచారు. అలాగే 107 దేశాలలో పాడిన వైష్ణవ జనతో గీతాన్ని ప్రదర్శించే ఇంటారక్టివ్ కియోస్క్‌నూ వారు సందర్శించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జర్మన్ ఛాన్సలర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్ లు అమర వీరుల స్మృతి వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించి పుష్పాంజలి ఘటించారు.