ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే నెల 25వ తేదీ నాడు పశ్చిమ బెంగాల్ లో మరియు ఝార్ ఖండ్ లో పర్యటించనున్నారు.
ఆయన శాంతినికేతన్ లో గల విశ్వ భారతి విశ్వవిద్యాలయం యొక్క స్నాతకోత్సవానికి హాజరవుతారు. భారతదేశం మరియు బాంగ్లాదేశ్ ల మధ్య సాంస్కృతిక బంధానికి ఒక ప్రతీక అయినటువంటి బాంగ్లాదేశ్ భవన్ ను శాంతి నికేతన్ లో ఆయన ప్రారంభిస్తారు. ఈ రెండు కార్యక్రమాల లోను బాంగ్లాదేశ్ ప్రధాని శేఖ్ హసీనా పాలుపంచుకోనున్నారు.
ప్రధాన మంత్రి ఝార్ ఖండ్ లో భారత ప్రభుత్వం మరియు ఝార్ ఖండ్ ప్రభుత్వం చేపట్టే వివిధ పథకాలకు పునాది రాయి ని వేస్తారు. ఈ కార్యక్రమం సింద్రీ లో ఉంటుంది. ఈ పథకాలలో:
• హిందుస్తాన్ వూర్వారక్ అండ్ రసాయన్ లిమిటెడ్ కు చెందిన సింద్రీ ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ;
• గేల్ కు చెందిన రాంచీ సిటీ గ్యాస్ పంపిణీ పథకం;
• దేవ్‌ఘర్ లో అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (ఎఐఐఎమ్ఎస్);
• దేవ్‌ఘర్ విమానాశ్రయ అభివృద్ధి పథకం;
• పత్రాతు సూపర్ థర్మల్ పవర్ ప్రోజెక్టు (3×800 ఎమ్‌డబ్ల్యు)లు కొన్ని.
జన్ ఔషధీ కేంద్రాల యొక్క ఎమ్ఒయు ల ఆదాన ప్రదానాన్ని కూడా ప్రధాన మంత్రి వీక్షించనున్నారు.
సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.
ఆ తరువాత రాంచీ లో, ఝార్ ఖండ్ యొక్క మహత్వాకాంక్ష కలిగిన జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్ల తో ప్రధాన మంత్రి సమావేశమవుతారు.