ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం మార్చి నెల 8వ తేదీన ఉత్తర్ ప్రదేశ్ లో వారాణసీ ని, కాన్‌పుర్ ను మరియు గాజియాబాద్ ను సందర్శించనున్నారు. ఆ రాష్ట్రం లో అనేక అభివృద్ధి పథకాల ను ఆయన ఆవిష్కరించనున్నారు.
వారాణసీ లో
ప్రధాన మంత్రి వారాణసీ లో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సమీపించేటటువంటి ఓ రహదారి సుందరీకరణ మరియు పటిష్టీకరణ పథకాని కి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత ప్రోజెక్టు స్థలాన్ని ప్రధాన మంత్రి పరిశీలిస్తారు.
వారాణసీ లో గల దీన్ దయాళ్ హస్తకళా సంకుల్ లో జరిగే ‘జాతీయ మహిళ ల జీవనోపాధి సమావేశం- 2019’కి ప్రధాన మంత్రి హాజరు అవుతారు. మహిళల స్వయం సహాయ బృందాలు అయిదింటి కి ప్రశంసా లేఖల ను ఆయన ప్రదానం చేస్తారు. మహిళల స్వయం సహాయ బృందాల సభ్యులు ప్రధాన మంత్రి సమక్షం లో వారి అనుభవాల ను వెల్లడి చేయనున్నారు.
లబ్ధిదారుల కు విద్యుత్తు తో నడిచే ఒక చక్రాన్ని, సౌర శక్తి తో పని చేసే చరఖా ను, పడుగు ను మరియు చెక్కు ను ప్రధాన మంత్రి ప్రదానం చేయనున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన- ఎన్ఆర్ఎల్ఎమ్ సహకారం తో మహిళల స్వయం సహాయ బృందాలు ఒక చెక్కు ను ‘భారత్ కె వీర్’ నిధి కి విరాళం గా ప్రధాన మంత్రి కి అందజేయనున్నాయి.
ఒక జన సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.
కాన్‌పుర్ లో
660 మెగావాట్ సామర్ధ్యం కలిగిన విద్యుత్తు ఉత్పాదన మరియు పంపిణీ విభాగమైన పన్‌కీ పవర్ ప్లాంటు ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి లఖ్ నవూ మెట్రో రైలు ప్రోజెక్టు ను ప్రారంభించనున్నారు. లఖ్‌నవూ లోని చౌధరీ చరణ్ సింహ్ ఏర్ పోర్ట్ స్టేశన్ నుండి మెట్రో రైలు కు వీడియో లింక్ ద్వారా ఆయన జెండా ను చూపి, ఆ రైలు సర్వీసు ను ప్రారంభించనున్నారు. ఆగ్రా మెట్రో రైలు ప్రోజెక్టు కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
పిఎంఎవై లబ్ధిదారుల కు తాళం చెవుల ను ప్రధాన మంత్రి ప్రదానం చేయనున్నారు.
ఆ తరువాత ఒక జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.
గాజియాబాద్ లో:
మెట్రో లో భాగమైనటువంటి దిల్‌శాద్ గార్డెన్ – శహీద్ స్థల్ (న్యూ బస్ అడ్డా) సెక్షను ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఆయన శహీద్ స్థల్ మెట్రో స్టేశన్ నుండి మెట్రో రైల్ కు జెండా ను చూపి, ఆ రైలు ను ప్రారంభిస్తారు. ఎత్తయినటువంటి ఈ మెట్రో కారిడోర్ సెక్షన్ లో భాగం గా 8 స్టేశన్ లు ఉంటాయి. ఇది గాజియాబాద్ మరియు న్యూ ఢిల్లీ ల ప్రజల కు ప్రయాణించేందుకు సౌకర్యవంతమైనటువంటి రవాణా మాధ్యమం గా ఉండటం తో పాటు వాహన రాకపోకల లో రద్దీ ని కూడా తగ్గిస్తుంది.
గాజియాబాద్ లోని హిన్డన్ విమానాశ్రయ సివిల్ టర్మినల్ ను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. హిన్డన్ లో ఏర్పాటైన ఈ నూతన సివిల్ ఏర్ పోర్టు టర్మినల్ నుండి రాకపోక లు జరిపే దేశీయ విమాన సర్వీసుల తాలూకు ప్రయోజనాన్ని ఉత్తర్ ప్రదేశ్ పశ్చిమ ప్రాంత ప్రజల తో పాటు ఎన్‌సిఆర్ ప్రాంత ప్రయాణికులు పొందనున్నారు.
ఢిల్లీ – గాజీయాబాద్-మేరఠ్ ఆర్ఆర్‌టిఎస్ కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఇది రీజనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఆర్ఆర్‌టిఎస్) ప్రోజెక్టు ఆధారితమైనటువంటి ఒకటో హై స్పీడ్, ఇంకా హై ఫ్రీక్వెన్సీ రైలు మార్గం కానుంది. ప్రాంతీయ రవాణా సదుపాయాన్ని ఇది ఎంతగానో మెరుగుపరచనుంది; అలాగే అనేక ఉపాధి అవకాశాల ను అందజేయనుంది.
గాజియా బాద్ లో విద్య, గృహ నిర్మాణం, త్రాగు నీరు, పారిశుధ్యం, ఇంకా మురుగునీటి పారుదల నిర్వహణ లకు ఉద్దేశించిన వేరు వేరు పథకాల ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.
వివిధ పథకాల లబ్ధిదారుల కు ధ్రువీకరణ పత్రాల ను ఆయన ప్రదానం చేయనున్నారు.
ఆ తరువాత ఒక జన సమూహాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.