ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019 వ సంవత్సరం జనవరి 3వ తేదీ న పంజాబ్ ను సందర్శించనున్నారు.
ఆయన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ (ఐఎస్ సి)-2019 యొక్క నూట ఆరో సంచిక ను జనవరి 3వ తేదీ న పంజాబ్ లోని జాలంధర్ లో ప్రారంభిస్తారు. ఈ సందర్భం గా ఆయన ప్రారంభోపన్యాసాన్ని కూడా ఇవ్వనున్నారు. ప్రధాన మంత్రి ఆ తరువాత పంజాబ్ లోని గురుదాస్ పుర్ కు వెళ్లి, అక్కడ ఒక పబ్లిక్ ర్యాలీ ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
దేశ వ్యాప్తం గా విజ్ఞాన శాస్త్రానికి, సాంకేతిక విజ్ఞానానికి, నూతన ఆవిష్కారాలకు ఉత్తేజాన్ని అందించాలనే ప్రధాన మంత్రి దార్శనికత కు అనుగుణంగా శ్రీ మోదీ ప్రధాన మంత్రి పదవి ని అలంకరించినప్పటి నుండి తాను ప్రసంగించే అయిదో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇదే కానుంది. గతం లో, ఆయన 2018వ సంవత్సరం లో ఐఎస్ సి యొక్క 105వ సంచిక లోను, 2017వ సంవత్సరం లో ఐఎస్ సి యొక్క 104వ సంచిక లోను, 2016వ సంవత్సరం లో ఐఎస్ సి యొక్క 103వ సంచిక లోను, మరియు 2015వ సంవత్సరం లో ఐఎస్ సి యొక్క 102వ సంచిక లోను ప్రారంభోపన్యాసం చేశారు.