ఒడిశా రాష్ట్రాన్ని 2019వ సంవత్సరం మే 3వ తేదీ నాడు తాకిన ఫోనీ తుఫాను కారణంగా తలెత్తిన పరిస్థితుల ను సమీక్షించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఒడిశా రాష్ట్రాన్ని సందర్శించారు. ఆయన భువనేశ్వర్, నీమపాద, కోణార్క్, పురీ మరియు పిప్లీ ల ను వినువీధి నుండి గమనించారు. ఆకాశ మార్గం నుండి సాగినటువంటి ఈ సర్వేక్షణ కార్యక్రమం లో గవర్నర్ ప్రొఫెసర్ గణేశి లాల్, ముఖ్యమంత్రి శ్రీ నవీన్ పట్నాయక్ లతో పాటు కేంద్ర పెట్రోలియమ్ మరియు సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కూడా ప్రధాన మంత్రి వెంట ఉన్నారు.
ఆ తరువాత, తుఫాను కారణంగా జరిగిన నష్టం గురించిన పరిశీలన కోసం, ఇంకా ప్రస్తుతం అమలవుతున్న సహాయక, పునరావాస కార్యక్రమాల పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులతో ప్రధాన మంత్రి ఒక సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రాని కి సాధ్యమైన అన్ని రకాలు గాను సహాయాన్ని అందించడం జరుగుతుందంటూ ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు. ఆయన 1,000 కోట్ల రూపాయల విలువైన తక్షణ సహాయాన్ని ప్రకటించారు. ఈ సహాయం రాష్ట్ర ప్రభుత్వానికి 2019వ సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ న విడుదల చేసిన 341 కోట్ల రూపాయల కు అదనంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అంతర్ మంత్రిత్వ శాఖల బృందమొకటి అంచనా వేసిన మేరకు తదుపరి మరింత సహాయాన్ని సైతం అందిస్తామంటూ ఆయన వాగ్దానం చేశారు.
ఒడిశా ప్రజల కు ప్రధాన మంత్రి తన పూర్తి సంఘీభావాన్ని ప్రకటించారు. తక్షణ సహాయాన్ని సమకూర్చడం మాత్రమే కాక రాష్ట్ర పునర్ నిర్మాణానికి కూడాను కేంద్ర ప్రభుత్వం పూర్తి గా కట్టుబడివుందని ఆయన అన్నారు. ప్రాణ నష్టాన్ని తగ్గించడం లో ఉపగ్రహాలు పంపిన చిత్రాల తో పాటు ముందస్తు గా వాతావరణ అంచనాలను వెలువరించే మెలకువల యొక్క పాత్ర ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. సాంకేతిక సామర్ధ్యాలకు మానవ ప్రమేయం తోడవడం వల్ల వరుస లోని చివరి వారి వరకు సమీపించడం సాధ్యపడినట్లు ఆయన చెప్పారు. ఒక మిలియన్ మంది కి పైగా ప్రజల ను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ని, కచ్చితత్వంతో కూడినటువంటి ముందస్తు సమాచారాన్ని ఇచ్చేందుకు ఐఎం డి చేసిన కృషి ని ఆయన ప్రత్యేకం గా మెచ్చుకొన్నారు. ప్రజల నిబ్బరాన్ని, అలాగే కోస్తా తీర ప్రాంతాల లో నివసిస్తున్న మత్స్యకార కుటుంబాల మనోధైర్యాన్ని ఆయన అభినందించారు. కేంద్ర ప్రభుత్వ మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య శ్రేష్ఠమైనటువంటి సహకారం మృతుల సంఖ్య ను న్యూనీకరించడం లో సహాయకారి గా నిలచిందంటూ ఆయన సంతృప్తి ని వ్యక్తం చేశారు. ఒక కోస్తా రాష్ట్రానికి తాను ఒక ముఖ్యమంత్రి గా పనిచేసిన కారణం గా ఈ తరహా తుఫాను వల్ల వాటిల్లే నష్టం మరియు విధ్వంసం స్థాయి లు ఎలా ఉంటాయో తాను ఎరుగుదునని ప్రధాన మంత్రి అన్నారు.
మౌలిక సదుపాయాలకు, ఇళ్లకు, మత్స్యకారులకు మరియు రైతులకు కలిగిన నష్టం తాలూకు స్థాయిలను, ఇంకా రాష్ట్రానికి అందించదగ్గ సహాయాన్ని అంచనా వేయడం కోసం ఒక కేంద్ర బృందం త్వరలోనే రాష్ట్రాన్ని సందర్శిస్తుందని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు. సేవల ను సాధ్యమైనంత త్వరగా పునరుద్దరించే చర్యలను తీసుకోవలసిందిగా విద్యుత్తు, టెలికమ్యూనికేశన్స్ మరియు రైల్వేల కు చెందిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు, కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. రహదారుల కు మరమ్మతులు చేసేందుకు దీటైన చర్యల ను చేపట్టాలని, అలాగే ఈ విషయం లో రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయాన్ని అందించాలని రహదారి మరియు ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ను కూడా ఆయన ఆదేశించారు. పంట బీమా కు సంబంధించి రైతుల క్లెయిము లను అంచనా వేయడం కోసం, అలాగే వారికి సాధ్యమైనంత్ర త్వరగా సహాయాన్ని అందించడం కోసం బీమా కంపెనీలు వాటి యొక్క పరిశీలకుల ను వరద బాధిత ప్రాంతాల కు వెంటనే పంపించాలని ఆయన ఆదేశించారు.
తుఫాను కారణం గా ఆప్తులను కోల్పోయిన వారి రక్త సంబంధికుల కు రెండు లక్షల రూపాయల అనుగ్రహపూర్వక చెల్లింపు ను, అదే విధం గా తుఫాను కారణం గా గాయపడిన వారి కి యాభై వేల రూపాయల అనుగ్రహపూర్వక చెల్లింపు ను ప్రధాన మంత్రి ప్రకటించారు. ఈ కష్ట కాలం లో కేంద్ర ప్రభుత్వం వెన్నంటి నిలబడుతుందంటూ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి భరోసా ను ఇచ్చారు.