ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు రాజస్థాన్ లోని ఉదయ్‌పుర్ లో పర్యటించనున్నారు.
ఆయన అనేక ప్రధాన హైవే ప్రాజెక్టులకు పునాది రాయి వేస్తారు. ఈ పథకాల మొత్తం వ్యయం 15,000 కోట్ల రూపాయలకు మించి ఉండగలదని అంచనా.
ప్రారంభోత్సవం జరుపుకోనున్న పథకాలలో కోటా వద్ద చంబల్ నది మీద 6 దారుల లోహపు గొలుసులతో కూడిన వంతెన; ఎన్‌హెచ్-8 లో గోమతి చౌరాహా - ఉదయ్‌పుర్ సెక్షన్‌ను 4 దారుల అభివృద్ధిపరచడం మరియు ఎన్‌హెచ్-758 లో రాజ్‌సమంద్ - భీల్‌వాడా సెక్షన్‌ను 4 దారుల మార్గంగా అభివృద్ధిపరచడం వంటివి భాగంగా ఉన్నాయి. శంకుస్థాపన జరుగనున్న ముఖ్యమైన పథకాలలో జయ్ పుర్ రింగ్ రోడ్డు కూడా ఒకటిగా ఉంది.
అలాగే, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రధాన మంత్రి ఆ తరువాత ఉదయ్‌పుర్ లో ప్రతాప్ గౌరవ్ కేంద్రాన్ని సందర్శిస్తారు. ఈ కేంద్రం మేవాడ్ రాజ్యానికి చెందిన ప్రసిద్ధ రాజు మహారాణా ప్రతాప్ జీవితాన్ని గురించి, శౌర్యం గురించి, ఆయన సాధించిన విజయాలను గురించి వివిధ ప్రదర్శిత వస్తువుల ద్వారా చాటిచెప్తుంది.
Tomorrow I will be visiting Rajasthan, the land of the brave, where I will inaugurate & lay the foundation of key National Highway projects.
— Narendra Modi (@narendramodi) August 28, 2017
I will address a public meeting in Udaipur. I will also visit the Pratap Gaurav Kendra and pay my respects to the great Maharana Pratap.
— Narendra Modi (@narendramodi) August 28, 2017