ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వారాణసీ లోని బిహెచ్‌యు ను సందర్శించారు. మదన్ మోహన్ మాలవీయ విగ్రహాన్ని, అలాగే వారాణసీ ఘాట్ ల కుడ్య చిత్రాల ను ఆయన ఆవిష్కరించారు. మదన్ మోహన్ మాలవీయ విగ్రహాని కి ఆయన పుష్పాంజలి ని సమర్పించారు.
ఈ కార్యక్రమానికి ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాం నాయక్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఇంకా ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
మదన్ మోహన్ మాలవీయ కేన్సర్ ఆసుపత్రి ని మరియు భాభా కేన్సర్ ఆసుపత్రి, లెహర్‌తారా ను ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఈ ఆసుపత్రులు ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రోగులతో పాటు సమీప రాష్ట్రాలైనటువంటి మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్‌ఖండ్, బిహార్ లకు చెందిన రోగుల కు కూడా సమగ్ర చికిత్స ను అందించనున్నాయి.
ప్రధాన మంత్రి మొట్టమొదటి నూతన భాభా ట్రాన్ (విత్ ప్రిసీఝన్ టెక్నాలజీ) ని కూడా దేశ ప్రజల కు అంకితం చేశారు.
డే కేర్ యూనిట్ ను & ఒపిడి ని ఆయన సందర్శించారు; అక్కడి రోగుల తో ప్రధాన మంత్రి సంభాషించారు.
అలాగే పిఎంజెఎవై-ఆయుష్మాన్ భారత్ లబ్దిదారుల తో సైతం ప్రధాన మంత్రి మాట్లాడారు.