అర్హులైన ఓటర్లు అందరూ వారి వారి పేర్లను నమోదు చేయించుకొని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని జాతీయ ఓటర్ల దినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు.
“జాతీయ ఓటర్ల దినం సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇవే నా శుభాకాంక్షలు. ఈ రోజున ఏర్పాటైన భారత ఎన్నికల సంఘానికి అభినందనలు.
అర్హులైన ఓటర్లు అందరూ, మరీ ముఖ్యంగా యువతీ యువకులు, వారి పేర్లను నమోదు చేయించుకోవడమే కాకుండా వారి భాగస్వామ్యం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని బలపరచవలసిందని నేను కోరుతున్నాను. ఓటుకు ఉన్న శక్తి గొప్పది” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
Greetings to everyone on #NationalVotersDay. Congratulations to the Election Commission of India, which was founded on this day.
— Narendra Modi (@narendramodi) January 25, 2018
I urge all the eligible voters, particularly youngsters, to register themselves and strengthen our democracy with their participation.The power of a vote is immense. pic.twitter.com/GKd6zpbUP8
— Narendra Modi (@narendramodi) January 25, 2018